osmania university campus
-
ఎన్ఈపీలో శుభ్రతను చేరుస్తాం
ఉస్మానియా యూనివర్సిటీ: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ–2020)లో శుభ్రత, మౌలిక వసతుల కల్పన అంశాలను కూడా చేరుస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రపరిచే యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ఈపీ కోసం కోట్లాది రూపాయాలను వెచ్చిస్తున్నామని ఇందులో మరుగుదొడ్ల పరిశుభ్రతకు నిధుల కేటాయింపుపై శ్రద్ధచూపుతామని తెలిపారు. తగిన యంత్రాంగం లేక దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మరుగుదొడ్లు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయని, వాటిని శుభ్రపర్చడం సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలో మరుగుదొడ్ల శుభ్రత, మంచినీరు, కరెంట్ బిల్లుల చెల్లింపు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారిందన్నారు. పాఠశాలల్లో టీచర్ల నియామకంతో పాటు మరుగుదొడ్లను శుభ్రపరిచే (శానిటేషన్) సిబ్బందిని కూడా నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ముందుకు రావాలన్నారు. అనంతరం ఎన్టీపీసీ అందచేసిన 94 యంత్రాలను వివిధ పాఠశాలల ప్రధాన అధ్యాపకులకు అందచేశారు. త్వరలో మరో 150 యంత్రాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మరుగుదొడ్డిని కిషన్‌రెడ్డి మిషన్‌తో శుభ్రపరిచారు. -
ఉస్మానియా ఉద్రిక్తం
* కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నిరసన వెల్లువ * ఉద్రిక్తతకు దారి తీసిన చలో అసెంబ్లీ ర్యాలీ * పోలీసులపై రాళ్ళు రువ్విన ఆందోళనకారులు * లాఠీచార్జి...ఐదుగురికి గాయాలు * నిరుద్యోగ జేఏసీ నేతలు అరెస్టు, విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మరోసారి ఉద్రిక్తతకు నెలవైంది. కాంట్రాక్టు ఉద్యోగులక్రమబద్ధీకరణ అంశంతో క్యాంపస్ భగ్గుమంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర అలజడి రేపింది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. వలయాలను చేధించుకుని ముందుకు దూసుకు వ స్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో మరికొంత మంది ఆందోళనకారులు పోలీసుల కళ్లుగప్పి గన్ పార్కు వ ద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ... అసెంబ్లీ వైపు దూసుకేళ్లేందుకు యత్నించారు. వారిని పోలీ సులు అడ్డుకుని దొరికిన వారిని దొరికినట్లే చితకబాదారు. 12 మందిని అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ఎన్సీసీ గేటు వద్ద... కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వర్సిటీకి చెందిన వందలాది మంది విద్యార్థులు ఇంటర్నల్ పరీక్షలను, తరగతులను బహిష్కరించారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి ఉదయం 11 గంటలకు ర్యాలీగా బయలుదేరారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్సీసీ గేటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే గేటు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న తమ ర్యాలీని అడ్డుకోవడం అప్రజస్వామికమని ఆరోపిస్తూ ఎన్సీసీ గేటు వద్దే సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అదే సమయంలో కొంతమంది విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వగా, ప్రతిగా పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఈ ఘటనలో జేఏసీ చైర్మన్ కళ్యాణ్, టీఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కిరణ్‌గౌడ్, జేఏసీ అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి, వీరబాబు, సోలంకి శ్రీనివాస్ గాయపడ్డారు. మరోవైపు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు కోటూరి మానవతరాయ్తో పాటు భీంరావ్నాయక్, రాము, బొప్పని ఈశ్వర్, శ్రీకాంత్, మల్లేష్, కమలాకర్, విజయ్‌కుమార్, రాజ్‌కుమార్, తిరుపతి, రాజారమేష్ తదితరులను చితకబాది అరెస్ట్ చేశారు. షహనాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, రాత్రి పొద్దుపోయిన తర్వాత విడిచిపెట్టినట్టు తెలిసింది. అరెస్టుకు నిరసనగా నేడూ ధర్నాలు కేసీఆర్ అనుసరిస్తున్న అణిచివేత ధోరణులకు నిరసనగా మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపపట్టాలని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్ పిలుపునిచ్చారు. నిరుద్యోగుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు మంగళవారం వివిధ పార్టీల నేతలను సంప్రదించనునట్లు చెప్పారు. డిసెంబరు మొదటి వారంలో విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనునట్లు అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి తెలిపారు. -
ఓయూలో పోటాపోటీ ర్యాలీలు... ఉద్రిక్తత
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థుల మధ్య వైరం రోజురోజూకు తీవ్రతరం అవుతుంది. యూనివర్శిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యోగులు రెగ్యులరైజ్‌కు మద్దతుగా సదరు ఉద్యోగులు శుక్రవారం... ఆర్ట్స్ కాలేజీ నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ర్యాలీకి వ్యతిరేకంగా యూనివర్శిటీ విద్యార్థులు మరో ర్యాలీ నిర్వహించారు. దాంతో యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంగణమంతా మోహరించారు. అయితే నిన్న సాయంత్రం భగీరథ హాస్టల్లో కొంత మంది ఆగంతకలు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో యూనివర్శిటీ రహదారులు, హాస్టళ్లు, కాలేజీల వద్ద పోలీసుల పహారాను భారీగా పెంచారు. -
ఓయూ క్యాంపస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తం
హైదరాబాద్: ఓయూలోని ఒప్పంద కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చడాన్ని నిరసిస్తు స్థానిక విద్యార్థులు గురువారం యూనివర్శిటీ క్యాంపస్‌లో కదం తొక్కారు. చలో తార్నాక కార్యక్రమానికి ర్యాలీగా విద్యార్థులు బయలుదేరారు. ఓయూ క్యాంపస్ సమీపంలోని ఆర్టీసీ ఆసుపత్రి వద్ద విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. పోలీసులపై రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ఓయూ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దాంతో ఓయూ క్యాంపెస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల
జూలై ఒకటి నుంచి మార్కుల జాబితాలు సింగిల్ సబ్జెక్టు తప్పిన వారూ అధికమే.. మెరుగుపడని ఫలితాలు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో గత ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. శుక్రవారం క్యాంపస్‌లోని అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీసీ ప్రొ.సత్యనారాయణ డిగ్రీ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్‌తోపాటు, ఇతర వెబ్సైట్లలోనూ విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచారు. బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు చెందిన లక్షా 70 వేల 958 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 52.40 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు జూలై ఒకటి నుంచి ఆయా కళాశాలల నుంచి మార్కుల జాబితాలను పొందవచ్చని సూచించారు. ఫెయిల్ అయిన వారు రీవాల్యుయేషన్ కోసం ఈనెల 16 నుంచి 27 వరకు, రూ.100 అపరాధ రుసుముతో జూలై ఒకటి వరకు ఏపీఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సింగిల్ సబ్జెక్టులో 9 వేల మంది ఫెయిల్.. వివిధ డిగ్రీ కోర్సుల్లో సింగిల్ పేపర్ తప్పిన వారు తొమ్మిది వేలకుపైగా ఉన్నారు. ఏటా సింగిల్ సబ్జెక్టులో సుమారు పది వేల మంది విద్యార్థులు ఫెయిల్ అవుతూ విద్యకు దూరంగా ఉంటున్నారు. ఇన్స్టంట్ లేదా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. పురోగతిలేని ఫలితాలు ఓయూ డిగ్రీ ఫలితాల శాతంలో పురోగతి కనిపించడం లేదు. ఏటా వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య సుమారు 2 లక్షల వరకు ఉంటున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు కళాశాలలు పెరుగుతోన్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. కానీ కళాశాలల్లో మౌలిక వసతుల కొరత, అనుభజ్ఞులైన అధ్యాపకులు, సరైన బోధన లేనందు వల్లే మెరుగైన ఫలితాలు రావడం లేదని తెలుస్తోంది. అనేక ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలకు అనుతిస్తున్నట్టు ఆరోపణలున్నా ఓయూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేటు కళాశాలలపై ఓయూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఫలితాలు దిగజారి పోతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. -
ఓయూలో తీవ్ర ఉద్రిక్తత: పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు
రాయలతెలంగాణ ప్రతిపాదనకు నిరసిస్తూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు యూనివర్శిటీ ప్రాంగణంలో గురువారం కదం తొక్కారు. అందులోభాగంగా యూనివర్శిటీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఎన్సీసీ గేట్ వద్ద ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు ఆగ్రహంతో ఉగిపోయారు. ఓయూలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులపై విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించారు. దాంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పుతున్న దశలో పోలీసులు రెండు సార్లు బాష్పవాయువును ప్రయోగించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ బుధవారం కూడా ఉస్మానియా విద్యార్థులు ఓయూలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దాంతో వారిని ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దాంతో ఓయూలో భారీగా పోలీసులు,భద్రత బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే. -
గందరగోళం ‘బాబు’: నారాయణ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణపై తన వైఖరేమిటో చెప్పలేక టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర గందరగోళపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. తెలంగాణకు అనుకూలమంటూ లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఘడియకో మాట మాట్లాడుతున్నారన్నారు. ఏఐఎస్ఎస్ జాతీయ మహాసభల సందర్భంగా గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘ఆయన (బాబు) ఫుల్, హాఫ్ మైండ్‌తో ఉన్నారని’ చమత్కరించారు. తొలుత రెండు కళ్ల సిద్ధాంతం, ఆ తర్వాత సమన్యాయం, ఇప్పుడేమో సమైక్యవాదమా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇంత అన్యమనస్కత పనికిరాదన్నారు. చంద్రబాబు ధైర్యం లేని నాయకుడని దుయ్యబట్టారు. తెలంగాణ ఇస్తామని ఊరిస్తున్న కాంగ్రెస్ పార్టీ- జనానికి సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా చూపిస్తోందన్నారు. -
ఓవరాల్ చాంప్‌గా ఎంవీఎస్ఆర్
జింఖానా, న్యూస్‌లైన్: ఇంటర్ కాలేజ్ స్విమ్మింగ్ టోర్నమెంట్లో ఆయుష్ యాదవ్ స్వర్ణపతకం సాధించాడు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో సోమవారం జరిగిన పురుషుల 100 మీ. ఫ్రీ స్టయిల్ విభాగంలో అతను మొదటి స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో వీరేశ్, దినకర్ వరుసగా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో పురుషుల విభాగంలో ఎంవీఎస్ఆర్, మహిళల విభాగంలో సెయింట్ ఫ్రాన్సిస్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నాయి. ఫలితాలు పురుషుల 400 మీ. ఫ్రీ స్టయిల్: 1. సాయి సృజన్ (వాసవీ కాలేజ్), 2. ఋషి కుమార్ (లయోలా అకాడమీ), 3. అమన్‌దీప్ సింగ్ (అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్); 200 మీ. బటర్‌ఫ్లయ్: 1. ప్రణయ్ (ఐఐఎమ్‌సీ), 2. వీరేష్ (ఏవీ కాలేజ్), 3. ఆయుష్ యాదవ్ (భవాన్స్ కాలేజ్); 200 మీ. బ్యాక్ స్ట్రోక్: 1. దినకర్ (భవాన్స్ కాలేజ్), 2. యోగేందర్ (లయోలా అకాడమీ), 3. హరీష్ (మాతృశ్రీ కాలేజ్); 200 మీ. బ్రెస్ట్ స్ట్రోక్: 1. ఉదయ్ కుమార్ (ఎంవీఎస్ఆర్), 2. రోహన్ మానే (భవాన్స్ కాలేజ్), 3. రాహుల్ (ఎంవీఎస్ఆర్); 200 మీ. ఫ్రీ స్టయిల్: 1. సాయి సృజన్ రెడ్డి (వాసవీ కాలేజ్), 2. ప్రణయ్ కుమార్ (ఐఐఎంసీ), 3. ఋషి కుమార్ (లయోలా అకాడమీ); 100 మీ. బటర్‌ఫ్లై: 1. ప్రణయ్ కుమార్ (ఐఐఎంసీ), 2. వీరేష్ (ఏవీ కాలేజ్), 3. హబీబ్ అహ్మద్ (అన్వర్-ఉల్-ఉలూమ్); 100 మీ. బ్రెస్ట్ స్ట్రోక్: 1. ఉదయ్ కుమార్ (ఎంవీఎస్ఆర్), 2. రాహుల్ (ఎంవీఎస్ఆర్), 3. రోహన్ యానే (భవాన్స్ కాలేజ్); 100 మీ. బ్యాక్ స్ట్రోక్: 1. దినకర్ (భవాన్స్ కాలేజ్), 2. యోగేందర్ (లయోలా అకాడమీ), 3. హరీష్ (ఎంవీఎస్ఆర్); 50 మీ. బ్రెస్ట్ స్ట్రోక్: ఉదయ్ కుమార్ (ఎంవీఎస్ఆర్), 2. ప్రణయ్ కుమార్ (ఐఐఎమ్‌సీ), 3. దినకర్ (భవాన్స్ కాలేజ్); 50 మీ. బటర్‌ఫ్లయ్: 1. ప్రణయ్ కుమార్ (ఐఐఎంసీ), 2. దినకర్ (భవాన్స్ కాలేజ్), 3. ఉదయ్‌కుమార్ (ఎంవీఎస్ఆర్); 50 మీ. ఫ్రీ స్టయిల్: 1. యోగేందర్ (ఐఐఎంసీ), 2. ఉదయ్ కుమార్ (ఎంవీఎస్ఆర్), 3. సాయి సృజన్ రెడ్డి (వాసవీ కాలేజ్). మహిళల 400 మీ. ఫ్రీ స్టయిల్: 1. నమిత (సెయింట్ ఫ్రాన్సిస్), 2. ప్రీతి కె. రెడ్డి (సెయింట్ ఫ్రాన్సిస్), 3. కరిష్మా (సెయింట్ ఫ్రాన్సిస్); 200 మీ. ఫ్రీ స్టయిల్: 1. శృతి వెల్లోరె (అరోరా); 2. హేమంగి మోర్జారియ (అరోరా), 3. శృతి (అరోరా); 200 మీ. బ్రెస్ట్ స్ట్రోక్ : 1. సాక్షి యాదవ్ (సెయింట్ ఫ్రాన్సిస్), 2. స్పటిక (సెయింట్ ఫ్రాన్సిస్); 100 మీ. బటర్‌ఫ్లయ్: 1. నమిత (సెయింట్ ఫ్రాన్సిస్), 2. హేమంగి మోర్జారియ (అరోరా).