ఓయూలో తీవ్ర ఉద్రిక్తత: పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు | High Tension at Osmania University Campus | Sakshi
Sakshi News home page

ఓయూలో తీవ్ర ఉద్రిక్తత: పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు

Published Thu, Dec 5 2013 11:55 AM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM

ఓయూలో తీవ్ర ఉద్రిక్తత: పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు - Sakshi

ఓయూలో తీవ్ర ఉద్రిక్తత: పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు

రాయలతెలంగాణ ప్రతిపాదనకు నిరసిస్తూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు యూనివర్శిటీ ప్రాంగణంలో గురువారం కదం తొక్కారు. అందులోభాగంగా యూనివర్శిటీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఎన్సీసీ గేట్ వద్ద ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు ఆగ్రహంతో ఉగిపోయారు. ఓయూలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

 

దీంతో పోలీసులపై విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించారు. దాంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పుతున్న దశలో పోలీసులు రెండు సార్లు బాష్పవాయువును ప్రయోగించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ బుధవారం కూడా ఉస్మానియా విద్యార్థులు ఓయూలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దాంతో వారిని ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దాంతో ఓయూలో భారీగా పోలీసులు,భద్రత బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement