విద్యార్థి ఆత్మహత్య... గీత కార్మికునికి గుండెపోటు
నిజాంసాగర్, న్యూస్‌లైన్: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలంటూ ఎమ్మెస్సీ బీఎడ్ పూర్తిచేసిన విద్యార్థి ప్రాణత్యాగం చేశాడు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గ్రామానికి చెందిన మొకిరె దుర్గయ్య-దేవవ్వ దంపతుల పెద్ద కుమారుడు రాములు (23) రాయల తెలంగాణకు కేంద్రం అనుకూలంగా నిర్ణయం తీసుకుందనే వార్తలతో కలత చెందాడు. బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. ఉదయం ఎంతకూ నిద్రలేవకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి విగతజీవిగా కనిపించాడు. పది జిల్లాలతో కూడిన తెలంగాణతోపాటు, ఎలాంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటుచేసేలా సోనియాగాంధీ చూడాలని రాములు సూసైట్ నోటులో పేర్కొన్నాడు.
‘రాయల తెలంగాణ’తో గుండె ఆగి...
కమాన్‌పూర్ : రాయల తెలంగాణ ప్రకటిస్తున్నారనే వార్తలను టీవీలో చూస్తూ మనస్తాపం చెందిన కరీంనగర్‌జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన బుర్ర శంకరయ్యగౌడ్(46) అనే గీత కార్మికుడు మంగళవారం రాత్రి కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు.
‘రాయల తెలంగాణ’తో కలతచెంది ఇద్దరి మృతి
Published Thu, Dec 5 2013 3:24 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement