హైదరాబాద్ : అసెంబ్లీ ముట్టడికి ఓయూ విద్యార్థులు శనివారం యత్నించారు. అయితే వారిని పోలీసుగు గన్పార్క్ వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలో తెలంగాఱ బిల్లుపై వెంటనే చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన 20మంది విద్యార్థులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు.