
రోడ్డుపై బైఠాయించిన ఓయూ విద్యార్థినీలు
ఓయూ(హైదరాబాద్): తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఓయూలోని విద్యార్థినీలు గురువారం రాత్రి రోడ్డుపై బైఠాయించారు. ఉస్మానియా వర్సిటీలోని లేడీస్ హాస్టల్‌లో విద్యార్థినీలు తము పడుతున్న అవస్థలుపై అధికారులు స్పందించడం లేదని రోడ్డెక్కారు. ఒకే గదిలో పదిమంది విద్యార్థినీలు ఉండటంతో నానా యాతన పడుతున్నామని వారు వాపోతున్నారు.
అలాగే, భోజనం కూడా సరిగా ఉండటం లేదని విద్యార్థినీలు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలను ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టుకున్న పరిష్కారం కాకపోవడంతోనే హాస్టల్ ఎదుట బైఠాయించామని బాధితులు తెలిపారు.