సీఎం ప్రకటన వెనక్కు తీసుకోవాల్సిందే
- విద్యార్థి నేతల డిమాండ్
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలోని 11 ఎకరాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను ఉపసంహరించుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తావుని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. సీఎం వైఖరికి నిరసనగా శనివారం ఓయూలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వూట్లాడుతూ న్యాయం కోసం ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులపై నాన్‌బెలబుల్ కేసులు బనారుుంచడం దారుణమని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ (విజృంభణ), ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ (తిరుగుబాటు) టీవీవీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల భూ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు అంజియాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. ఓయూ భూములపై కేసీఆర్ ప్రకటనలను ఉపసంహరించుకోవాలని, ఆక్రమిత భూములను యూనివర్సిటీ పరం చేయూలని కోరారు.
ముఖ్యమంత్రి ప్రకటనకు వ్యతిరేకంగా అమ్ ఆద్మీ పార్టీ, అనుబంధ సీవైఎస్‌ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో క్యాంపస్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఓయూ విశ్రాంత ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్‌రావు నేతృత్వంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మెడికల్ విభాగంలో అన్ని కేటగిరిల సీట్లకు కామన్ ఫీజు విధానాన్ని అమలు చేయాలని, బీ కేటగిరి సీట్ల ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచడాన్ని నిరసిస్తూ నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఓయూ భూములపై సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివారం నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పోరు గర్జన సభను నిర్వహించనున్నట్లు నాయుకులు ఆంజనేయులు, శివప్రసాద్ తెలిపారు.