'వారిది న్యాయమైన పోరాటం' | Telangana Congress Leaders Condemn Lathicharge on OU Students | Sakshi
Sakshi News home page

'వారిది న్యాయమైన పోరాటం'

Jul 21 2014 3:10 PM | Updated on Sep 2 2017 10:39 AM

'వారిది న్యాయమైన పోరాటం'

'వారిది న్యాయమైన పోరాటం'

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై లాఠీచార్జ్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు మధుయాష్కీ, వివేక్‌, రాజయ్య, పొన్నం ప్రభాకర్ ఖండించారు.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై లాఠీచార్జ్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు మధుయాష్కీ, వివేక్‌, రాజయ్య, పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఉద్యోగాల కోసం విద్యార్ధుల చేస్తున్నది న్యాయమైన పోరాటమని సమర్థించారు. ఇంటికో ఉద్యోగమన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఓయూ విద్యార్ధుల పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న వాస్తవాన్ని టీఆర్ఎస్ నాయకులు మర్చిపోరాదని అన్నారు. తమకు ఉద్యోగాలు రావన్న విద్యార్ధుల ఆందోళనపై టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement