హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ అంశాన్ని వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన సబబేనని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ఆందోళన చేస్తున్నవారిపై లాఠీఛార్జ్ చేయటం సరికాదని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. విద్యార్థులను అవమానించే విధంగా మాట్లాడిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి క్షమాపణ చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగటం బాధాకరమన్నారు.
హోంమంత్రి నాయిని క్షమాపణ చెప్పాలి
Published Mon, Jul 21 2014 1:27 PM | Last Updated on Sat, Oct 20 2018 5:05 PM
Advertisement
Advertisement