విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి | Student problems to be solve | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి

Published Sun, Jun 28 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాసనవుండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. శనివారం కాంగ్రెస్ రాష్ట్ర మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శారదతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయున వూట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధనకు విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన  చేస్తున్నా ప్రభుత్వం  పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

అనవసర ఆర్భాటాలకు కోట్లు వెచ్చిస్తున్న పాలకులు విద్యార్థుల మెస్ చార్జీలు చెల్లించకపోవడం దారుణవున్నారు. యుూనివర్సీటలకు వీసీలను నియమించడం లేదని, ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేయకుండా వుుఖ్యవుంత్రి విద్యార్థులపై వివక్ష చూపుతున్నారన్నారు.

ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల  సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజల ఆశలు అడియూసలయ్యూయుని నెరేళ్ళ శారద ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టాలిన్, డేవిడ్, సలీంపాషా, మోహినుద్దీన్, రమేష్‌ముదిరాజ్, విజయ్‌యాదవ్, చరణ్‌కౌశిక్ యాదవ్, శ్రీథర్‌గౌడ్, బొమ్మ హన్మ ంతరావు, పుప్పాల మల్లేష్, కొల్లురి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement