government actions
-
రాజకీయాలతో ప్రమేయమున్నా పీఎంఎల్ఏ పరిధిలోకి..
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాజకీయాలతో ప్రమేయమున్న వ్యక్తుల (పీఈపీ) ఆర్థిక లావాదేవీలను కూడా రిపోర్టింగ్ సంస్థలు (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొదలైనవి) తప్పనిసరిగా రికార్డు చేసేలా పీఎంఎల్ఏ చట్టానికి సవరణలు చేసింది. అలాగే, లాభాపేక్ష రహిత సంస్థల (ఎన్జీవో) ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఆర్థిక సంస్థలు సేకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు లేదా దేశాధినేతలు, సీనియర్ రాజకీయ నేతలు, సీనియర్ ప్రభుత్వ ..న్యాయ .. మిలిటరీ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, కీలకమైన రాజకీయ పార్టీల అధికారులు పాటు ఇతర దేశాల తరఫున ప్రభుత్వపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీఈపీల పరిధిలోకి వస్తారని ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ఆర్థిక సంస్థలు తమ ఎన్జీవో క్లయింట్ల వివరాలను నీతి ఆయోగ్‌కి చెందిన దర్పణ్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆయా క్లయింట్లతో వ్యాపార సంబంధాలు ముగిసిన తర్వాత కూడా అయిదేళ్ల పాటు రికార్డులను అట్టే పెట్టాల్సి ఉంటుంది. ఈ సవరణ కారణంగా పీఈపీలు, ఎన్జీవోల ఆర్థిక లావాదేవీల రికార్డులను రిపోర్టింగ్ సంస్థలు తమ దగ్గర అట్టే పెట్టుకోవడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగినప్పుడు వాటిని అందించాల్సి ఉండనుంది. ఇప్పటివరకూ రిపోర్టింగ్ సంస్థలు తమ క్లయింట్ల గుర్తింపు ధృవీకరణ పత్రాలు, వ్యాపారపరమైన ఉత్తర ప్రత్యుత్తరాలు, అకౌంటు ఫైళ్లూ, రూ. 10 లక్షల పైబడిన నగదు లావాదేవీలు మొదలైన వివరాలను రికార్డు చేయాల్సి ఉంటోంది. ఇకపై క్లయింట్ల రిజిస్టర్డ్ ఆఫీసు చిరునామా, కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రదేశం వంటి వివరాలు కూడా సేకరించాల్సి ఉంటుంది. -
గొడవకు మూల్యం.. ఆ ఇద్దరికీ ప్రభుత్వం షాక్!
బనశంకరి: నువ్వెంత అంటే, నువ్వెంత అని ఆరోపణలు చేసుకుని అమీతుమీకి సిద్ధమైన ఐపీఎస్ అధికారిణి డి.రూపా మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి డి.రోహిణి సింధూరి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఐపీఎస్ రూపాను బదిలీచేసి, ఆ పోస్టులో ఐఏఎస్ భారతిని సర్కారు నియమించింది. దేవాదాయశాఖ కమిషనర్ పోస్టు నుంచి రోహిణిని బదిలీ చేసి ఆ స్థానంలో హెచ్.బసవరాజేంద్రను నియమించింది. రూప, రోహిణికి ఎలాంటి పోస్టులు లేకుండా వెయిటింగ్లో ఉంచడం గమనార్హం. ఐపీఎస్ రూప భర్త బదిలీ ఇక ఐపీఎస్ రూప భర్త మౌనీశ్ మౌద్గిల్ ఐఏఎస్ అధికారి కాగా, ఆయన ప్రస్తుతం సర్వే, భూరికార్డుల శాఖ కమిషనర్‌గా ఉండేవారు. తాజా గొడవల నేపథ్యంలో ఆయనకు కూడా బదిలీ తప్పలేదు. సిబ్బంది పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు స్థానభ్రంశమైంది. ఆయన పోస్టులో సర్వేశాఖ అదనపు డైరెక్టర్ గా ఉన్న సీఎన్.శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ బదిలీల్లో భాగంగా పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న ఐఏఎస్ హెచ్వీ.దర్శన్ ను తుమకూరు మహానగర పాలికె కమిషనర్‌గా నియమించింది. ఘాటుగా నోటీసులు ఇద్దరు మహిళా అధికారుల విభేదాల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఉభయులకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మ సూచనమేరకు నోటీసులు అయ్యాయి. హద్దుమీరి ప్రవర్తించరాదని అందులో హెచ్చరించారు. ఆరోపణలు చేసుకోవడం స రీ్వస్ బంధనల ఉల్లంఘన కు పాల్పడినట్లు అవుతుంది, బహిరంగంగా మాట్లాడరాదు, ఒకవేళ మళ్లీ మాటల యుద్ధానికి దిగితే కఠినచర్యలు తీసుకుంటామని నోటీస్‌లో పేర్కొన్నారు. మీ ఆరోపణలను ప్రభుత్వం ముందు పెట్టవచ్చు, ఇకపై మీడియా ముందుకు వెళ్లరాదని నోటీసుల్లో సిబ్బంది, పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి జేమ్స్ తారకన్ పేర్కొన్నారు. రూపపై కేసు నమోదుపై మీమాంస రోహిణి సింధూరి భర్త సుదీర్‌రెడ్డి ఐపీఎస్ రూపాపై బాగలగుంటె పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. తన భార్య ఫోన్‌ను హ్యాక్ చేసి ఫోటోలు దొంగిలించారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుపై పోలీసులు న్యాయ నిపుణులతో సంప్రదించారు. ఒకవేళ కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్లి ఎఫ్ఐఆర్ని నమోదు చేయించాలని రోహిణి కుటుంబసభ్యులు సిద్దమయ్యారు. కేబినెట్ భేటీలో చర్చ సోమవారం సాయంత్రం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రూపా– రోహిణి రగడ గురించి కొందరు మంత్రులు లేవనెత్తారు. ముఖ్యమంత్రి బొమ్మై సైతం తీవ్రంగా పరిగణించి వారిని బదిలీ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఆదివారం రూపా ఫేస్బుక్ ద్వారా ఆరోపణలు చేయడం, అందుకు రోహిణి ఘాటుగా బదులివ్వడం, సోమవారం వివాదం విధానసౌధకు చేరి ఇద్దరూ మీడియా ముందు అక్కసు వెళ్లగక్కడంతో వేడెక్కింది. మంగళవారం ఇరువర్గాలూ మౌనం దాల్చడంతో శాంతియుత వాతావరణం ఏర్పడింది. -
ధరల స్పీడ్‌ను నిలువరిస్తున్నాం..
జైపూర్: ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్నారు. ఉదాహరణకు, దేశీయ ఉత్పత్తిని పెంచే దిశలో పప్పుధాన్యాలు పండించడానికి ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. అలాగే స్థానిక లభ్యతను మెరుగుపరచడానికి కొన్ని పప్పుధాన్యాలపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. వివిధ వర్గాలతో 2023 బడ్జెట్ తదుపరి చర్చాగోష్టి నిర్వహించడానికి ఇక్కడికి వచ్చిన ఆర్థిక మంత్రి విలేకరులతో ఇంకా ఏమన్నారంటే.. ‘‘గత మూడేళ్లుగా వంట నూనెల దిగుమతిపై దాదాపు పన్ను విధించడంలేదు. దీని కారణంగా పామ్ క్రూడ్, పామ్ రిఫైన్డ్ ఆయిల్ అందుబాటులో విఘాతం కలగడం లేదు. వంట నూనెల సరఫరా సులభతరం కావడంతోపాటు, డిమాండ్‌ను దేశం తేలిగ్గా ఎదుర్కొనగలుగుతోంది. ధరల స్పీడ్ ఇదీ... టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 జనవరిలో 4.73 శాతంగా (2022 ఇదే నెలతో ధరతో పోల్చి) నమోదయ్యింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి టోకు ధరల స్పీడ్ నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ, ఇంధనం, విద్యుత్ ధరలు తగ్గినా, ఫుడ్ ఆర్టికల్స్ బాస్కెట్ మాత్రం పెరిగింది. టోకు ధరల సూచీ వరుసగా ఎనిమది నెలల నుంచి తగ్గుతూ వస్తుండడం సానుకూల అంశమైనా, ఆహార ధరల తీవ్రతపై జాగరూకత వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరించారు. 10 నెలల అప్‌ట్రెండ్ తర్వాత నవంబర్, డిసెంబర్లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ఉన్న వినియోగ ధలర సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో మళ్లీ 6.52 శాతం పైబడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఈ సూచీలో ఒక్క ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ 5.94 శాతంగా ఉంది. ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధానాలకు ముఖ్యంగా రెపోపై నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపది క అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4% గా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు), మే 4న మొదటిసారి 0.40% పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అర శాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఈ నెల మొదట్లో వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. దీనితో రెపో మొత్తంగా 6.5 శాతానికి చేరింది. జనవరి రిటైల్ ధరల స్పీడ్ నేపథ్యంలో ఏప్రిల్‌లో జరిగే పాలసీ సమీక్షలో మరో పావు శాతం రెపో ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రాలకు ఎన్పీఎస్ నిధులు బదిలీ చేయలేం కాగా, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కోసం డిపాజిట్ అయిన నిధులను ప్రస్తుత చట్టాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించలేమని అటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి కూడా స్పష్టం చేశారు. ‘‘ఏదైనా రాష్ట్రం ఎన్పీఎస్ కోసం డిపాజిట్ చేసిన నిధులను వారికి తిరిగి ఇవ్వవచ్చని ఆశించినట్లయితే అది అసాధ్యం’’ అని వారు స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ఇటీవల భారీ పతనాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉటంకిస్తూ, జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) పెట్టుబడి పెట్టే షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వదిలివేయలేని పేర్కొన్నారు. ఎన్‌పీఎస్‌లో డిపాజిట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిధులను రాష్ట్రాలకు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)కు నిధులను బదిలీ చేయకపోతే రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి, ఆ శాఖ సీనియర్ అధికారి నుంచి వచ్చిన ప్రకటనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పాత పెన్షన్ స్కీమ్‌కు తిరిగి వెళ్లడానికి కొన్ని రాష్ట్రాలు నిర్ణయించడం, ఇతర రాష్ట్రాల్లో ఈ డిమాండ్ పుంజుకోవడం మంచి పరిణామం కాదని ఆర్థిక కార్యదర్శి జోషి ఈ సందర్భంఆ స్పష్టం చేశారు. ‘‘కొత్త పెన్షన్ పథకంలోని డబ్బు ఉద్యోగులకు సంబంధించినది. ఇది ఉద్యోగి– ఎన్పీఎస్ ట్రస్ట్‌కు మధ్య ఒప్పందం. ఉద్యోగి మెచ్యూరిటీకి ముందు లేదా పదవీ విరమణ వయస్సు రాకముందే నిష్క్రమిస్తే, అప్పుడు అనుసరించాల్సిన విధానాలపై పలు నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి’’ అని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
చిన్న సంస్థల ఎగుమతులకు ప్రభుత్వ సహకారం
న్యూఢిల్లీ: చిన్న వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈలు మరిన్ని ఎగుమతులు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగం తన సామర్థ్యం మేరకు ఎగుమతులు చేసేందుకు నూతన విధానాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ‘ఉద్యమి భారత్’ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ, ఎంఎస్ఎంఈ రంగానికి పలు చర్యలను ప్రకటించారు. భారత దేశ ఎగుమతులు పెరిగేందుకు, మరిన్ని మార్కెట్లకు భారత ఉత్పత్తులు చేరుకునేందుకు ఎంఎస్ఎంఈ రంగం బలంగా ఉండడం అవసరమని చెప్పారు. ‘‘మీ సామర్థ్యాలు, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త విధానాలను రూపొందిస్తోంది. ఇవన్నీ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం, వాటి నాణ్యతను పెంచడం కోసమే. భారత ఎంఎస్ఎంఈల ఎగుమతులు పెంచాలి. ఈ దిశగా పనిచేయాలని విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు చెప్పాం. భారత మిషన్స్.. వాణిజ్యం, టెక్నాలజీ, టూరిజం అనే మూడు అంశాల ఆధారంగా పనిచేస్తుంది’’అని ప్రధాని వివరించారు. రుణాలకు సమస్యలు.. గ్యారంటీలు లేకుండా రుణాలు పొందలేని విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఇది సంస్థలను స్థాపించాలని భావించే బలహీన వర్గాల ఆకాంక్షలకు అతిపెద్ద అవరోధంగా పేర్కొన్నారు. అందుకనే తాము ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. దీని కింద ప్రతి భారతీయుడు సులభంగా వ్యాపారం ప్రారంభించొచ్చన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే రూ.19 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలా రుణ సాయాన్ని పొందిన వారి నుంచి ఏడు కోట్ల మంది మొదటిసారి వ్యాపారులుగా మారినట్టు వివరించారు. ముద్రాయోజన కింద 36 కోట్ల రుణ ఖాతాలను మంజూరు చేయగా, అందులో 70% మహిళలకు ఇచ్చినవే ఉన్నాయని చెప్పారు. ఎంఎస్ఎంఈల పనితీరును పెంచే పథకం ‘ఆర్‌ఏఎంపీ’, మొదటిసారి ఎగుమతి చేసే ఎంఎస్ఎంఈల సామర్థ్య నిర్మాణం కోసం ‘సీబీఎఫ్‌టీఈ’ పథకాలను ప్రధాని ప్రారంభించారు. -
మన సమైక్యతే కరోనాకు కొరడా!
‘భారత్‌లో వైరస్ వ్యాధుల నివారణకు అవసరమైన పరీక్షా పరికరాలు, పద్ధతులు ఇప్పటికీ లేకపోవడం విచారించదగ్గ విషయం. మన దేశ జనాభాలో ప్రతి పది లక్షలమందిలో కేవలం పదిశాతం మందినే పరీక్షించగల్గుతున్నాం. థాయ్‌లాండ్‌లో ప్రతి పది లక్షలమందిలో 120 మందికి ఈ పరీక్షలు జరుగుతాయి. అలాగే వియత్నాంలో పది లక్షలమందిలో 40 మందికి పరీక్షలు నిర్వహిస్తారు. మన దేశంలో పరీక్షలు అవసరమైన సందర్భాల్లో మాత్రమే పరిమితమైన పరీక్షా పరికరాలను వాడకానికి ఉంచామన్నది సమాధానం. అలాంటి అవసరం నేడు కరోనా లాంటి మహమ్మారి వ్యాధుల నివారణ సందర్భంగా ఉందా లేదా ? ఇంతకన్నా జరూరైన అవసరం ఏముంటుంది? ఉన్న పరిమిత పరీక్షా పరికరాలు నేటి ఉపద్రవానికి సరిపడా లేవు. అనేక దేశాలు ఈ రోజు ఈ కొరతలో ఉన్నాయి. అందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గెబ్రియాసస్ ఇబ్బడిముబ్బడిగా ఈ టెస్టింగ్ పరికరాల అవసరాన్ని నొక్కి చెబుతూ ‘నీవు ఎదుర్కోదలిచిన మంటల్ని కళ్లు మూసుకుని ఎదుర్కోలేవుసుమా’ అని హెచ్చరించాల్సి వచ్చింది’ – రోగ నిర్ధారణ శాస్త్ర అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ రమణన్ లక్ష్మీనారాయణన్, హెల్త్‌కేర్ (19.03.20) నేడు ప్రపంచవ్యాపితంగా కరోనా వ్యాధి సోకిన వారి సంఖ్య మూడు లక్షలకు చేరుకుని మన దేశంతో సహా 160 దేశాలలో ఆత్యయిక పరిస్థితులు(లాక్డౌన్స్) ప్రకటించుకోవలసిన దుస్థితి దాపురించింది. కాగా, ఈ వ్యాధి పుట్టి పెరిగిన చైనాలో విదేశీ యాత్రికుల ద్వారా సోకినా కరోనా మహమ్మారి కాస్తా 3,270 మంది చైనీయుల్ని మింగేసిన తరువాత అక్కడి ప్రభుత్వం సత్వర జాగ్రత్తలు తీసుకుంది. సరికొత్త ‘ప్లాస్మా’ ఇంజెక్షన్స్ ప్రయోగించి, ఇప్పుడు కరోనా పూర్తి అదుపులోకి వచ్చినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో మేల్కొని టెస్టింగ్ పరికరాల తీవ్ర కొరత మధ్యనే వీలైనంత వేగంగా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారిలో అన్ని వయసులవారినీ క్వారంటైన్ చేసి పరీక్షల అనంతరం గానీ పంపించడం లేదు. ఇదే సందర్భంగా మనం మన క్షమించరాని అశ్రద్ధవల్ల, అవసరాల పేరిట కలగజేస్తున్న చేటువల్ల వాతావరణం ఎలా నాశనమవుతున్నదో ప్రపంచ శాస్త్రవేత్తలు, వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మన కళ్లముందే జరుగుతున్న వినాశనాన్ని, మానవాళికి జరుగుతున్న ముప్పునూ కాళ్లూ చేతులూ కాలేదాకా మనం గ్రహించలేదు. సరిగదా శాస్త్రీయ పరిజ్ఞానానికి, అఖండ విజయాలకు దోహదం చేసిన, చేస్తున్న సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలయిన ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్లాంటివారిని న్యూనత పరిచి, ఎగతాళి చేస్తున్నారు. విజ్ఞాన శాస్త్ర విజయాలను మూఢవిశ్వాసాలతో అవమానపరుస్తున్నారు. ఇలాంటి పాలకులు ఎక్కడున్నా నిరసించవలసిందే. ప్రతిఘటించవలసిందే! మానవాళికి అతిభయంకరమైన విపత్తు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, విజ్ఞాన శాస్త్ర పరిశోధకులు పదే పదే చేస్తున్న హెచ్చరికను మనం విస్మరించరాదు. ‘ప్రపంచంలో భూమిని ఢీకొన్న ఉల్కాపాతం(యాస్టరాయిడ్), అణ్వస్త్ర యుద్ధానికి మధ్యకాలంలో మానవ జాతి వినాశనానికి దోహదం చేసిన విపత్కర పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. మానవాళి ఎదుర్కొన్న విపత్తుల్లోకెల్లా భయంకర వ్యాధి క్రిమి(వైరస్) వ్యాప్తి. ఈ విషయమై అనేక సమావేశాలు జరిపి సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వాలను హెచ్చరించామ’ని బాధ్యతగల వైరస్ శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి మరిచిపోరాదు! అంతేగాదు. శత్రువుకి భయపడి ఎదుర్కోలేమని, ‘సార్స్’, ‘కరోనా’ లాంటి తక్షణం చిత్తగించలేని కరోనా వ్యాధుల సందర్భంగా ప్రజ లంతా, మానవాళి యావత్తూ సామూహికంగా సోదరత్వం, ఆత్మీయ సంఘీభావంతో ఒకరికొకరు తోడుగా, నీడగా నిలబడాల్సిన అవసరం మరింతగా ఉందని గ్రహించాం. బహుశా అందుకనే ‘కరోనా’ మహమ్మారిని చైనా ఎదుర్కొని పరిష్కరించుకున్న తీరుతెన్నుల గురించి అధ్యయనం చేసేందుకు యూరప్, అమెరికాల నుంచి వైద్య నిపుణులు కొందరిని చైనాకు పంపించినట్టు వార్తాసంస్థల తాజా భోగట్టా! అయితే ఇక్కడ గమనించాల్సిన కీలకమైన అంశం–పటిష్టమైన వ్యవస్థాగత నిర్మాణం గురించి. పోరాటాలద్వారా, విప్లవోద్యమాల ద్వారా గడించి సాధించుకున్న స్వాతంత్య్రానికి, ఇతర సాత్వికోద్యమాల ద్వారా సాధించుకున్న స్వాతంత్య్ర వ్యవస్థలకూ మధ్య ప్రజలను చైతన్యపరచడంలో తేడా ఉండకపోదు. ఈ సందర్భంగా ఒక మిత్రుడు పంపిన ఆత్మీయ లేఖను పాఠకుల సౌకర్యార్థం ఇక్కడ యథాతథంగా అందిస్తున్నాను. సూక్ష్మజీవితో ప్రపంచయుద్ధం ‘‘ఒక సూక్ష్మ జీవి కంటికి కనబడదు. దాన్ని చూసిన వాళ్లెవరూ లేరు. అయినా న్యూయార్క్‌లోని ఒక వెయిటర్, బెంగళూరులోని కూలీ, తెలంగాణలోని మొక్కజొన్న రైతు, కువైట్‌లోని క్షవరశాల వర్కర్ –ఆ సూక్ష్మ జీవితో యుద్ధం చేస్తున్నారు. నిశ్శబ్దంగా అన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఎక్కడో చైనాలో వచ్చింది, మనకేం కాదులే అనుకున్నాం. చైనా వాళ్లు ఏం చేసినా ఓవర్ యాక్షన్ అనుకున్నాం. తమ దేశానికే గోడ కట్టేసుకున్న మొండివాళ్లనుకున్నాం. కానీ వైరస్‌ను కూడా అంతే మొండిగా తరిమేశారు. అది ప్రపంచంమీదికి వచ్చిపడింది. ఇదేదో చిన్న విషయం అనుకున్నాం. కానీ ఇటలీ ఒక పెద్ద యుద్ధమే చేస్తోంది. ఎంత పెద్ద యుద్ధమంటే, 80 ఏళ్లు పైబడినవాళ్లు చచ్చినా ఫర్వాలేదనుకునే యుద్ధం అది! ఇప్పుడు ప్రపంచంలోని అన్ని రాజకీయాలు పక్కకెళ్లిపోయాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఎవరికీ ఆలోచన లేదు. సిరియా సంక్షోభం పైన వార్తలు లేవు. ఇరాన్ రాజకీయాలు మానేసి ప్రజల్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. జిహాద్ అని అరిచేవాళ్లు కూడా ఈ కొత్త(కరోనా) శత్రువుకి భయపడుతున్నారు. పాకిస్తాన్‌కి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తాలిబాన్లు కూడా చర్చల గురించి మాట్లాడ్డం లేదు. ప్రపంచయుద్ధాలప్పుడు కూడా ఇంత సంక్షోభం లేదు. దేశాలని దాటితే ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టుగా ఎవరి గూట్లోకి వాళ్లు వేరుపడి(ఐసోలేషన్ లోకి) వెళ్లిపోవడం ఎప్పుడూ జరగలేదు. పార్కుల్లో మనుషులు లేరు. ఆలయాలు ఖాళీ, సినిమాహాళ్లు లేవు. మనుషులందరినీ కలిపే సంబరాలు, ఉత్సవాలు లేనేలేవు. తిరుమలలో క్యూలైన్లు లేవు. ఇక ఎక్కడో ఉందిలే అనుకుంటే అది కాస్తా(కరోనా) మన వూరికి కూడా వచ్చేసింది. అమెరికాలో జాక్సన్‌విల్లీలో 20 కేసులు నమోదయ్యాయి. ఆ ఊరికీ, నాకూ ఏ సంబంధం లేదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు. విన్నప్పట్నుంచీ టెన్షన్. ఇది నా ఒక్కడి బాధ కాదు, ప్రపంచమంతటి బాధ. న్యూయార్క్‌లో ఆంక్షలు పెడితే నూజివీడులోని వందలాదిమంది తల్లిదండ్రులు నిద్రపోరు. కాలిఫోర్నియాలో కరోనా వస్తే కరీంనగర్‌లోని ఒక తల్లి దుఃఖిస్తుంది. ప్రపంచం చిన్నపోయిందని సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడేం జరిగినా దుఃఖించాల్సిందే. ఈ విషపుగాలి మనుషుల్ని ఆర్థికంగా నరికేయడం ప్రారంభించింది. కోళ్ల రైతు దివాలా దశలో ఉన్నాడు. ఇప్పుడు తోలుతీసిన కోడి మాంసం కిలో 60 రూపాయలకే హైదరాబాద్‌లో అమ్మేస్తున్నారు. కొనేవారు లేరు. దీనిమీద ఆధారపడిన లక్షలాదిమంది బతుకులు ధ్వంసమైపోతున్నాయి. కరోనా వైరస్ ఒకర్నుంచి ఇంకొకరికి అంటుకుంటున్నట్టు ఆర్థిక మాంద్యం కూడా అంటువ్యాధే! ఇక కోళ్ల దాణాకి డిమాండ్ లేకపోవడంతో మొక్కజొన్న రైతూ కష్టాల్లో ఉన్నాడు. షూటింగ్‌లు ఆగిపోయేసరికి దేశవ్యాప్తంగా లక్షలాదిమంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. రోడ్డుమీద మనుషులు లేకపోయేసరికి ఆటోడ్రైవరు పెళ్లాం, పిల్లలూ పస్తులుంటున్నారు. కిరాయి కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయిస్తారు. కిస్తు కట్టకపోతే ఆటో లాక్కుంటారు. ఆకలి ఆత్మహత్యల్ని పెంచుతుంది. నేరస్తుల్ని చేస్తుంది. వ్యాపారాలు లేకపోతే జీఎస్టీ ఆదాయం రాదు. డబ్బులు లేకపోతే ప్రభుత్వాలు సరిగ్గా నడవవు. ఆ భారాన్ని ఉద్యోగులు మోయాలి. చీమను, ఉడతను కూడా బతకనిద్దాం! కరోనా వల్ల ప్రధానంగా దెబ్బతినే కీలక రంగం మీడియా. అసలే అంతంతమాత్రంగా ఉన్న మీడియాకి యాడ్ రెవెన్యూ తగ్గిపోతుంది. అరకొర జీతాలకి బదులు పూర్తిగా ఇవ్వడం మానేస్తారు. బెంగళూరులో పనులు దొరక్క వేలమంది రాయలసీమ వలస కూలీలు తిరిగి పల్లెలు చేరుకుంటున్నారు. కరోనా ప్రభావం ఇంకొద్ది రోజులు కొనసాగినా హైదరాబాద్‌లో ఉన్న వేలాదిమంది ఒరిస్సా, యూపీ కార్మికులు ఇళ్లకు వెళ్లిపోతారు. ఈ విధ్వంసం సూక్ష్మంగా జరిగిపోతూ ఉంది. ఆయుధాలతో అందరినీ వణికించే అమెరికా కూడా కరోనాకి వణికిపోతూ ఉంది. ఎందుకంటే అది సూక్ష్మజీవి. ఎంత పెద్ద వాళ్లైనా దానికి లెక్కలేదు. ట్రంపు కూడా రోజుకి పదిసార్లు చేతులు కడుక్కొని ముఖం దగ్గరికి చేతులు రాకుండా చూసుకుంటున్నాడు. గూడు ఎక్కడ కట్టుకోవాలో తెలీక పిచ్చిదానిలా తిరిగే ఒక పిచ్చుకకి కూడా ఈ భూమ్మీద బతికే హక్కుంది. దానికి రియల్ ఎస్టేట్ తెలియకపోవచ్చు. మనం రోడ్ల కోసం చెట్లు నరుకుతున్నప్పుడు వేలాది పక్షి పిల్లలు గొంతు ఎండేలా ఏడ్చి, చచ్చిపోయి ఉంటాయి. ఒక చీమని లేదా ఉడతని కూడా దాని బతుకు దాన్ని బతకనివ్వాలి. లేకపోతే మనల్ని బతకనివ్వని జీవులు భూమ్మీద పుడతాయి సుమా! అందుకే ప్రకృతిని బతకనివ్వండి, అది మనల్ని బ్రతకనిస్తుంది. తప్పెట్లు, తాళాలు అప్పుడు వాయించుకుందాం, అదీ సామూహిక ఆనందం. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు ఈమెయిల్ : abkprasad2006@yahoo.co.in -
ప్రధాన చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే!
- ఆరోగ్యశ్రీపై సర్కారు యోచన - కాలేయ మార్పిడి నుంచి కాక్లియర్ ఇంప్లాంట్ వరకూ - ప్రభుత్వ ఆసుపత్రులకు అధిక నిధులు దక్కేలా చర్యలు - రానురాను ప్రైవేటు నుంచి పక్కకు తప్పించే ప్రయత్నాలు - వారంలోగా అధికారిక ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీలోని ప్రధాన వ్యాధులు నిర్ణీత ప్యాకేజీకి మించి ఖర్చయ్యే వాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శస్త్రచికిత్సలు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొన్న కాలేయ మార్పిడి చికిత్సను ఉస్మానియా ఆసుపత్రిలో నిర్వహించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిర్వహించే ధరలో పావు శాతానికే అక్కడ విజయవంతంగా చేశారు. తాజాగా కాక్లియర్ ఇంప్లాంట్ (వినికిడి లోపం ఉన్న వారికి ఆపరేషన్ ద్వారా ఏర్పాటు చేసే పరికరం) శస్త్రచికిత్సనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించేలా ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మంగళవారం ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వారంలోగా దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కార్పొరేట్ నుంచి పక్కకు వెళ్లాలని... ఆరోగ్యశ్రీ పరిధిలో 938 వ్యాధులకు పేదలు, ప్రభుత్వ ఉద్యోగులకు కవరేజీ ఇస్తున్నారు. ప్రతీ ఏడాది రూ. 350 కోట్ల వరకు ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లిస్తుందని అంచనా. అందులో 80 శాతం సొమ్ము కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తుంది. ఇప్పుడు ఉద్యోగుల ఆరోగ్యకార్డుల ద్వారా నిర్వహించే వైద్య చికిత్సలనూ ఆరోగ్యశ్రీనే నిర్వహిస్తున్నందున అంతకు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్లలో చికిత్సలను తగ్గించాలని సర్కారు యోచిస్తోంది. అందులో భాగంగా మొదటగా భారీగా ఖర్చయ్యే వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శస్త్రచికిత్స చేసేలా చర్యలు ప్రారంభించింది. ఉదాహరణకు ఉస్మానియా ఆసుపత్రిలో ఇటీవల నిర్వహించిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీలో ఉన్నా ప్యాకేజీ సొమ్ముకు చేయడం అసాధ్యం. అయితే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వాటిని నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు రూ. 40 లక్షల వరకు అవుతుంది. దానినే ఉస్మానియా వైద్యులు రూ.10.50 లక్షలకే నిర్వహించారు. కాక్లియర్ ఇంప్లాంటుకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.6.40 లక్షలవుతుంది. వీటినీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ శస్త్రచికిత్సలు రాష్ట్రంలో ఏడాదికి 300 వరకు జరుగుతున్నాయి. కాక్లియర్ ఇంప్లాంట్లకు ఎక్కువ ఖర్చు పెడుతున్నామన్న ఆలోచన సర్కారును తొలచివేస్తోంది. ప్రస్తుతం కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో మాత్రమే ప్రభుత్వపరంగా కాక్లియర్ ఇంప్లాంటు చేస్తున్నారు. ఇక నుంచి హైదరాబాద్‌లోని గాంధీ, వరంగల్ ఎంజీఎంలోనూ నిర్వహించాలని నిర్ణయించారు. శస్త్రచికిత్స అయిపోయాక జరిగే థెరపీలను కొత్తగా కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో చేయాలని ఆరోగ్యశ్రీ నిర్ణయించింది. ఓపీ సేవలూ సర్కారు దవాఖానాలకే ? కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగులకు వైద్య సేవలు అందించే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్యాకేజీపై 25 నుంచి 40 శాతం వరకు పెంచాలని ఆసుపత్రులు కోరుతుండగా, ఎంతో కొంత పెంచేందుకు సర్కారు సన్నద్ధమైంది. కానీ ఔట్‌పేషెంట్ (ఓపీ)కు సంబంధించే ప్రధాన ప్రతిష్టంభన. అయితే ప్రభుత్వం మాత్రం ఓపీ సేవలను పూర్తిగా కార్పొరేట్లకే అప్పగిస్తే రూ. 300 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని భయపడుతోంది. ఈ నేపథ్యంలో నిమ్స్ తరహా ఓపీ ఫీజుకు అంగీకరించాలని అనుకుంది. కానీ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉద్యోగులకు ఓపీ సౌకర్యం కల్పించి వారికోసం అక్కడ ప్రత్యేక సమయం కేటాయించాలని యోచిస్తోంది. అలా ఓపీకి ఇచ్చే సొమ్ము కార్పొరేట్లకు వెళ్లకుండా.. ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్లేలా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఓపీ సేవలు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఉండాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. -
కాలేజీలపై కక్షసాధింపునకు సర్కారు రెడీ!
-
కాలేజీలపై కక్ష సాధింపునకు సర్కారు రెడీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకతపై విశాఖపట్నంలో ఈనెల 22వ తేదీన జరిగిన యువభేరి ప్రభుత్వంలో మంటలు రేపుతోంది. యువభేరికి హాజరైన విద్యాసంస్థలపై ప్రభుత్వం ఆరాతీస్తోంది. విద్యాసంస్థలపై కక్ష సాధింపు చర్యలు తీసుకోడానికి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 22న జరిగిన వైఎస్ఆర్సీపీ యువభేరిలో పలువురు మేధావులు కూడా పాల్గొన్నారు. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుందని వైఎస్ఆర్సీపీ ముందుగానే ప్రకటించింది. ఆంక్షలు విధించినా కూడా విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని ముఖాముఖిలో తమ అభిప్రాయాలను నేరుగా వెల్లడించారు. వాళ్లు వేసుకున్న యూనిఫారాలను బట్టి వాళ్లు ఏయే కాలేజీల నుంచి వచ్చారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆదేశించిన మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఇప్పుడు విద్యాసంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచే ప్రభుత్వం ఈ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మేధావులు కూడా ఈ విషయాన్ని తప్పుబడుతున్నారు. వాస్తవానికి ప్రొఫెసర్లను నేరుగా సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. యూజీసీకి సిఫార్సు మాత్రమే చేయగలరు. అయినా ఈ తరహా ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ప్రొఫెసర్లకు మాత్రం ఇలాంటి ఆదేశాలు ఇంతవరకు అందలేదని తెలుస్తోంది. -
ఉల్లీ.. చిక్కవే తల్లీ
- సబ్సిడీ పథకం ప్రారంభం - కేజీ రూ.20కి విక్రయం - రైతుబజార్లకు పోటెత్తిన జనం సాక్షి, సిటీబ్యూరో: ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలోని అన్ని రైతుబజార్లలో బుధవారం సబ్సిడీ ఉల్లి కౌంటర్లను అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు సబ్సిడీ ఉల్లి కౌంటర్లను ప్రారంభించారు. కేజీ రూ.20 వంతున... ఒక్కో వినియోగదారుడికి రెండేసి కిలోల చొప్పున ఉల్లిని అందిస్తున్నారు. గ్రేటర్‌లోని 9 రైతుబజార్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని 34 ఔట్లెట్స్, మేడ్చెల్, మేడిపల్లి రైతుబజార్లలో బుధవారం నుంచి సబ్సిడీ ఉల్లి పథకం ప్రారంభమైంది. తొలిరోజు ఈ కేంద్రాలకు మొత్తం 29 టన్నుల (290 క్వింటాళ్లు) ఉల్లిని మార్కెటింగ్ శాఖ అధికారులు సరఫరా చేశారు. సరూర్‌నగర్‌లో మంత్రి హరీష్‌రావు, కూకట్‌పల్లిలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎర్రగడ్డలో మంత్రి తలసాని శ్రీనివాస్, మెహిదీపట్నంలో మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఫలక్‌నుమాలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, అల్వాల్‌లో మంత్రి పద్మారావు, వనస్థలిపురంలో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, రామకృష్ణాపురంలో ఎమ్మెల్యే శ్రీనివాస్, మీర్‌పేటలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేడిపల్లి, మేడ్చెల్ రైతుబజార్లలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సబ్సిడీ ఉల్లి కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉల్లి ధరలు కిందికుదిగివచ్చే వరకు ఈ సబ్సిడీ కౌంటర్లను కొనసాగిస్తామని ప్రకటించారు. ఎక్కడా కూడా కొరత రాకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు పక్కాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోటెత్తిన జనం బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.40-45 పలుకుతోంది. దీంతో సబ్సిడీ ఉల్లికి విపరీతమైన గిరాకీ ఎదురైంది. రైతుబ జార్లలో సబ్సిడీ ధరపై ఉల్లిని విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం ముందుగానే ప్రకటించడంతో గ్రేటర్‌లోని అన్ని రైతుబ జార్లకు జనం పోటెత్తారు. ఉదయం 8గంటలకే కౌంటర్ల వద్ద బారులు తీరారు. మెహిదీపట్నం, ఎర్రగడ్డ, కూకట్పల్లి, సరూర్‌నగర్ , ఫలక్‌నుమా, వనస్థలిపురం, అల్వాల్ రైతుబజార్లలో వినియోగదారుల రద్దీ అధికం కావడంతో ఉదయం 9 నుంచి రాత్రి 7గంటల వరకు నిరాటంకంగా విక్రయాలు కొనసాగించారు. ఒక్కో రైతుబ జార్‌కు 4-7 టన్నుల చొప్పున ఉల్లిని అధికారులు అందించారు. అయితే... సాయంత్రం 4 గంటలకే కొన్ని రైతుబజార్లలో సరుకు ఖాళీ అయిపోయింది. దీంతో రంగంలోకి దిగిన మార్కెంటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్లు వై.ఎస్.పద్మహర్ష, ఎల్లయ్యలు ఒక్కో టన్ను చొప్పున అదనంగా సరఫరా చేశారు. విక్రయాల్లో అవకతవకలకు తావులేకుండా రైతుబ జార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతుబజార్లు అందుబాటులో లేని ప్రాంతాలకు సైతం సబ్సిడీ ఉల్లిని సరఫరా చేసేందుకు వివిధ ప్రాంతాల్లో 34 ఔట్లెట్స్ ఏర్పాటు చేశారు. కొరత రానివ్వం: జి.లక్ష్మీబాయ్, మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సబ్సిడీ ఉల్లికి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మిగ తా జిల్లాలకు కూడా తగినంత సరుకును సేకరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్మాల్ ఫార్మర్స్ అగ్రీ బిజినెస్ కన్సార్టియా నుంచి పెద్దమొత్తంలో ఉల్లి దిగుమతి చేసుకొంటున్నాం. ధరలు ఎంత పెరిగినా కేజీ రూ.20కే అందిస్తాం. నాసిక్ నుంచి గురువారం మరో 3వేల క్వింటాళ్ల సరుకు తెప్పిస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి, ఎనతల ప్రాంతంలోని రైతుల నుంచి, మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్ నుంచి ఉల్లిని సేకరిస్తున్నాం. సబ్సిడీ ఉల్లి పక్కదారి పట్టకుండా నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. ఏదైనా గుర్తింపు కార్డును చూపిన వినియోగదారులకే ప్రస్తుతం అందిస్తున్నాం. నగరం నలుమూలకు సరఫరా చేసి ఉల్లికి కొరత లేకుండా చూస్తాం. -
‘ఉస్మానియా’ కూల్చివేత తగదు
- ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటాం - తెలంగాణ పీసీసీ నేతల స్పష్టీకరణ అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక కట్టడమని.. దీనిని కూల్చివేయాలనుకోవడం సరైందికాదని... ఒకవేళ ప్రభుత్వం కూల్చడానికి ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని టీపీసీసీ నేతలు స్పష్టం చేశారు. శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఉస్మానియా ఆసుపత్రి పాతభవనం చుట్టూ ఉన్న డోమ్ గేట్, పేయింగ్ రూమ్స్, దోబీఘాట్, నర్సింగ్హాస్టల్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాత భవనంలోని చాంబర్లో సూపరింటెండెంట్ డాక్టర్ సీజీ రఘురాంతో సమావేశమయ్యారు. అనంతరం మల్లు భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మిస్తామనడం సరికాదన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తానని కేసీఆర్ చెప్పిన మాటలను ఇంకా ఎవరూ మరిచిపోలేదన్నారు. వి.హనుమంతరావు మాట్లాడుతూ ఉస్మానియాకు ఎంతో గట్టితనం ఉందన్నారు. దీనికి మరమ్మతులు చేయిస్తే మరో వందేళ్లు రోగులకు సేవలందించవచ్చని అన్నారు. దానం నాగేందర్ మాట్లాడుతూ ఎప్పుడూ నిజాం పాలనను పొగిడే ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలను ఎందుకు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తానన్న కేసీఆర్ ఉస్మానియాను కూల్చివేస్తాననడం సరికాదన్నారు. రాజకీయం చేయొద్దు టీజీవీపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రమేష్ ఉస్మానియా ఆసుపత్రిని నిజాం ప్రభువు వందేళ్ల దూరదృష్టితో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి నిర్మించిన విషయాన్ని ఎవరూ విస్మరించరాదని తెలంగాణ వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షుడు బి.రమేష్ అన్నారు. శనివారం ఉస్మానియా ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ఇప్పుడు వందేళ్ల ఈ భవనం శిథిలావస్థకు చేరిందన్నారు. ప్రజా అవసరాల కోసం నిర్మించిన భవనాన్ని ప్రజా అవసరాల కోసం వినియోగించాలనుకోవడం తప్పుకాదన్నారు. చార్మినార్ కట్టడంగానో, చౌమహల్లా ప్యాలెస్గానో నిర్మించింది కాదన్నారు. దీనిని ఎవరూ రాజకీయం చేయవద్దని కోరారు. నిజాం ప్రభుత్వ ఇంటిని కూల్చివేసి కింగ్‌కోఠి ఆసుపత్రిని నిర్మించినప్పుడు వీరంతా ఎక్కడికి పోయార న్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో అనేక చారిత్రక కట్టడాలు కనుమరుగయ్యాయని గుర్తు చేశారు. ప్రజా అవసరాల కోసం వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇదే తరహాలో 3డి డిజైనింగ్ చేసి నిజాం నిర్మించిన భవనానికి గుర్తుగా ఇదేశైలిలో భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. దానిని పరిపాలన భవనంగా చేసి దీని వెనుక ఉన్న స్థలంలో ట్విన్ టవర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీన్ని ఒకవేళ అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వైద్యుల సంఘం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు. -
భూ బిల్లులో కొత్త సెక్షన్!
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే లక్ష్యంతో బిల్లులో మరికొన్ని సవరణలు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పుడు.. ‘రైతుల ఆమోదం’, ‘సామాజిక ప్రభావ అంచనా’లను భూసేకరణ ప్రక్రియలో పొందుపర్చే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకు కల్పించే ప్రతిపాదనతో ఒక కొత్త సెక్షన్‌ను బిల్లు లో చేర్చాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భూసేకరణ బిల్లు లో ఈ రెండు అంశాలపైననే విపక్షాలు పట్టుబడ్తున్న నేపథ్యంలో.. ఈ ప్రతిపాదనతో వాటిని చల్లబర్చొచ్చని కేంద్రం భావిస్తోందని తెలిపాయి. భూ సేకరణ బిల్లుపై మంగళవారంరాత్రి కేంద్ర కేబినెట్ చర్చ జరిపిందని, ఆ భేటీలో ఈ ప్రతిపాదన సహా మరికొన్ని ప్రతిపాదనలపై చర్చించారని వెల్లడించాయి. భూ బిల్లు ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం.. రెండూ కొంత దిగి రావాలంటూ అఖిలపక్ష భేటీలో ఎస్పీ నేత ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ చేసిన సూచనను ప్రధాని సమర్ధించిన నేపథ్యంలో కేబి నెట్ భేటీ జరిగింది. భూ సేకరణ బిల్లుపై ఏర్పాటైన జేపీసీకి వివిధ వర్గాల నుంచి 672 వినతిపత్రాలు రాగా, అందులో 670 మోదీ సర్కారు తీసుకురాదలచిన సవరణలను వ్యతిరేకించినవే కావడం విశేషం. భూ బిల్లుపై నివేదికను జేపీసీ పార్లమెంటుకు సమర్పించే గడవును ఆగస్ట్ 3 వరకు పొడిగించారు. ఈ మేరకు జేపీసీ చైర్మన్ అహ్లూవాలియా చేసిన తీర్మానానికి బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. -
చార్ధామ్ యాత్రికుల తరలింపునకు ఏర్పాట్లు
ఉత్తరాఖండ్ అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: చార్ధామ్ యాత్రకు వెళ్లి భారీ వర్షాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన యాత్రికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అనిల్ కుమార్ సింఘల్, అడిషనల్ ఆర్సీ అర్జా శ్రీకాంత్‌లు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఏపీ భవన్ ఓఎస్డీ ఎం.అశోక్‌బాబు (9871999051), ఏపీ పర్యాటక సహాయ సంచాలకులు జి.రామకోటయ్య (9810981293) హరిద్వార్. గోవర్ధన్‌నాయుడు (8171503333) జోషిమఠ్ వద్ద అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. యాత్రికులకు వసతి ఏర్పాట్లు చేయాలని రిషికేశ్‌లోని టీటీడీ ఆశ్రమ ఇన్‌ఛార్జిలు ఓంకార్, జనార్దన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. -
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాసనవుండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. శనివారం కాంగ్రెస్ రాష్ట్ర మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శారదతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయున వూట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధనకు విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనవసర ఆర్భాటాలకు కోట్లు వెచ్చిస్తున్న పాలకులు విద్యార్థుల మెస్ చార్జీలు చెల్లించకపోవడం దారుణవున్నారు. యుూనివర్సీటలకు వీసీలను నియమించడం లేదని, ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేయకుండా వుుఖ్యవుంత్రి విద్యార్థులపై వివక్ష చూపుతున్నారన్నారు. ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆశలు అడియూసలయ్యూయుని నెరేళ్ళ శారద ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టాలిన్, డేవిడ్, సలీంపాషా, మోహినుద్దీన్, రమేష్ముదిరాజ్, విజయ్‌యాదవ్, చరణ్‌కౌశిక్ యాదవ్, శ్రీథర్గౌడ్, బొమ్మ హన్మ ంతరావు, పుప్పాల మల్లేష్, కొల్లురి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
తాగినోడికి తాగినంత!
- ఇక ఎక్కడపడితే అక్కడ మద్యం లభ్యం - జిల్లాలో రూ.3 వేల కోట్ల ఆదాయమే లక్ష్యం - లైసైన్సుల నుంచి సమకూరనున్న రూ.200 కోట్లు - బాగా వ్యాపారం జరిగే దుకాణాల స్థానంలో ఔట్లెట్లు చిత్తూరు (అర్బన్) : ఎప్పుడు పడితే అప్పుడు కావాల్సిన చోట మద్యం అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా రెండేళ్లకు ఏకంగా రూ.3 వేల కోట్ల ఆదాయం సేకరించడమే లక్ష్యంగా 2015-17 మద్యం పాలసీ గెజిట్‌ను విడుదల చేసింది. గత ఏడాది జిల్లాలో మద్యం దుకాణాల లెసైన్సు ఫీజులు, పర్మిట్ రూమ్‌లు, దరఖాస్తు రుసుముల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.150 కోట్లు సమకూరింది. మద్యం అమ్మకాల ద్వారా రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం లభించింది. అయితే గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ ఆదాయం ఆర్జించడానికి కొత్త ఎత్తుగడ వేసింది. గత ఏడాది జిల్లాలో ఎక్కడయితే ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మకాలు జరిగాయో ఆ ప్రాంతాల్లో ఈసారి ప్రభుత్వ మద్యం దుకాణాల ఔట్ లెట్లు వెలుస్తాయి. జిల్లాలోని ఎక్సైజ్ పోలీసు స్టేషన్లను ఆధారంగా చేసుకుని ప్రతి సర్కిల్లో గత ఏడాది ఎక్కడయితే అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగాయో ఆ ప్రాంతంలో పది శాతం ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి గెజిట్‌లో ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కన చిత్తూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 28 మద్యం దుకాణాలుంటే గత ఏడాది ఎక్కువ మొత్తంలో వ్యాపారం జరిగిన ఐరాల పాటూరు సంతగేటు, రంగంపేట క్రాస్, యాదమరి కన్నికాపురం ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు జిల్లాలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన షాపింగ్ మాల్స్, మండలానికి యాభై వరకు ఉన్న అనధికార బెల్టు షాపులు, ప్రైవేటు మద్యం దుకాణాల్లో నిత్యం మద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక గత ఏడాది ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలను తెరవడానికి సమయం కేటాయించారు. అయినప్పటికీ ఉదయం 8 నుంచే దుకాణాల్లో మద్యం దొరికేలా వెసులుబాటు ఉండేది. ఈసారి అధికారిక మద్యం విక్రయాల సమయాన్ని కూడా మార్చేశారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చేసింది. సమకూరే ఆదాయమిదీ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఈ సారి రూ.30 లక్షలు లెసైన్సు ఫీజు నిర్ణయించిన 151 దుకాణాల నుంచి రూ.45.3 కోట్లు, రూ.34 లక్షలు జరిగే 11 దుకాణాల నుంచి రూ.3.74 కోట్లు, రూ.37లక్షలు జరిగే 46 దుకాణాల నుంచి రూ.17.02 కోట్లు, రూ.45 లక్షలు జరిగే 112 దుకాణాల నుంచి రూ.50.4 లక్షలు, రూ.50 లక్షలు జరిగే 68 దుకాణాల నుంచి రూ.34 కోట్లు, రూ.40 లక్షలు జరిగే 21 దుకాణాల నుంచి రూ.8.4 కోట్లు లెసైన్సుల రుసుముల రూపంలో ఆదాయం సమకూరనుంది. ఇది కాకుండా ఒక్కో దుకాణానానికి 4 దరఖాస్తులు వచ్చి పడ్డా దరఖాస్తుకు సగటున రూ.40 వేలు రుసుము లెక్కన రూ.6.56 కోట్లు, 410 మద్యం దుకాణాలకు పర్మిట్ గదుల రుసుము రూపంలో (ఒక్కో పర్మిట్ రూమ్‌కు రూ.2లక్షలు) రూ.8.2 కోట్లు వసూలు కానుంది. వీటితో పాటు మద్యం విక్రయాలు కలిపి రెండేళ్లకు జిల్లాలో సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది. -
కల్యాణలక్ష్మికి నిధుల వరద
ఇందూరు : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిధుల కొరతతో అబాసుపాలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేద దళిత, గిరిజన యువతుల పెళ్లిళ్లకు ఆపన్న హస్తంగా మారిన ఈ రెండు పథకాలకు నిధులను పుష్కలంగా కేటాయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం మార్చినెలతో ముగిసి పోవడంతో, ఆ తరువాత దరఖాస్తుచేసుకున్న లబ్ధిదారులకు 2015-16 ఆర్థిక సం వత్సరంలో నిధుల వరదను పారించింది. సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖలకు రూ. ఐదు కోట్ల చొప్పున మంజూరు చేసి వెయ్యి మంది చొప్పున లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం ఉత్తర్వులు విడుదల చేసింది. అధికారుల హడావుడి 2015-16 సంవత్సరానికి సంబంధించిన కొత్త బడ్జెట్ రావడానికి కాస్త ఆలస్యం కావడంతో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. సకాలంలో నిధులు అందకుండానే పెళ్లిళ్లు చేసుకున్నారు. మరి కొందరు పెళ్లి తేదీ దగ్గర పడటంతో నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం నిధులు రావడంతో వందల సంఖ్యలో ఉన్న లబ్దిదారుల ఖాతాలలో ట్రెజరీ నుంచి బ్యాంకు ద్వారా నిధులు వేసేందుకు అధికారులు హడావుడి చేస్తున్నారు. అర్హులను గుర్తించేందుకు తర్జనభర్జన పడు తున్నారు. వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. రెండు మూ డు రోజులలో బ్యాంకు ఖాతాల్లో నిధులు వేస్తామని లబ్ధిదారులకు సర్ది చెబుతున్నారు. మొత్తానికి ఈసారి నూతన వధువులకు మేలు జరిగినట్టే. గిరిజన సంక్షేమ శాఖకు తక్కువ నిధులు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం కింద ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. ఐదు కోట్లు, షాదీ ముబారక్ పథకం కింద మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.ఐదు కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు. ప్రస్తుతానికి రూ.75 లక్షలను మాత్రమే విడుదల చేసిం ది. విడుతలవారీగా నిధులు వస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. -
పౌష్టికాహారంపై నిఘా
చిలుకూరు : అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం సరఫరాలో చోటుచేసుకుంటున్న అక్రమాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పర్యవేక్షణకు త్వరలో ఆహార కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ పౌష్టికాహారం నాణ్యత, భద్రత, పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై నిఘా వేయనుంది. ఆహార భద్రత కమిటీ విధులు ఇలా.. అంగన్ వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసే వివిధ రకాల ఆహార పదార్థాలు ఏ లోపమూ లేకుండా సక్రమంగా ఉన్నాయా? లేదా చూడాలి. తూకాల్లో తేడాలను పరిశీలించాలి. అంగన్ వాడీ కేంద్రానికి అవసరమైన సరుకులు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అని గమనించాలి. సభ్యుల సమక్షంలోనే ఆహార పదార్థాలు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో కమిటీ సభ్యులంతా చూసి సంబంధిత పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారమే సంబంధిత సీడీపీఓ.. ఆహార కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తారు. ఈ బాధ్యతలను సభ్యులు విస్మరించకుండా పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. అక్రమాలకు చెక్. . . మహళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 4302 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో 6 నెలల నుంచి పిల్లలను చేర్పించాల్సి ఉంటుంది. అయితే 6 నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలకు వారానికి రెండు కోడిగుడ్లు, నెలకు ఒక పిండి ప్యాకెట్ ఇంటికి వెళ్లి అందజేస్తారు. 3 సంవత్సరాల వయస్సుపై బడిన పిల్లలు కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికి రోజూ 20 గ్రాముల శనగలు, 15 గ్రాముల మురుకులు, వారానికి నాలుగు కోడిగుడ్లు పెట్టాలి. గర్భిణులకు పాలు, గుడ్లు అందజేస్తారు. కేంద్రాల్లోనే పౌష్టికాహారం వండి పెడతారు. అయితే కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తక్కువుగా ఉన్నా ఎక్కువగా ఉన్నట్లు చూపుతూ ఆహార పదార్థాలను తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే విలువైన పౌష్టికాహారం లబ్ధిదారులకు అందకుండా దుర్వినియోగం అవుతుందని అపవాదూ ఉంది. ఈ నేపథ్యంలో ఆహార కమిటీలను ఏర్పాటు చేసి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 ఏసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3901 అంగన్ వాడీ కేంద్రాలు, 401 మినీ అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో సుమారుగా 1.75 లక్షల మంది చిన్నారులు, పౌష్టికాహారం పొందుతున్నారు. 67వేల మంది గర్భిణులు, బాలింతలు అనుబంధ పౌష్టికాహారం పొందుతున్నారు. ఆహార కమిటీలో సభ్యులు వీరే. . . కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆహార కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఐకేపీ గ్రామ సమాఖ్య సభ్యురాలు, గర్భిణి, బాలింత, మూడు సంవత్సరాల లోపు చిన్నారి తల్లి ఒకరు, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్త ఉంటారు. వీరి ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం అందుతుంది. ఇందుకు సంబంధింత అధికారులకు పూర్తిస్థాయిలో సమాచారం రాకపోవడంతో గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయలేదు. త్వరలో ఉన్నతస్థాయి అధికారులు జీఓ, కమిటీ నియమ నిబంధనలు విడుదల చేయనున్నారు. -
ఇరాక్ బాధితుల కోసం హెల్ప్‌లైన్
బాధితుల వివరాలు సేకరించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం సాక్షి, హైదరాబాద్: అంతర్యుద్ధం కారణంగా ఇరాక్‌లో చిక్కుకున్న తెలంగాణ వారికి తగిన సాయం అందించేందుకు, అవసరమైతే వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు, ఇతరులు ఎవరైనా ఇరాక్‌లో చిక్కుకుపోయారేమో తెలుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. బాధితులకు సంబంధించి పాస్‌పోర్టు నంబర్, వారు ఇరాక్‌లో ఎక్కడ ఉండేదీ, పనిచేసే కంపెనీ తదితర వివరాలను వారి కుటుంబ సభ్యుల నుంచి సేకరించాలని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం భారత విదేశీ వ్యవహారాల శాఖతో, బాగ్దాద్‌లోని భారతీయ అధికారులతో సంప్రదిస్తోందని, ఇప్పటికే బాగ్దాద్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ప్రొటోకాల్) ఎన్.వి.రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులకు సాయం అందించేందుకు తెలంగాణ సచివాలయంలోని ఎన్ఆర్ఐ సెల్లో హెల్ప్ైలైన్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సచివాలయంలోని హెల్ప్‌లైన్ వివరాలివీ: ఈ.చిట్టిబాబు, సెక్షన్ అధికారి, ఫోన్ నంబర్ : 040-23220603, మొబైల్ నం. 94408 54433. ఇరాక్‌లోని హెల్ప్‌లైన్ నం: 00964 770 444 4899, 00964 770 444 4899, 00964 770 484 3247, 00964 770 484 3247 -
ఎస్సీలకు ప్రత్యేక పాలిటెక్నిక్
నూనెపల్లె, న్యూస్‌లైన్: నంద్యాలలో ప్రభుత్వ మోడల్ రెసిడెన్సియల్ పాలిటెక్నిక్(జీఎంఆర్‌పీ) కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా ప్రత్యేకంగా ఎస్సీల కోసమే ఉద్దేశించిన ఈ కళాశాలకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం జిల్లాలో 6 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. ఇందులో శ్రీశైలం కళాశాల ఎస్టీలకు ఉద్దేశించింది. ఈ క్రమంలో ఎస్సీల కోసం మోడల్స్థాయి రెసిడెన్సియల్ కళాశాల ఏర్పాటుకు సంకల్పించిన ప్రభుత్వం రాష్ట్ర కమిషనర్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ద్వారా న్యూ ఢిల్లీలోని ఏఐసీటీఈకు ప్రతిపాదనలు పంపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కాలేజికి అనుమతి లభించే అవకాశం ఉంద ని నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఓఎస్డీ రామసుబ్బారెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోనే భవన సముదాయం నంద్యాల రెవెన్యూ క్వార్టర్స్ ప్రాంతంలో 1960 నుంచి ప్రభుత్వం ఈపూరి శేషయ్య శెట్టి పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహిస్తోంది. ఇందులో వివిధ విభాగాల్లో 480 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అయితే ఎస్సీలకు మెరుగైన ప్రమాణాలతో విద్యాబోధన కోసం జీఎంఆర్‌పీ కళాశాల ప్రారంభించనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో 120 మందికి అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం ప్రస్తుత కళాశాల ఆవరణలోనే స్థలాన్ని కేటాయించి భవనసముదాయం నిర్మించే అవకాశం ఉంది. పాలిసెట్ - 2014లో అర్హులైనవారికి అవకాశం కల్పిస్తారు. అన్ని వసతులతో కూడిన ప్రత్యేక హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తారు.