
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి జైలుకెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వాలని ఓయూ విద్యార్థి సంఘం కోరింది. వచ్చే ఎన్నికల్లో వారికి తగు సంఖ్యలో సీట్లు కేటాయించాలని విజ్ఞపి చేసింది. ఈ మేరకు సంఘం నేత ఎం.కె.విజయ్‌కుమార్ ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ వి.గెహ్లాట్‌ను కలిశారు.
ఇటీవల హైదరాబాద్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఓయూ విద్యార్థి సంఘం నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో విద్యార్థులకు టీఆర్‌ఎస్ పార్టీ చేసిందేమీ లేదని విజయ్‌కుమార్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment