
సచివాలయం వద్ద ఓయు విద్యార్థుల నిరసన
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయు) విద్యార్థులు సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సచివాలయం వద్ద సెక్యూరిటీ గార్డులు తమపట్ల దురుసుగా ప్రవర్తించారని ఆందోళన చేశారు. సింగపూర్ పర్యటన ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని ఈరోజు సచివాలయానికి వచ్చారు.
అదే సమయంలో సచివాలయానికి వచ్చిన ఓయూ విద్యార్ధులను అక్కడ సెక్యూరిటీగార్డులు అడ్డుకున్నారు. భాస్కర్ అనే కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారని, తమని తోసివేశారని విద్యార్థులు చెప్పారు. సెక్యూరిటీగార్డుల చర్యకు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సచివాలయం వద్ద ఆందోళన చేశారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు.