
మునుగోడు: ఎనిమిదేళ్లు గా ప్రజా సమస్యలు పట్టించుకోని సీఎం కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికకు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిపి.. మొత్తం 88 మందిని పంపడం ద్వారా పరో క్షంగా ఓటమిని అంగీకరించారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. గురువారం ప్రవీణ్‌కుమార్ మునుగోడు మండలం కొంపల్లి, చల్మెడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రోజు కూడా ఫామ్ హౌస్‌ని వదిలి బయటకురాని సీఎం.. నేడు కేవలం ఒక ఎంపీటీసీ పరిధిని ఎంచుకొని ప్రచారం చేయడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. వెల్మకన్నె గ్రామానికి ప్రచారానికి వెళ్లి మహిళలతో మాట్లాడారు. మాటల సందర్భంలో తాము ఎప్పుడూ ఏసీ కారులో తిరగలేదని ఆ మహిళలు చెప్పారు. దీంతో ప్రవీణ్‌కుమార్ వారిని కారులో ఎక్కించుకుని కాసేపు తిప్పారు.
Comments
Please login to add a commentAdd a comment