Munugode By Election On November 3, 2022: ECI - Sakshi
Sakshi News home page

Munugode By Election Schedule 2022: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

Published Mon, Oct 3 2022 12:04 PM | Last Updated on Mon, Oct 3 2022 1:29 PM

Munugode By Election 2022 Schedule Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుంది. 6న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. 

ఈ  నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 17
15 న నామినేషన్ల పరిశీలన

మునుగోడులో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అభ్యర్థిని కాంగ్రెస్‌ ప్రకటించింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను ఆ పార్టీలు ప్రకటించాయి. టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement