![Union Minister Amit Shah Met With Telangana BJP Leaders - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/17/amith-shah4.jpg.webp?itok=155YRbKO)
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్రహోం మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిస్థితిపై ఆరా తీశారు.
గతంలో ఇచ్చిన కార్యక్రమాల పీడ్ బ్యాక్ అడిగి తెలుసుకున్న షా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటానని తెలంగాణ నేతలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీన్ నుంచి అవుట్ అయిందంటూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఎప్పుడైనా ఒకటవుతాయని దీనిని ప్రజలకు మరింత అర్థమయ్యేలా చేయాలని అన్నారు.
చదవండి: (అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డొచ్చిన టీఆర్‌ఎస్ నేత కారు.. అద్దం పగులగొట్టి..)
Comments
Please login to add a commentAdd a comment