సాక్షి, ఢిల్లీ: నల్లగొండ రాజకీయ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ ఢిల్లీలో ఇవాళ తెలంగాణ రాజకీయాలను వేడి పుట్టించారు. శుక్రవారం మధ్యాహ్నాం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ అయ్యారు. అయితే విడివిడిగానే..
ముందుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. అమిత్ షాను కలిశారు. బీజేపీలో చేరిక, మునుగోడు బహిరంగ సభపై చర్చించినట్లు తెలుస్తోంది. అధికారికంగా మునుగోడు సభలోనే చేరతారనే సంకేతాలు అందుతున్నాయి. ఈ మేరకు భేటీ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.
ఇక పార్లమెంట్‌లోనే ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తెలంగాణ వరద సహాయం కోసమే హోం మంత్రిని కలిశానని, వరద కష్టాలపై షాతో చర్చించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. వరదలతో రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను ఈ భేటీకి వెళ్లకపోయి ఉంటే.. రాష్ట్రానికి నష్టం జరిగేదని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ కోసం పదవీత్యాగం చేసిన వ్యక్తిని తానని, పదవుల కోసం వెంటపడే వ్యక్తిని కాదని, ఒకవేళ పార్టీ మారాలనుకుంటే బరాబర్ చెప్పి పోతా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment