
సాక్షి, యాదాద్రి: హుజూరాబాద్ మాదిరిగా, మునుగోడులోనూ టీఆర్‌ఎస్ నేతలు డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. దొడ్డిదారిలో గెలవాలని ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా హుజరాబాద్‌లో ఏ తీర్పు వచ్చిందో మునుగోడులో అదే తీర్పు రిపీట్ అవుతుందని ఈటల స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్‌కు ఉపఎన్నిక వస్తేనే ప్రజలు, కార్యకర్తలు గుర్తుకొస్తారని అన్నారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మేస్థితిలో లేరని తెలిపారు. కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ఆరంభమవుతుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment