సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 21న బహిరంగసభ నిర్వహణకు బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొననున్నారు. ఈ మేరకు గురువారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం అమిత్ షా పర్యటన షెడ్యూల్ జారీ చేసింది.
అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం 1:20 గంటలకు బీఎస్‌ఎఫ్‌కు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:40 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బీఎస్‌ఎఫ్ ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 4:15 గంటలకు మునుగోడుకు వచ్చి, 4:25 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు.
సాయంత్రం 4:40 నుంచి 6 గంటల వరకు సభలో పాల్గొంటారు. 6:25 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని 6:30 గంటలకు బీఎస్‌ఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. (క్లిక్: మీకు నచ్చితే నీతి.. లేకుంటే అవినీతా?)
Comments
Please login to add a commentAdd a comment