
తెలంగాణ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ నియోజక వర్గాలను 143 క్లస్టర్స్‌గా విభజించగా, తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్స్‌గా విభజన చేశారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ నియోజక వర్గాలను 143 క్లస్టర్స్‌గా విభజించగా, తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్స్‌గా విభజన చేశారు. దేశంలోనే మొదటి క్లస్టర్ మీటింగ్ ఈ నెల 28న పాలమూరులో ఏర్పాటు చేయనున్నారు. క్లస్టర్ మీటింగ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28న ఆయన మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు రానున్న అమిత్ షా.. 1.10కి బేగంపేట నుంచి మహబూబ్‌నగర్ బయలుదేరానున్నారు. మధ్యాహ్నం 1.50కి మహబూబ్ నగర్ సుదర్శన్ ఫంక్షన్ హాలులో జరగనున్న క్లస్టర్ మీటింగ్‌లో షా పాల్గొననున్నారు. అనంతరం 2.55 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి కరీంనగర్ బయలుదేరతారు.
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కరీంనగర్ క్లస్టర్ మీటింగ్‌లో పాల్గొంటారు. 5 గంటల 15 నిమిషాలకు కరీంనగర్ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్న షా.. 6.15 నుంచి 7.05 నిమిషాల వరకు హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్ హాలులో మీటింగ్‌లో పాల్గొనున్నారు. అనంతరం 7.45 గంటలకు బేగంపేట నుంచి ఆయన తిరిగి వెళ్లనున్నారు.