Amit Shah: తెలంగాణకు అమిత్‌షా.. భారీ సభకు బీజేపీ ప్లాన్‌ | Home Minister Amit Shah Will Visit Telangana On March 12, Plan For Huge Public Meeting - Sakshi
Sakshi News home page

Amit Shah Telangana Visit: తెలంగాణకు అమిత్‌షా.. భారీ సభకు బీజేపీ ప్లాన్‌

Published Wed, Mar 6 2024 12:37 PM | Last Updated on Wed, Mar 6 2024 1:13 PM

Home Minister Amit Shah Will Visit Telangana On March 12 - Sakshi

సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్ర నేతలు తెలంగాణపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణలో​ పర్యటించనున్నారు. దీంతో, రాష్ట్రంలో రాజకీయంగా మరోసారి ఆసక్తికరంగా మారింది. 

వివరాల ప్రకారం.. తెలంగాణలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ భారీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణలో​ పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా తెలంగాణకు రానున్నారు. ఈనెల 12వ తేదీన అమిత్‌ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ బూత్‌ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement