నడ్డా నివాసంలో సమావేశానికి అమిత్ షా, రాజ్‌నాథ్, బీఎల్ సంతోష్ హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు, మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన చర్యలపై బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. సోమవారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నేత బీఎల్ సంతోష్ తదితరులు హాజరయ్యారు. పోలింగ్ శాతం, బలాలు, బలహీనతలపై విశ్లేíÙంచారు.
అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ ఎన్నికలపైన, కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలాలు, బలహీనతలపై సమీక్ష జరిపాం. ఓటింగ్ శాతం, కొన్ని చోట్ల తక్కువ ఓటింగ్ నమోదుకు కారణాలపై సమగ్రంగా చర్చించాం. రాష్ట్రాల్లో కౌంటింగ్ సన్నాహాలు, అలాగే ఫలితాలు వెలువడ్డాక విజయోత్సవాల నిర్వహణపైనా చర్చించాం. హరియాణాలో బీజేపీ పరిస్థితి బాగాలేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నడ్డా, అమిత్ షా మాజీ సీఎం ఖట్టర్‌తో ప్రత్యేకంగా చర్చించారు’అని తావ్డే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment