
సాక్షి, యాదాద్రి: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా మునుగోడు ఓటర్లు పాల్గొననున్నారు. నియోజకవర్గం నుంచి సుమారు 20 వేల మంది యాత్రలో పాల్గొనేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న షాద్‌నగర్‌లో జరిగే పాదయాత్రలో మునుగోడు నియోజకవర్గం నుంచి మండలానికి 2 వేల మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment