'భారత్' 'ఇండియా' ఏ పేరైనా పర్వాలేదు  | On India Bharat Name Change Row Rahul Gandhi Jab At Government | Sakshi
Sakshi News home page

ఇండియా పేరు మార్చడంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు   

Published Mon, Sep 11 2023 3:01 PM | Last Updated on Mon, Sep 11 2023 3:17 PM

On India Bharat Name Change Row Rahul Gandhi Jab At Government - Sakshi

పారిస్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ యూనివర్సిటీలోని కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అక్కడి విద్యార్థులు ఇండియా పేరును భారత్ గా మార్చడంపై ప్రశ్నించగా రాహుల్ దీనిపై సానుకూలంగా స్పందించారు. రెండిటిలో ఏ పేరైనా తనకు ఆమోదయోగ్యమేనని అన్నారు.

ఏదైనా ఓకే..  
ఐరోపా రాజకీయ నాయకులతోనూ ప్రవాస భారతీయ నేతలతోనూ సమావేశమయ్యేందుకు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ పారిస్‌లోని పీవో యూనివర్సిటీ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇండియా పేరును 'భారత్'గా మార్చడంపై ఆయన అభిప్రాయం కోరగా రాజ్యాంగంలో ఆ రెండు పేర్లను ప్రస్తావించారు.. ఇండియాగా పిలవబడే భారత్ రాష్ట్రాల సమూహమని అందులో పేర్కొన్నారు  కాబట్టి తనకు ఆ రెండిటిలో ఏ పేరు పెట్టినా ఆమోదయోగ్యమేనని తెలిపారు.

'భారత్' జోడో?
అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ కూటమికి ఇండియా అని పేరు పెట్టి బహుశా వారికి విసుగు తెప్పించి ఉంటాము. అందుకే వారు ఇండియా పేరునే మార్చేందుకు సిద్ధమయ్యారన్నారు. మా కూటమికి మేము వేరే పేరును పెట్టేవారమే కానీ దానివలన ప్రయోజనమేమి ఉండదు. కానీ అదేంటో మనుషులు చాలా విచిత్రంగా వ్యవహరిస్తుంటారని అన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాద యాత్రకు 'భారత్ జోడో' అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.  

    

మార్చాల్సిన అవసరమేంటి?
ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సు సందర్బంగా భారత రాష్ట్రపతి అతిధులకు పంపిన డిన్నర్ ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ముద్రించడంతో దేశం పేరు మారుస్తున్నారన్న వార్త దావానలంలా వ్యాపించింది.  ఒక్కసారిగా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వారంతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించగా రాహుల్ మాత్రం పేరు మార్పుపై అయిష్టాన్ని తెలుపుతూనే పేరు ఆమోదయోగ్యమన్నారు.  

'ఇండియా' కూటమి కాదు.. 
ఇక ఇండియా కూటమి పేరుపై సాక్షాత్తు ప్రధానమంత్రే అనేక సందర్భాల్లో విమర్శించిన విషయం తెలిసిందే. ఆ కూటమిని 'ఇండియా' అని కాకుండా 'ఘామండియా'(అంటే మూర్ఖులు) అని పిలవమన్నారు. 

 ఇది కూడా చదవండి: మమతా బెనర్జీపై కాంగ్రెస్ అసంతృప్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement