ప్రతీకాత్మక చిత్రం
కోటా: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంటన్స్ టెస్ట్ (నీట్) కోసం సిద్ధమవుతున్న ఒక విద్యార్థి అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తండ్రితో వీడియో చాట్ చేస్తూను ఉరి వేసుకుని ఉసురు తీసుకున్నాడు. రాజస్థాన్‌లోని కోటాలో ఈ విషాదం చోటు చేసుకుంది.
కోటాలో పేయింట్ గెస్ట్ గా ఉంటూ నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాడు కరణ్ కుమార్ ఘాసి (18) డాక్టర్ కావాలని కలలు కన్నాడు. ఇందుకు నీట్‌కు కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇంతలో ఏమైందో ఏమోగానీ ఆకస్మికంగా తనువు చాలించాడు. గురువారం ఉదయం తన తండ్రి ఉన్మారామ్‌కు వీడియో కాల్ చేశాడు. తండ్రితో మాట్లాడుతూ ఉండగానే తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఘటనతో హతాశుడైన తండ్రి కోటాలో వుండే స్నేహితుడికి సమాచారం అందించారు. దీంతో ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించి, కరణ్ రూమ్‌కు వచ్చి తలుపులు పగుల గొట్టి కరణ్‌ను పోలీసుల సహాయంతో అతణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారని పోలీసు అధికారి వెల్లడించారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని ఏఎస్‌ఐ అత్తర్ సింగ్ తెలిపారు.
అయితే కరణ్‌కు చదువుకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి లేదని, ఆత్మహత్యకు ముందు ప్రేమికురాలికి కూడా ఫోన్ చేసి తన నిర్ణయం గురించి చెప్పాడని కున్హరి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ మీరా బనీవాల్ ప్రకటించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం వుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment