
విషం గుళికలు తింటూ వీడియో తీసుకుంటున్న దృశ్యం
చింతామణి : జీవితం మీద విరక్తి కలిగి ఓ యువకుడు తన ఆత్మహత్యను వీడియో చిత్రీకరించిన సంఘటన మంగళవారం తాలుకాలోని ఆనూరు గ్రామపంచాయతీ పరిధిలోని మూడచింతలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు... సదరి గ్రామానికి చెందిన సునీల్‌కుమార్ (21) బెంగళూరులో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన అతను విషపు గుళికలు తీసుకుని వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో చింతామణి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.