బాన్సువాడ: ఇసుక మాఫియా, కాంట్రాక్టర్లు బరి తెగిస్తున్నారు. మంజీరా నంది నుంచి విచ్చలవిడిగా ఇసుకను తోడేస్తున్నారు. దీంతో నదీ గర్భంలో ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. నది కాస్త ఎడారిగా మారుతోంది. ఇసుక కాంట్రాక్టర్లు అనుమతి పొందిన దానికంటే అధికంగా ఇసుకను తోడేస్తున్నారు. యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారు. దీనితో భూగర్భ జలాలకు ముప్పు ఏర్పడుతోంది. సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
తరలింపు ఇలా కొందరు అనుమతితో, మరికొందరు అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువల ఆధునీకరణ పేరుతో అనుమతి పొంది అక్రమ ర వాణాకు పాల్పడుతున్నారు.
దీంతో మంజీరా నదిలో విచ్చలవిడిగా గుంతలు ఏర్పడ్డాయి. మంజీరా తీరప్రాంతంలో నిబంధనలకు మించి 30 అడుగుల లోతు ఇసుకను తోడేస్తున్నారు. గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతి ఇచ్చి చేతులు దులుపుకుం టోంది. ఇసుక క్వారీల అనుమతి పొందిన యజమానులు పొక్లెయిన్‌లతో ఐదు అడుగుల మేర మాత్రమే ఇసుకను తీయాల్సి ఉండగా, 25 అడుగుల లోతు మేరకు తోడే స్తున్నారు.
దీంతో నది ఉపరితలం దెబ్బతింటోంది. తీవ్ర వర్షాభావంతో ప్రస్తుతం మంజీరా నదికి చుక్క నీరు రాలేదు. కౌలాస్ నాలా ప్రాజెక్టు నుంచి ప్రతి ఏడాది 2-3 టీఎంసీల నీరు వచ్చి చేరేది. కానీ, కౌలాస్‌నాలపై ఎగువన ఏడూరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో కౌలాస్ నాలా ప్రాజెక్టు నిండలేదు. దీంతో పాటు నల్లవాగు సైతం పారడం లేదు. దీంతో నీరు లేక నది ఎడారిని తలపిస్తుంది.
వీరికి తీవ్ర నష్టం
బిచ్కుంద మండలం బండరెంజల్, గుండెనెమ్లి, వాజీద్‌నగర్, పుల్కల్, హస్గుల్, ఖద్‌గాం, శెట్లూర్, బిచ్కుంద, పిట్లం మండలం మద్దెల్ చెరువు, బాన్సువాడ మండ లం చింతల్‌నాగారం, బీర్కూర్ మండలం కిష్టాపూర్, దామరంచ, బీర్కూర్, బరంగేడ్గి, కోటగిరి మండలం హంగర్గ, పొతంగల్ గ్రామాల్లోన్ని మంజీరా తీర ప్రాంత వా సులు ఈ గుంతల కారణంగా నష్టపోతున్నారు. ఈ ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు అడుగంటుతున్నాయి.
ప్రస్తుతం బిచ్కుంద మండలంలోని షెట్లూర్, వాజీద్‌నగర్, ఖద్గాం, బీర్కూర్ మండలం కిష్టాపూర్ ప్రాంతాలలో ఇసుక తరలింపునకు కాంట్రాక్టర్లు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పటికే షెట్లూర్ క్వారీకి అ నుమతి లభించింది. పొక్లయినర్లతో ఇసుకను భారీ లారీలలో తరలించేందుకు కాంట్రాక్టర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిబంధనలన్నింటిని విస్మరిస్తున్నారు. ఇసుక కాంట్రాకర్లు, మాఫియా ధనదాహానికి మంజీరా నది ప్రస్తుతం చుక్క నీరు లేక బోసిపోయింది.
తగ్గుతున్న భూగర్భ జలాలు
మంజీరా నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పుల్కల్ మంజీరా తీరంలో కోట్ల రూపాయల నిధులతో బావిని త వ్వారు. తొమ్మిది గ్రామాలకు ఈ బావి ద్వారా తాగడానికి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇసుక తరలింపుతో ఈ తొమ్మిది 9 గ్రామాలకు నీటి ముప్పు ఏర్పడే అవకాశాలు న్నాయి. బాన్సువాడ పట్టణానికి మంజీరా నది నుంచే నీరు సరఫరా అవుతోంది. తాగునీటికి సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భూగర్భ జల నిపుణులు పేర్కొ ంటున్నారు.
ఐదేళ్లుగా జిల్లాలో పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో నదులు, వాగులు, చెరువులు కళకళలాడి భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. జిల్లా వర ప్రదాయిని అయిన మంజీరా నది నీటితో గలగల పారి, భూగర్భ జలాల వృద్ధికి ఎంతో తోడ్పడింది. అయితే, మూడు నెలలుగా జిల్లాలో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టినట్లు ఇటీవల భూగర్భ జల శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది.
నిపుణుల ఆందోళన
గత వర్షాకాలంలో జిల్లాలో సగటున 9.86 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు సు మారు నాలుగు సెంటీమీటర్ల లోతు సాంధ్రతలో వృద్ధి చెందాయి. కొన్ని నెలలకే 4.19 సెంటీమీటర్ల లోతుకు పడిపోయాయి. దీనిని బట్టి చూస్తే నీటి సాం ద్రత తగ్గుతోందని భూగర్భ జల శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. నీటి సాంద్రత తగ్గడానికి ముఖ్య కారణం మంజీరా నది నుంచి ఇసుక తరలింపేనని స్పష్టం చేస్తున్నారు.
ప్రకృతి వనరులను కాపాడుకోవడానికి తెచ్చిన ‘వాల్టా’ చట్టం సరిగ్గా అమలు కావడం లేదు. అక్రమార్కులకు చుట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం ఇసుక తరలింపుపై ఆంక్షలు విధించాలి. బోర్లు వేసుకోవడానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కానీ, అవేవి జరగడం లేదు. బాన్సువాడ ప్రాంతంలో సుమారు 200 మీటర్ల లోతు బోరు వేస్తే తప్ప నీరు రావడం లేదు. మంజీరా నది సంరక్షణను విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని ప్రకృతి ప్రేమికులు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
‘మంజీరమ్మ’కు గర్భశోకం
Published Tue, Aug 26 2014 2:02 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM
Advertisement
Advertisement