పేకాటాడుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు | former MLA Gangadhar arrested over police rides on gambling centers | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 23 2016 9:55 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

పేకాట ఆడుతూ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. తాడ్కోల్ రోడ్డులోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేశారు. వీరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే కె. గంగాధర్, ఉప సర్పంచ్ తో సహా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.06 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు, 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్టు స్థానిక సీఐ శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement