బాన్సువాడ: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెవెన్యూ అధికారులు, బ్యాంకర్లు, గ్రామసభలు నిర్వహించి రుణమాఫీకి అర్హులైన రైతులను గుర్తించాలి. 1బి, ఆర్‌ఓ ఆర్, పహాణీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. అయితే జిల్లాలోని అనేక గ్రామాలలో కేవలం జాబి తాలోని పేర్లను చదివి సభలను ముగిస్తున్నారు.
రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం పకడ్బందీగా విచారణ జరుపుతుండడంతో నకిలీ పాస్ పుస్తకాలు, భూమి లేకున్నా పాస్ పుస్తకాలపై రుణాలు తీసుకొ న్న వారి వివరాలు బయటపడుతున్నాయి. వెరసి జిల్లాలో రైతు రుణ మాఫీ పథకం చిక్కుముడిలా త యారైంది. భూమి ఉందా? లేదా? అనేది ధ్రువీకరిం చాలని అధికారుల ఆదేశాలు ఉండడంతో గ్రామస్థా యి సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారు.
భూమి లేకున్నా రుణాలు
బాన్సువాడ, గాంధారి, ఎల్లారెడ్డి, బిచ్కుంద తదిత ర మండలాలలో పలువురు భూమి లేకున్నా పాస్ పుస్తకాలు సృష్టించి బ్యాంకుల నుంచి పెద్ద సంఖ్య లో రుణాలు పొందారు. ఈ వ్యవహారంలో ఎక్కడా రెవెన్యూ అధికారుల జోక్యం లేదు. తహశీల్దార్లు, ఆర్‌డీఓలకు సంబంధించిన నకిలీ స్టాంపులు, సంతకాలు ఫోర్జరీ చేసి కొందరు దళారులు రైతులకు రుణాలు ఇప్పించిన సంఘటనలు ఉన్నాయి. సహకార బ్యాంకులలో సైతం బినామీ పేర్లతో రుణాలు తీసుకున్నారని తెలుస్తోంది.
కేవలం పహాణీ జిరాక్స్ ఆధారంగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఉన్నాయి. భూమి అమ్మే ముందు రుణం తీసుకోవడం, భూమి కొనుగోలు చేసిన వ్యక్తి అదే పాస్ పుస్తకంపై మరో బ్యాంకులో రుణం తీసుకున్న సంఘటనలు ఉన్నా యి. దీంతో రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందనే దానిపై అనుమానాలు ఉన్నాయి. బంగారంపై రుణాలు సై తం బోగస్‌గా ఉన్నాయని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. వ్యవసాయ ఖాతా కింద వడ్డీ ఉండడంతో, నకిలీ పాస్ పుస్తకాలతో కొందరు ఈ వ్యవహారాన్ని పూర్తి చేశారు.
పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకొని వాణిజ్య బ్యాంకులు పెద్ద సంఖ్యలో రుణాలు మంజూరు చే శాయి. రుణాలు తీసుకున్న రైతుల వివరాలు గ్రామసభలలో చదివి వినిపించి, అందరి ఆమోదం తీసుకొని వాటిపై సర్పంచ్, వీఆర్‌ఓ, పంచాయతీ అధికారి, డ్వాక్రా సంఘాల బుక్ కీపర్, నోడల్ అధికారి సంతకాలు చేసి అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశా లు జారీ చేశారు. ఇదే ఇపుడు సంకటంగా మారింది.
గ్రామాలలో రూ. కోట్లలో రుణాలు
ఒక్కో గ్రామంలో కోట్ల రూపాయలలో రుణ మాఫీ వ్యవహారం కొనసాగుతోంది. ఏ మాత్రం తేడా వచ్చి నా, తమను బాధ్యులుగా చేస్తారన్న భయంతో జిల్లాలోని అ త్యధిక ప్రాంతాల్లో సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) జరగడం లేదు. నోటీస్ బోర్డులలో పెట్టడం, గ్రామసభకు హాజరైన కొద్ది మందికి పేర్లు చదివి వినిపించడంతోనే సరిపెడుతున్నారు. గ్రామసభలలో లోతైన చర్చ, అభిప్రాయ సేకరణ, లోపాలు సరిదిద్ది నివేదిక రూపొందించి వాటిపై సంతకాలు చేయాలన్న నిబంధన ఆచర ణకు నోచుకోవడం లేదు. దీంతో నకిలీ, బినామీ రుణాలు వెలుగు చూసే పరిస్థితి లే దు.
జాబితాలలో పేర్లు గల్లంతు
ఇదిలా ఉండగా, ప్రస్తుతం బ్యాంకు అధికారులు ఇచ్చిన జాబితాలలో పలు పేర్లు గల్లంతు కాగా, ఒక వ్యక్తి వివరాలు పలు ప్రాంతాల్లో ఉండటం ఇబ్బందికరంగా మారింది. ఆధార్ సీడింగ్ చేయకుండానే జాబి తాలు పంపడంతో కింది స్థాయి అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాలకు వచ్చిన జాబితాలలో స్థానికుల పేర్లు కొన్ని చోట్ల కనిపించడం లేదు. స్థానికేతరుల పేర్లు ఉంటున్నాయి. అనేక చోట్ల కుటుంబ సభ్యులలో కొందరి పేర్లు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతు న్నారు. కొంత మంది గ్రామీణ ప్రాంతాలవారు పట్టణాలలో రుణాలు తీసుకున్నారు. సంబంధిత రైతు గ్రామానికి ఖాతా వివరాలు వెళ్లాలంటే బ్యాంకు అధికారుల చు ట్టూ తిరగాల్సిన పరిస్థితి. వ్యక్తిగతంగా కోరితే సర్దుబాటు చేయడమే తప్పా, ఇలాంటి వివరాలు సరి చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ లేదు.
వేరు వేరు చోట్ల రుణాలు
ఒక రైతు వివిధ బ్యాంకులలో రుణాలు తీసుకొంటే ఆ వివరాలు విడివిడి జాబితాలలో ఉన్నాయి. ఆధార్ నంబర్‌ను ఆధారం చేసుకొని రైతు ఎన్ని చోట్ల రుణాలు తీసుకొన్నా ఒకే దగ్గర కనిపించేలా జాబితా అందిస్తే ఇబ్బంది ఉండేది కాదని గ్రామ స్థాయి అధికారులు అంటున్నారు. ఒకరి ఖాతాపై ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తారని ఆశిస్తే కేవలం లక్ష రూపాయలని ప్రకటించడం, ఆ తర్వాత రూ. 35వేలు ఉన్న వారివి ప్రథమ ప్రాధాన్యం, ఆ తర్వాత బాండ్లు, హామీ పత్రాలు ఇస్తామని అధికారులు ప్రచార ం చేయడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వ మాఫీపై ఆశపడి బ్యాంకులలో పాత రుణాలు చెల్లించకుండా, కొత్తవి తీసుకోకుండా వేచి ఉంటే సర్కారు నిర్ణ యంతో రెండింటికి చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైందని అంటున్నారు. ఈ వ్యవహారం గందరగోళంగా ఉండడంతో ప్రాథమిక స్థాయిలో తప్పులు జరగకుండా ఉండేం దుకు కొంత సమయం కావాలని జిల్లా అధికారులు అంటున్నారు. జాబితా సవరణకు ప్రభుత్వం ఈనెల ఐదు వరకు గడువును పొడిగించింది.
రుణ మాఫీ తేలేనా!
Published Wed, Sep 3 2014 5:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement