బాన్సువాడ, న్యూస్‌లైన్: బాల్యానికి భరోసా ఇవ్వడం కోసం, విద్యార్థుల ఆరోగ్య, విద్య ప్ర గతిని తెలుసుకోవడం కోసం ప్రభుత్వం 2010 నవంబర్ 14న జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రారంభించింది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే దీని ఉద్దేశం. బాలల దినోత్సవం సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ పథకం విద్యార్థులకు వరంగా మారుతుందని అందరూ భావించారు. ఈ పథకం ప్రకారం పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆరోగ్య రక్ష కార్డులో విద్యార్థి రుగ్మతలను, ఆరోగ్య పరిస్థితిని నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల వయసు, ఎత్తు, బరువు, ఛాతి కొలత, దృష్టి లోపం, వినికిడి లోపం, విద్యార్థుల వ్యక్తిగత వివరాలను పేర్కొనాలి.
విద్యార్థి తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే.. అందుకు గల కారణాలను రాయాలి. కార్డులో రాసిన వివరాల ఆధారంగా సదరు విద్యార్థికి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం అమలులో అధికారులు చిత్తశుద్ధి చూపకపోవడంతో లక్ష్యం నీరుగారిపో యింది. విద్యార్థులకు ఇచ్చిన బాల ఆరోగ్య రక్ష కార్డులు మూలనపడ్డాయి. చాలా చోట్ల విద్యార్థులకు బాల ఆరోగ్య రక్ష కార్డులు ఇవ్వలేదంటే విద్య, వైద్యశాఖల అధికారుల చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.
లోటుపాట్లను సవరించేందుకు
జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకంలోని లోటుపాట్లను సవరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకంలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ పథకాన్ని రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)గా పిలవనున్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న బాల ఆరోగ్య రక్ష పథకం ఎనిమిదో తరగతిలోపు విద్యార్థులకే వర్తించేది. కొన్ని పాఠశాలలలో మాత్రం పదో తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేవారు. కొత్తగా విస్తరించే పథకంలో అంగన్‌వాడీ కేంద్రాలలోని పిల్లలతో పాటు 9, 10 తరగతుల విద్యార్థులనూ చేర్చినట్లు తెలిసింది.
ఇప్పటి వరకు బాల ఆరోగ్య రక్ష పథకంలో పీహెచ్‌సీ వైద్యులు వారి పరిధిలోని పాఠశాలలకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించేవారు. పీహెచ్‌సీలలో సిబ్బంది కొరత, పేషెంట్ల రద్దీ దృష్ట్యా విద్యార్థులకు సరైన సేవలు అందలేదు. ఈ నేపథ్యంలోనే జబార్‌ను ఆర్‌బీఎస్‌కేగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో అమలయ్యే ఆర్‌బీఎస్‌కే కోసం కొత్తగా వైద్యులు, సిబ్బందిని నియమించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రత్యేకంగా క్లస్టర్ల వారీగా నియామకాలు చేపడతారని తె లిసింది. ప్రతి క్లస్టర్‌కు ఒక వైద్యుడు, స్టాఫ్ నర్సు/ఏఎన్‌ఎం, ఫార్మసిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తారని, వీటిని ఆయుష్ ద్వారా భర్తీ చేస్తారని సమాచారం.
సేవలు ఇలా
క్టస్లర్లలో ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాలలోని చిన్నారులకు, ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం బాలల ఆరోగ్య విషయాలను పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది కార్డులలో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా సేవలు అందిస్తారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలు నమోదు చేసిన కార్డులను స్కూల్ ప్రధానోపాధ్యాయులు భద్రపరచాల్సి ఉంటుంది. నూతన పథకాన్నైనా పకడ్బందీగా అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వైద్య పరీక్షలు చేస్తలేరు
పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించడం లేదు. బాల ఆరోగ్య రక్ష పథకం సరిగా అమలు కావడం లేదు. దీనిని ఎంతో ఘనంగా ప్రా రంభించారు. ఆచరణలో విఫలమయ్యారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలి. -సదానంద్, విద్యార్థి తండ్రి, బాన్సువాడ
వైద్య సిబ్బందిని నియమించాలి
వైద్యుల కొరత కారణంగానే బాల ఆరోగ్య రక్ష పథ కం అమలు కావడం లేదు. ఈ పథకం సక్రమంగా అమలు కావాలంటే ముందు వైద్య సిబ్బందిని నియమించాలి. అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలి. సేవలు సక్రమంగా అందేలా చూడాలి,
-ప్రవీణ్ గౌడ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు, బాన్సువాడ
పథకం పడకేసింది
Published Mon, Jan 6 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement