Jawahar Bala Arogya Raksha
-
బాలలకు ఆరోగ్యమస్తు
‘జవహర్ బాల ఆరోగ్యరక్ష’పై కలెక్టర్ దృష్టి వైద్యాధికారుల సమన్వయ బాధ్యత హెచ్ఎంలకు 4లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు నివారించడానికి ప్రవేశపెట్టిన జవ హర్ బాల ఆరోగ్యరక్ష పథకం ఇక బలోపేతం కానుంది.. ఈ నెల 8న విద్య, వైద్యాధికారులతో సమీక్షించిన కలెక్టర్ టీకే శ్రీదేవి దీనిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించడంతో ఆశలు చిగురిస్తున్నాయి.. దీనికోసం ఈనెల 15 నుంచి నవంబర్ 15వరకు కొనసాగించాలని అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.. - వనపర్తి టౌన్ ఈ పథకాన్ని మూడేళ్లక్రితమే ప్రవేశపెట్టారు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలు 670, ప్రాథమికోన్నత 573, ప్రాథమిక పాఠశాలలు 2,617 ఉండగా సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థు లు విద్యనభ్యసిస్తున్నారు. బాలల ఆరోగ్యరక్ష పథకం వీరి ఆరోగ్య భారాన్ని వై ద్యశాఖకు అప్పగించి, కో-ఆర్డినేటర్‌ను నియమించినా ఫలితందక్కలేదు. వాస్తవానికి ప్రతి విద్యా సంవత్సరంలో విద్యార్థులకు వైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించాలి. అయితే ఎక్కడా సరిగా అమలుకాలేదు. ఏడాదికి రెండుసార్లు కాదు కదా కనీసం రెండేళ్లకు ఒకసారైనా పరీక్షలు నిర్వహించిన దాఖాలులేవు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థుల ఆరోగ్యరక్ష కార్డులు పరిశీలిస్తే అందులో విద్యార్థి పేరు మాత్రమే రాసి ఉంది. ఆరోగ్య వివరాలు మాత్రం నమో దు చేయలేదు. వైద్య సిబ్బంది పాఠశాల కు వెళ్లి విద్యార్థులను పరిశీలించడమే కరువైంది. ప్రతి గురువారం పాఠశాల ఆరోగ్య దినంగా గుర్తించాలి. విద్య, వైద్యశాఖల మధ్య సమన్వయం లేక సర్కారీ బడుల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం గాలికి వదిలేశారు. వైద్యులు వర్షకా లం, చలికాలంలో వచ్చే వ్యాధుల పట్ల శ్ర ద్ధ చూపకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిందడ్రులు ఆందోళనకు గురయ్యారు. విషజ్వరాలు పెరిగినా, పా ఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం త గ్గి నా అధికారుల్లో కదలికరాలేదు. ఈ వి షయం ఇటీవల కలెక్టర్ టీకే శ్రీదేవి దృ ష్టికి వచ్చింది. దీంతో ఈనెల 8న ఆమె స మీక్షించడంతో విద్య, వైద్యాధికారుల్లో క దలిక వచ్చింది. ఫలితంగా పథకం ని ర్వహణపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్ర ధానోపాధ్యాయులు స్థానికంగా ఉండే వై ద్యాధికారులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని డీఈఓ రాజేశ్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు నెల 15 నుంచి గాడిలో వేసేందుకు అధికార యంత్రాగం సిద్ధమవుతోంది. బాలల ఆ రోగ్యరక్షతో అన్ని కాలాల్లో విద్యార్థులకు వచ్చే వ్యాధుల పట్ల వైద్యులు శ్రద్ధపెడతా రు. విషజ్వరాలు బారిన పడకుండా, పా ఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండ ఉండేందుకు ఈ పథకం దోహదపడుతుందని భావిస్తున్నారు. -
విద్యార్థుల ‘ప్రగతి’ కోసం...
షాబాద్, న్యూస్‌లైన్ : విద్యార్థుల ‘ప్రగతి’ కోసం విద్యాశాఖ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన ప్రగతి వివరాలను ఏడాదికి ఒక సారి మాత్రమే నమోదు చేసేవారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రగతి కార్డుల్లో సంవత్సరంలో విద్యార్థులు సాధించిన వివరాలతో పాటు వరుసగా ఐదేళ్లకు సంబంధించిన ప్రగతిని ఒకే కార్డులో నమోదు చేయొచ్చు. ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పేరుతో ‘బాల్యానికి భరోసా... బాల ఆరోగ్య రక్ష’ నినాదంతో ఈ కార్డులను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ ప్రగతి కార్డులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చేరాయి. గతంలో విద్యార్థుల మార్కుల వివరాలను మాత్రమే అందించేవారు. ప్రస్తుత విధానంలో వాటితో పాటు ఆరోగ్య వివరాలు, సాధించిన నైపుణ్యం, కంప్యూటర్, వ్యాయామ, సాంస్కృతిక అంశాల్లో సాధించిన ప్రగతి, విద్యార్థి రక్తం గ్రూపు, ఎత్తు, బరువు తదితర అంశాలను పొందుపరుస్తారు. విద్యాశాఖ అమలు చేస్తున్న ప్రగతి కార్డుల్లో విద్యార్థికి సంబంధించిన వివిధ అంశాలను తల్లిదండ్రులు క్షుణ్ణంగా గమనించే వీలు కలుగుతుంది. గ్రేడింగ్ పద్ధతి... విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ను ఇచ్చే పద్ధతిని విద్యాశాఖ అమలు చేస్తోంది. 91 నుంచి 100మార్కులు సాధించిన విద్యార్థి అత్యున్నత ప్రతిభ కనబర్చినట్లుగా ఏ ప్లస్ గ్రేడు ఇస్తారు. 71 నుంచి 90మార్కులు సాధించిన విద్యార్థికి ఏ గ్రేడు కేటాయిస్తారు. 51 నుంచి 70మార్కులు సాధించిన విద్యార్థికి ఇంకా కృషి చేయాలంటూ బీ ప్లస్ గ్రేడును ఇస్తారు. 41 నుంచి 50మార్కులు సాధించిన విద్యార్థికి బీగ్రేడు ఇస్తారు. 0 నుంచి 40మార్కులు సాధించిన విద్యార్థికి నామామాత్రపు చదువుగా భావించి సీ గ్రేడు ఇస్తారు. ఉపాధ్యాయులు ఏం చేయాలంటే... {పతి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి సంగ్రహాత్మక, నిర్మాణాత్మక మూల్యాంకనాలు నిర్వహించి విద్యార్థిస్థాయి వివరాలను కార్డుల్లో నమోదు చేయాలి. {పగతి కార్డులను తల్లిదండ్రులకు పంపి వారి సంతకాలతో పాటు సూచనలు, సలహాలు సేకరించాలి. విద్యార్థుల ప్రగతిపై సమీక్షలు నిర్వహించి తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ సమక్షంలో సమావేశాలు నిర్వహించాలి. విద్యార్థులు వెనుకబడిన విషయాలను గుర్తించి మెరుగుపర్చుకోవాలి. విద్యార్థి పాఠశాలను వీడుతున్నా లేదా మారుతున్న సమయంలో కార్డు చివరన ఉన్న ధృవీకరణ పత్రాన్ని విద్యార్థికి అందజేయాలి. కార్డుల్లో నమోదు చేయాల్సిన వివరాలు... నిరంతర మూల్యాంకనం ద్వారా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు వివిధ అంశాల్లో సాధించిన ప్రగతిని ఉపాధ్యాయులు ప్రగతి కార్డుల్లో నమోదు చేయాలి. విద్యార్థి బడిలో చేరిన నాటి నుంచి బయటకు వెళ్లే వరకు విద్యార్థి ఫొటోతో పాటు చదువులో సాధించిన ప్రగతి, నైపుణ్యం, ఆరోగ్య వివరాలు, కంప్యూటర్, వ్యాయామ, సాంస్కృతిక అంశాల్లో సాధించిన ప్రగతిని పొందుపర్చాలి. విద్యార్థి రక్తం గ్రూపు, ఎత్తు, బరువు వివరాలను ఎప్పటికప్పుడు కార్డుల్లో నమోదు చేస్తుండాలి. తల్లిదండ్రులకు సమీక్షించుకునే అవకాశం... మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల లకు ప్రగతి కార్డులను సరఫరా చేశాం. వీటితో విద్యార్థికి సంబంధించిన విద్యా విషయాలు, ఆరోగ్య సమస్యలు, సాంస్కృతిక అంశాల్లో సాధించిన ప్రగతితో పాటు రక్తం గ్రూపు, ఎత్తు, బరువు లాంటి ప్రగతిని తల్లిదండ్రులు సమీక్షించుకునే అవకాశం లభిస్తుంది.-అంగూర్‌నాయక్, ఎంఈఓ, షాబాద్ -
పథకం పడకేసింది
బాన్సువాడ, న్యూస్‌లైన్: బాల్యానికి భరోసా ఇవ్వడం కోసం, విద్యార్థుల ఆరోగ్య, విద్య ప్ర గతిని తెలుసుకోవడం కోసం ప్రభుత్వం 2010 నవంబర్ 14న జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రారంభించింది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే దీని ఉద్దేశం. బాలల దినోత్సవం సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ పథకం విద్యార్థులకు వరంగా మారుతుందని అందరూ భావించారు. ఈ పథకం ప్రకారం పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆరోగ్య రక్ష కార్డులో విద్యార్థి రుగ్మతలను, ఆరోగ్య పరిస్థితిని నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల వయసు, ఎత్తు, బరువు, ఛాతి కొలత, దృష్టి లోపం, వినికిడి లోపం, విద్యార్థుల వ్యక్తిగత వివరాలను పేర్కొనాలి. విద్యార్థి తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే.. అందుకు గల కారణాలను రాయాలి. కార్డులో రాసిన వివరాల ఆధారంగా సదరు విద్యార్థికి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం అమలులో అధికారులు చిత్తశుద్ధి చూపకపోవడంతో లక్ష్యం నీరుగారిపో యింది. విద్యార్థులకు ఇచ్చిన బాల ఆరోగ్య రక్ష కార్డులు మూలనపడ్డాయి. చాలా చోట్ల విద్యార్థులకు బాల ఆరోగ్య రక్ష కార్డులు ఇవ్వలేదంటే విద్య, వైద్యశాఖల అధికారుల చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. లోటుపాట్లను సవరించేందుకు జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకంలోని లోటుపాట్లను సవరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకంలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ పథకాన్ని రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం (ఆర్బీఎస్కే)గా పిలవనున్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న బాల ఆరోగ్య రక్ష పథకం ఎనిమిదో తరగతిలోపు విద్యార్థులకే వర్తించేది. కొన్ని పాఠశాలలలో మాత్రం పదో తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేవారు. కొత్తగా విస్తరించే పథకంలో అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లలతో పాటు 9, 10 తరగతుల విద్యార్థులనూ చేర్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు బాల ఆరోగ్య రక్ష పథకంలో పీహెచ్సీ వైద్యులు వారి పరిధిలోని పాఠశాలలకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించేవారు. పీహెచ్సీలలో సిబ్బంది కొరత, పేషెంట్ల రద్దీ దృష్ట్యా విద్యార్థులకు సరైన సేవలు అందలేదు. ఈ నేపథ్యంలోనే జబార్ను ఆర్బీఎస్కేగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో అమలయ్యే ఆర్బీఎస్కే కోసం కొత్తగా వైద్యులు, సిబ్బందిని నియమించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రత్యేకంగా క్లస్టర్ల వారీగా నియామకాలు చేపడతారని తె లిసింది. ప్రతి క్లస్టర్‌కు ఒక వైద్యుడు, స్టాఫ్ నర్సు/ఏఎన్ఎం, ఫార్మసిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తారని, వీటిని ఆయుష్ ద్వారా భర్తీ చేస్తారని సమాచారం. సేవలు ఇలా క్టస్లర్లలో ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం అంగన్వాడీ కేంద్రాలలోని చిన్నారులకు, ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం బాలల ఆరోగ్య విషయాలను పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది కార్డులలో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా సేవలు అందిస్తారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలు నమోదు చేసిన కార్డులను స్కూల్ ప్రధానోపాధ్యాయులు భద్రపరచాల్సి ఉంటుంది. నూతన పథకాన్నైనా పకడ్బందీగా అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. వైద్య పరీక్షలు చేస్తలేరు పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించడం లేదు. బాల ఆరోగ్య రక్ష పథకం సరిగా అమలు కావడం లేదు. దీనిని ఎంతో ఘనంగా ప్రా రంభించారు. ఆచరణలో విఫలమయ్యారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలి. -సదానంద్, విద్యార్థి తండ్రి, బాన్సువాడ వైద్య సిబ్బందిని నియమించాలి వైద్యుల కొరత కారణంగానే బాల ఆరోగ్య రక్ష పథ కం అమలు కావడం లేదు. ఈ పథకం సక్రమంగా అమలు కావాలంటే ముందు వైద్య సిబ్బందిని నియమించాలి. అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలి. సేవలు సక్రమంగా అందేలా చూడాలి, -ప్రవీణ్ గౌడ్, ఎస్ఎఫ్ఐ నాయకుడు, బాన్సువాడ