‘జవహర్ బాల ఆరోగ్యరక్ష’పై కలెక్టర్ దృష్టి
వైద్యాధికారుల సమన్వయ బాధ్యత హెచ్‌ఎంలకు
4లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు నివారించడానికి ప్రవేశపెట్టిన జవ హర్ బాల ఆరోగ్యరక్ష పథకం ఇక బలోపేతం కానుంది.. ఈ నెల 8న విద్య, వైద్యాధికారులతో సమీక్షించిన కలెక్టర్ టీకే శ్రీదేవి దీనిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించడంతో ఆశలు చిగురిస్తున్నాయి.. దీనికోసం ఈనెల 15 నుంచి నవంబర్ 15వరకు కొనసాగించాలని అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.. - వనపర్తి టౌన్
ఈ పథకాన్ని మూడేళ్లక్రితమే ప్రవేశపెట్టారు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలు 670, ప్రాథమికోన్నత 573, ప్రాథమిక పాఠశాలలు 2,617 ఉండగా సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థు లు విద్యనభ్యసిస్తున్నారు. బాలల ఆరోగ్యరక్ష పథకం వీరి ఆరోగ్య భారాన్ని వై ద్యశాఖకు అప్పగించి, కో-ఆర్డినేటర్‌ను నియమించినా ఫలితందక్కలేదు. వాస్తవానికి ప్రతి విద్యా సంవత్సరంలో విద్యార్థులకు వైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించాలి. అయితే ఎక్కడా సరిగా అమలుకాలేదు. ఏడాదికి రెండుసార్లు కాదు కదా కనీసం రెండేళ్లకు ఒకసారైనా పరీక్షలు నిర్వహించిన దాఖాలులేవు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థుల ఆరోగ్యరక్ష కార్డులు పరిశీలిస్తే అందులో విద్యార్థి పేరు మాత్రమే రాసి ఉంది. ఆరోగ్య వివరాలు మాత్రం నమో దు చేయలేదు. వైద్య సిబ్బంది పాఠశాల కు వెళ్లి విద్యార్థులను పరిశీలించడమే కరువైంది. ప్రతి గురువారం పాఠశాల ఆరోగ్య దినంగా గుర్తించాలి. విద్య, వైద్యశాఖల మధ్య సమన్వయం లేక సర్కారీ బడుల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం గాలికి వదిలేశారు. వైద్యులు వర్షకా లం, చలికాలంలో వచ్చే వ్యాధుల పట్ల శ్ర ద్ధ చూపకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిందడ్రులు ఆందోళనకు గురయ్యారు. విషజ్వరాలు పెరిగినా, పా ఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం త గ్గి నా అధికారుల్లో కదలికరాలేదు. ఈ వి షయం ఇటీవల కలెక్టర్ టీకే శ్రీదేవి దృ ష్టికి వచ్చింది. దీంతో ఈనెల 8న ఆమె స మీక్షించడంతో విద్య, వైద్యాధికారుల్లో క దలిక వచ్చింది. ఫలితంగా పథకం ని ర్వహణపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్ర ధానోపాధ్యాయులు స్థానికంగా ఉండే వై ద్యాధికారులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని డీఈఓ రాజేశ్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు నెల 15 నుంచి గాడిలో వేసేందుకు అధికార యంత్రాగం సిద్ధమవుతోంది. బాలల ఆ రోగ్యరక్షతో అన్ని కాలాల్లో విద్యార్థులకు వచ్చే వ్యాధుల పట్ల వైద్యులు శ్రద్ధపెడతా రు. విషజ్వరాలు బారిన పడకుండా, పా ఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండ ఉండేందుకు ఈ పథకం దోహదపడుతుందని భావిస్తున్నారు.
బాలలకు ఆరోగ్యమస్తు
Published Sun, Jun 14 2015 4:14 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
Advertisement
Advertisement