గ్రామానికి ప్రథమ పౌరుడుగా వ్యవహరించే సర్పంచుకు వేతనం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది.
బాన్సువాడ, న్యూస్‌లైన్ : గ్రామానికి ప్రథమ పౌరుడుగా వ్యవహరించే సర్పంచుకు వేతనం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. గత ఏడాది ఆగస్టు రెండున పదవీ బాధ్యతలు స్వీకరించిన వీరికి ఇప్పటి వర కు వేతనాల నిధులు విడుదల కాలేదు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు సర్పంచులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేజర్ పంచాయతీల సర్పంచుకు రూ. 1500, మైనర్ పంచాయతీ సర్పంచుకు రూ. 1000 చొప్పన నె లవారీ గౌరవ వేతనాలు అందాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సగం నిధులు పం చాయతీరాజ్ కమిషనర్ నుంచి విడుదల కావాలి.
మిగతా సగం పంచాయ తీ భరిస్తుంది. జిల్లాలో మొత్తం సర్పంచులకు సుమా రు రూ. కోటి వరకు గౌరవ వేతనం అందాల్సి ఉంది. వేతనాల విషయమై ఎంపీడీఓలు, ఈఓపీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులను సర్పంచులు ప్రశ్నిస్తున్నప్పటికీ, నిధులు మంజూరు కానిది తామేమీ చేయ లే మంటూ వారు చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు నెల లో ఒకరోజు శిక్షణ తరగతులకు హాజరు కావాల్సి ఉం డడంపై సర్పంచులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.