government neglect
-
కానరాని పక్షులు కిలకిలలు
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరులో నేడు కిలకిల రావాలు వినిపించటం లేదు.. విహంగాల విలవిలలు తప్ప. నీరు, ఆహారం కొరత.. కాలుష్యం బెడద.. వేటగాళ్ల తూటాల వల్ల ఇక్కడకు వచ్చిన విదేశీ పక్షులు మృత్యువాతపడుతున్నాయి. ఫలితంగా కొల్లేరు రానురాను జీవ కళ కోల్పోతోంది.. మనిషిలో పెరిగిన స్వార్థానికి అవి ‘కిల్’ అవుతున్నాయి.. కొల్లేరు అభయారణ్యం పరిరక్షణను గత ప్రభుత్వం గాలికొదిలేయడంతో.. పక్షుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని పర్యావరణ వేత్తలు వాపోతున్నారు. –ఆకివీడు సాక్షి, పశ్చిమగోదావరి : ప్రపంచంలోని అతి పెద్ద మంచినీటి సరస్సుల్లో కొల్లేరు ప్రముఖమైంది. దీనిని పరిరక్షించేందుకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామ్సార్ ఒప్పందం కూడా చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సు 11వ శతాబ్ద ప్రాంతంలో ఒక పట్టణం. 17వ శతాబ్దం వరకూ ఇక్కడ మనుషులు సంచరించారు. అయితే తెలుగు రాజుల కాలంలో కొల్లేరు పట్టణం దగ్ధమైపోయినట్లు చరిత్ర చెబుతోంది. తదనతంరం పెద్దగొయ్యిగా ఏర్పడి, గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చే అదనపు నీరు, వరదల నీటితో ఈ ప్రాంతం ముంపునకు గురైంది. సముద్రమట్టానికి 10 అడుగుల ఎత్తు వరకూ సుమారు 314 చ.మైళ్ల విస్తీర్ణంలో నీరు నిలబడి ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఒక సరస్సుగా గుర్తించి, కొల్లేరు సరస్సుగా నామకరణం చేశారు. ఇలా 18వ శతాబ్దం ప్రారంభంలో కొల్లేరు సరస్సుగా ఏర్పడింది. సరస్సులో వివిధ రకాల చేపలు, కలువ కాయలు(కలేబికాయలు), నాచు కాయలు ఇలా ఎన్నో రకాల మొక్కలు నీటిలోంచి పుట్టుకువచ్చి కాయలు కాస్తుండేవి. ఆ కాయల్ని తినేందుకు విదేశాల నుంచి 200 రకాలకు పైగా పక్షులు వలస వచ్చేవి. వీటితో పాటు స్థానిక పక్షులు లక్షలాదిగా కొల్లేరులో జీవించేవి. అయితే రానురాను పక్షులు ఇక్కడ మనుగడ సాగించే పరిస్థితులు కానరావడం లేదు. ఔ అమలు కాని చట్టాలు కొల్లేరు అభయారణ్య పరిరక్షణకు గత ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఆచరణకు నోచుకోలేదు. కొల్లేరుతో పాటు ఐదో కాంటూర్‌ను పరిరక్షించడానికి నిత్యం పహరా కాయాల్సిన యంత్రాంగమే చోధ్యం చూస్తోంది. ఫలితంగా ఒకనాడు కొల్లేరులో తిరుగుతున్న తిమింగాల్ని సైతం లెక్కచేయకుండా బాంబులతో పేల్చేసిన చెరువుల స్థానంలో నేడు పుట్టగొడుగుల్లా కొత్త చెరువులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అడపాదడపా దాడుల పేరుతో ఎంపిక చేసుకున్న వారిని భయభ్రాంతులకు గురిచేసి, కాసులు దండుకోవడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆటపాకలోని రక్షిత పక్షుల కేంద్రంలో కూడా పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వందలాది విదేశీ పక్షులు మృత్యువాత పడుతున్నాయి. సాక్షాత్తూ అటవీశాఖ అధికారుల కళ్లముందే ఈ దారుణం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పక్షుల కేంద్రంలో యంత్రాలతో అభివృద్ది పనులు చేయకూడదనే నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. పక్షులు సంచరించే ప్రాంతాల్లో విచ్చల విడిగా చేపలు, రొయ్యల చెరువులు పుట్టుకొస్తుండటంతో మేత, యాంటి బయోటిక్స్ విని యోగం విచ్చలవిడిగా జరుగుతూ పక్షుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. కిక్కిస దగ్ధంతో మాడిపోతున్న పక్షులు ఏటా వేసవిలో కొల్లేరులోని వందలాది ఎకరాల్లో కిక్కిస దగ్ధమవుతోంది. కిక్కిస మంటల్లో వేలాది పక్షులు, పక్షి గుడ్లు మాడి మసైపోతున్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కొల్లేరు కుచించుకుపోతోంది. సరస్సు మనుగడకు ప్రమాదం ఏర్పడింది. అంతరించే స్థాయికి పక్షులు చేరుకున్నాయి. కొల్లేరు కిలకిల రావాలు వినాలంటే, సరస్సు మనుగడ కాపాడాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొల్లేరు సరస్సుపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. నెరలు తీసి బీడుగా.. కొల్లేరు సరస్సులో జలాలు కనుమరుగవుతున్నాయి. కొల్లేరు ప్రాంతం నెరలు తీసి బీడు బారుతోంది. వివిధ రకాల ఫ్యాక్టరీలకు చెందిన రసాయన వ్యర్థాలతో కూడిన నీరు కొల్లేరులో చేరుతోంది. దీంతో పక్షులు చనిపోతున్నాయి. వాటి కళేబరాలు పచ్చిక పొదల్లో పడి కుళ్లి కృశించిపోతున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వాటిలో ప్రసిద్ధిగాంచిన విదేశీ పెలికాన్ పక్షులూ ఉన్నాయి. మొక్కుబడిగా చెక్‌పోస్టులు కొల్లేరు అభయారణ్యాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు మొక్కుబడిగా ఉన్నాయి. అభయారణ్య పరిధిలో కృష్ణా జిల్లాలో రెండు, పశ్చిమగోదావరి జిల్లాలో 4 చెక్ పోస్టులున్నాయి. చేపల మేత, మందులు, వాహనాల రాకపోకల నిషేధంతో పాటు, కొల్లేరు పక్షుల్ని రక్షించాల్సిన బాధ్యత చెక్‌పోస్టు అధికారులు, సిబ్బందిపై ఉంది. వీరు సరిగా పట్టించుకోనందున అభయారణ్యంలోకి వెళ్లకూడనివన్నీ వెళ్లిపోతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటపాకలోని పక్షి ఆవాస కేంద్రం వద్ద ఆధునికీకరణ పనులతో చెల్లాచెదురైన పెలికాన్, ఇతర పక్షులు మూగజీవాలపై ‘వేటు’ కొల్లేరు మూగ జీవాలపై వేటగాళ్ల దాడి అధికమైంది. పక్షి కనిపిస్తే చాలు, దానిని చంపి, తినేసే వరకూ నిద్రపోని వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పక్షుల వేట సాగిపోతోంది. కొల్లేరులో పరజ, కొంగ, గూడు కొంగ, నత్తకొట్టుడు, కొండింగాయ, పెలికాన్ పక్షులతో పాటు దొరికిన పక్షిని చంపి తినేస్తున్నారు. వేటాడిని పక్షుల్ని రహస్యంగా ఏలూరు, ఆకివీడు, భీమడోలు, గణపవరం, భీమవరం, కాళ్ల, పాలకొల్లు, నిడమర్రు, ఉంగుటూరు, కృష్ణా జిల్లా కైకలూరు, కలిదిండి, మండలవల్లి, గుడివాడ, ముదినేపల్లి తదితర మండలాలకు రహస్యంగా తీసుకువెళ్లి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రహస్యంగా వేట సాగిస్తున్నారు పక్షులను వేటాడకూడదనే నిషేధం ఉన్నప్పటికీ పక్షుల్ని వేటాడి రహస్యంగా తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. రూ.100 నుంచి రూ.500 వరకూ అమ్ముతున్నారు. –గాతల ఇమానియేలు, జువ్వలపాలెం తరిగిపోతున్న పక్షి జాతి కొల్లేరు కాలుష్యానికి గురైంది. మరోపక్క అడపాదడపా వేటాడుతున్నారు. దీంతో చాలా రకాల పక్షులు చనిపోయాయి. ప్రస్తుతం ఉన్న పక్షులకు నీరు, ఆహారం కొరత ఏర్పడింది. దీంతో అవి బలహీనమైపోయాయి. ఆవాస కేంద్రాలు కూడా లేక పక్షులు అంతరించిపోతున్నాయి. పక్షుల ఆవాస కేంద్రాలకు ప్రభుత్వం పది వేల ఎకరాలు కేటాయించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –బలే గణేష్, శృంగవరప్పాడు, కృష్ణా జిల్లా, కొల్లేరు -
ఇద్దరే ఉద్యోగులు
సూపర్‌బజార్(కొత్తగూడెం) : యువజనులకు, క్రీడాకారులకు సేవలందించాల్సిన జిల్లా యువజన, క్రీడల శాఖా కార్యాలయం సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. రెండు శాఖలను ఒకే శాఖ పరిధిలోకి తీసుకువచ్చినా పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించలేదు. దీంతో ఉన్నవారిపై పనిభారం పెరిగింది. ఈ రెండింటిలో ఒక శాఖకు ఒక్కరు కూడా సిబ్బంది లేకపోవడం గమనార్హం. చివరకు జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పోస్టు సైతం ఇన్చార్జి పాలనలోనే సాగుతోంది. జిల్లాల పునర్విభజన తర్వాత పూర్తిస్థాయిలో జిల్లా యువజన, క్రీడల అధికారి (డీఎస్ఓ)గా వెంకటరంగయ్య నియమితులయ్యారు. 2017 సెప్టెంబర్ మాసంలో ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో జిల్లాలో పరిశ్రమల శాఖాధికారిగా విధులు నిర్వహిస్తున్న కె.అజయ్ కుమార్‌కు డీఎస్‌ఓగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆయన కూడా ఇటీవల బదిలీ కావడంతో సిరిసిల్ల జిల్లా నుంచి జిల్లా పరిశ్రమల శాఖాధికారిగా బదిలీపై వచ్చిన జె.రాజారాంకు డీఎస్ఓ అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో జిల్లా అధికారితోపాటు సూపరింటెండెంట్, అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్లతోపాటు మరో ఆరుగురు వివిధ క్రీడలకు సంబంధించిన కోచ్‌లు కలిపి మొత్తం 13 మంది సిబ్బంది నిబంధనల ప్రకారం ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ శాఖలో ఇన్చార్జి డీఎస్‌ఓతోపాటు సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అటెండర్ గతంలో ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన బదిలీలలో ఖమ్మానికి బదిలీ కాగా, ఇక్కడి కార్యాలయానికి మాత్రం ఎవరినీ నియమించలేదు. ఇన్చార్జి డీఎస్‌ఓగా ఉన్న పరిశ్రమల శాఖాధికారికి ఆ శాఖలో ఉండే పని ఒత్తిడి కారణంగా ఈ శాఖపై పూర్తిస్థాయి దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. జిల్లా ఏర్పాటు కాకముందు యువజన, క్రీడలు వేరువేరు శాఖలు ఉండగా, జిల్లా ఏర్పాటు అనంతరం వీటిని విలీనం చేశారు. అప్పటి యువజన శాఖలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లే ప్రస్తుతం రెండు శాఖలకు కలిపి పని చేస్తుండటం గమనార్హం. క్రీడాపోటీల నిర్వహణ అంతంతమాత్రమే యువజన, క్రీడల శాఖలో సిబ్బంది కొరత కారణంగా జిల్లాలో క్రీడాపోటీల నిర్వహణతోపాటు ఇతర పలు శాఖాపరమైన కార్యక్రమాల నిర్వహణ పూర్తిస్థాయిలో కొనసాగడంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించి యువజనులకు, క్రీడాకారులకు అవసరమైన కార్యక్రమాలకు రూపకల్పన చేసి నిర్వహించాలని పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపించాం జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ పోస్టులను గుర్తించి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి, స్పోర్ట్స్ అథారిటీకి పంపించాం. –జె.రాజారాం, ఇన్చార్జి డీఎస్ఓ -
ఐటీఐఆర్‌పై ప్రభుత్వ తీరు బాధాకరం
టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: ఐటీఐఆర్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు బాధాకరమని, ఇది కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టని టీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన పార్టీ నేతలు మల్లు రవి, అద్దంకి దయాకర్ తదితర నేతలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఇది రూ.2.19 లక్షల కోట్ల ప్రాజెక్టని, 15 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని, ఇంతటి కీలకమైన ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా వ్యవహరిస్తున్నాడని, పోలీసులు కేసీఆర్‌కు కాపలా కుక్కల్లా మారారని శ్రవణ్ మండిపడ్డారు. -
అడుగడుగునా సమస్యల స్వాగతం
కాకినాడ : ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై ఏప్రజల సమస్యా పరిష్కారానికి నోచుకోని నేపధ్యంలో గడపగడపకూ వైఎస్ఆర్ పేరిట ప్రజల మధ్యకు వెళ్తున్న పార్టీ నేతలకు మంచి స్పందన కనిపిస్తోంది. తమ గోడు వినేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలకు సమస్యలు విన్నవిస్తున్నారు. రెండేళ్ళుగా పడుతున్న కష్టాలు తెలియజేస్తున్నారు. ఓ వైపు ప్రజా సమస్యలు వింటూ మరో వైపు మీ వెంటే మేమున్నామంటూ భరోసానిస్తూ పార్టీ నేతలు ముందుకు సాగిపోతున్నారు. ఉపాధి పనుల్లోనూ వివక్షతే... కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురజనాపల్లిలో జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు గడపగడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వృద్ధురాలు తాతపూడి వెంకాయమ్మ భర్తకు పింఛన్ వచ్చేదని, ఆయన మరణించి ఆరు నెలలైనా తనకు వితంతు పింఛన్ రావడంలేదంటూ వాపోయింది. హౌసింగ్‌లోన్ కోసం నాయకులు దగ్గరకు వెళ్తే మీరు ఎవరికి ఓట్లు వేశారో వారినే అడగండంటూ ఈసడించుకుంటున్నారని మల్లమ్మ వాపోయింది. ఉపాధి హామీ పథకంలో కొంతమందికే పనులు చెబుతున్నారని, పార్టీ పేరుతో వివక్ష చూపుతున్నారని గ్రామ ప్రజలు బాధను వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎక్కడండీ... పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లిలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నిర్వహించారు. డ్వాక్రా రుణాలు, గృహాలు మంజూరు కావడంలేదని, స్థానిక ఎమ్మెల్యే తన సమస్యలను పట్టించుకోవడలేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం పాసర్లపూడిలో కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండకుదిటి మోహన్ నిర్వహించారు. సమస్యలను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదంటూ స్థానికులు పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. మండపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి ఆధ్వర్యంలో 11,8 వార్డులలో నిర్వహించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ(రాజబాబు), పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, జడ్పీటీసీ సభ్యురాలు చిన్నం అపర్ణాదేవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తీన్మార్ నృత్యాలు, మహిళ మంగళహారతులతో కోలాహాలంగా సాగింది. రాజమహేంద్రవరంరూరల్ నియోజకవర్గం రాయుడుపాకలు గ్రామంలో కో-ఆర్డినేటర్ గిరిజాల వీర్రాజు(బాబు) ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి దాసరి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో కో-ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ గడపడపకు వైఎస్ఆర్సీపీ నిర్వహించారు. అలరిస్తున్న ప్రజా బ్యాలెట్... అమలాపురం రూరల్ భట్నవిల్లిలో గడపగడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని పార్టీ సీఈసీ సభ్యుడు, కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి పార్టీ రూపొందించిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు అందించి టి.డి.పి. సర్కార్ వైఫల్యాలను వివరించారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలను స్థానికులు విశ్వరూప్, చిట్టబ్బాయి తీసుకొచ్చారు. జన్మభూమిని అడ్డుకోండి... అనపర్తి నియోజకవర్గం శహపురం గ్రామంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నిర్వహించారు. పింఛన్ కోసం ఏడాదిగా తిరుగుతున్నా జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడుతున్నారంటూ చిన్నారనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. లక్షా 20 వేలు రుణానికిగాను కేవలం రూ.2వేలు మాత్రమే రుణ బకాయి ప్రభుత్వం చెల్లించిందని రాయుడు గోవిందు అనే రైతులు నేతల దృష్టికి తీసుకొచ్చాడు. -
ప్రభుత్వం నిర్లక్ష్యంతో అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్య
- స్పందించకపోతే జూలై 15న జాతీయ రహదారులు దిగ్భంధం - బాధితుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నాగేశ్వరరావు హెచ్చరిక తిరుపతి కల్చరల్: అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా తీవ్రంగా నష్టపోయిన బాధితులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపడంతో ఇప్పటివరకు 96 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసంతో ఆంధ్రరాష్ట్రంతో పాటు 8 రాష్ట్రాల్లో లక్షలాదిమంది దగా పడ్డారని పేర్కొన్నారు. 1995 నుంచి అగ్రిగోల్డ్ విష వృక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిపోషిస్తే అప్పటి మంత్రులు ఆ సంస్థకు ఐఎస్వో గుర్తింపు సైతం ఇచ్చి ప్రజల్లో నమ్మకాన్ని కల్పించారని తెలిపారు. ఫలితంగానే లక్షలాది మంది ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని అనేకసార్లు పోరాటాలు చేసినా, అసెంబ్లీలో ప్రస్తావించినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ సమస్యపై కోర్టు స్పందించినా గత 18 నెలలుగా రోడ్లపై పడి మొత్తుకుంటుంటే పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం విచార కరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే వెయ్యి కోట్లు కేటాయించి అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే సీఐడీ వద్దనున్న అగ్రిగోల్డ్ బాధితుల డేటా ఆన్లైన్లో పెట్టాలన్నారు. లేని పక్షంలో జూలై 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారుల దిగ్బంధం చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని సైతం ముట్టడిందుకు కూడా తాము సిద్ధమేనన్నారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తిరుపతి రావు, జిల్లా నేతలు శివరామకృష్ణ, కృష్ణదేవరాజు, శ్రీనివాసులు, వెంకటేష్, సుధాకర్ పాల్గొన్నారు. -
కన్ను మూస్తున్నా..కళ్లు తెరవరా..?
మృత్యుపంజా విసురుతున్న మద్యం మత్తు జాతీయ రహదారిపై తరచుగా ప్రమాదాలు దుర్మరణంపాలవుతున్న వ్యసనపరులు, అమాయకులు అయినా రోడ్డుకు ఇరువైపులా మద్యం దుకాణాలు పట్టించుకోని అధికారులు నెలకోసారి మొక్కుబడిగా తనిఖీలు అమలుకాని సుప్రీంకోర్టు కమిటీ సూచనలు సాక్షి ప్రతినిధి, కాకినాడ/జగ్గంపేట :జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా ఉన్న మద్యం దుకాణాలన్నీ తక్షణం తొలగించాలి. వంద మీటర్లలోపు మద్యం దుకాణం అనేదే ఉండకూడదు. - రహదారుల భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సరిగ్గా నాలుగు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సూచన ఇది.జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఆ కమిటీ పలు సూచనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ కమిషనర్లకు లేఖ పంపింది.అయినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికార యంత్రాంగం నిర్లిప్తతతో ఈ సూచన అమలుకు నోచుకోవడంలేదు. ఫలితంగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పలువురు దుర్మరణం పాలవడంతోపాటు.. అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. విజయవాడ సమీపంలో గొల్లవిల్లివద్ద జరిగిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఇదే అంశాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. అమలాపురంలో జరిగిన క్రీడాపోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తిరిగి వెళ్తున్న ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు ఐదుగురు.. ఈ ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. డ్రైవర్ మద్యం తాగి ఆ బస్సును నడపడమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో జాతీయ రహదారి పక్కన మద్యం దుకాణాలను అనుమతించడంపై మరోసారి చర్చ మొదలైంది. జిల్లాలోనూ ఎన్నో ప్రమాదాలు జాతీయ రహదారిపై జిల్లాలో కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 13న గండేపల్లివద్ద 16 మంది ప్రాణాలు బలిగొన్న లారీ ప్రమాదానికి డ్రైవర్ మద్యం మత్తు కారణమన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తరువాత కూడా జిల్లాలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటికి ప్రధాన కారణం మద్యం మహమ్మారే! జిల్లాలో జాతీయ రహదారి వెంబడి పదికి పైగా మద్యం దుకాణాలున్నాయి. దాబాలు, పాన్ దుకాణాల్లో బెల్ట్‌షాపులు అంతకు పది రెట్లు అధికంగా ఉన్నాయి. ఈ విషయం తెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు పోలీసులు అప్పుడప్పుడు బ్రీత్ ఎనలైజర్‌తో రంగంలోకి దిగుతూంటారు. కానీ దీనివల్ల ప్రయోజనం కనిపించడంలేదు. ఎక్కడైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప శాశ్వత పరిష్కారంవైపు దృష్టి సారించడంలేదు. మత్తు.. పైగా మితిమీరిన వేగం జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. నాలుగు లేన్లుగా ఉన్న ఈ రహదారిపై వాహనదారులు గంటకు 100 కిలోమీటర్లు పైగా వేగంతో నడుపుతూండడం ప్రమాదాలకు హేతువుగా మారుతోంది. ఈ రహదారిపై ప్రతి రోజూ వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇతర రాష్ట్రాల వాహనాలు కూడా ఉండడం.. సుదీర్ఘ ప్రయాణం కావడంతో.. బడలిక నుంచి బయటపడటానికి ఎక్కువమంది డ్రైవర్లు మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా మద్యం అందుబాటులో ఉంటోంది. మద్యం మత్తులో వేగంగా వాహనం నడిపినప్పుడు.. ఏమాత్రం మత్తులోకి జారినా పెను ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొక్కుబడిగా విధులు మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కేసులు పెట్టే అవకాశం ఉన్నా పోలీసులు, రవాణా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వారు మొక్కుబడిగా విధులు నిర్వహించడం తమ ప్రాణాలపైకి తెస్తోందని పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో డ్రైవర్లను తనిఖీ చేసినప్పుడు 30 ఎంజీకి మించి రీడింగ్ నమోదైతే.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్నారని పేర్కొంటూ, మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185 కింద పోలీసులు కేసు నమోదు చేయొచ్చు. అయితే వేలాది వాహనాల డ్రైవర్లను తనిఖీ చేయడానికి అవసరమైనన్ని బ్రీత్ ఎనలైజర్లు అందుబాటులో లేవు. గతంలో ఇచ్చినవాటిలో చాలావరకూ మూలకు చేరాయి. దీంతో జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు మొక్కుబడిగానే సాగుతోంది. జిల్లాలో హైవేను ఆనుకుని పలు పోలీసు స్టేషన్లు ఉన్నప్పటికీ తనిఖీలు పెద్దగా ఉండడంలేదు. నిరంతరం తనిఖీలు నిర్వహించేలా ప్రతి 5 కిలోమీటర్లకో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తే మందుబాబులైన డ్రైవర్లను అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంటుందనే ప్రతిపాదనలు ఉన్నాయి. వీటితోపాటు, సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తే మద్యం మత్తులో జరిగే ప్రమాదాలను చాలావరకూ తగ్గించవచ్చు. -
పత్తి రైతు కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: వ్యాపారుల మాయాజాలం, అధికారుల కక్కుర్తి, ప్రభుత్వ నిర్లక్ష్యం కలసి ఈసారీ పత్తి రైతుల పొట్టకొడుతున్నాయి. మద్దతు ధరపై ఏటా జరుగుతున్న మోసం ఈ సీజన్లోనూ మొదలైంది. భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోళ్లు మొదలుపెట్టిన తొలిరోజే రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అందలేదు. ఈసారి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,100 ప్రకటించగా... మంగళవారం వరంగల్ మార్కెట్లో వ్యాపారులు ఇచ్చింది రూ.3,000 నుంచి రూ.3,300 మాత్రమే. తమ కష్టమంతా కళ్లముందే దోపిడీ చేస్తుండడంతో కడుపు మండిన రైతులు ఆందోళనకు దిగారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో మార్కెట్లో కొనుగోళ్లు చాలాసేపు నిలిచిపోయాయి. మొదలు పెట్టగానే.. రాష్ట్రంలో ఈ ఏడాది 16.32 లక్షల హెక్టార్లలో పత్తి సాగుకాగా.. దాదాపు 150 లక్షల క్వింటాళ్ల దిగుబడి ఉంటుందని అంచనా. 2015-16 మార్కెట్ సీజన్లో పత్తికి రూ.4,100 మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 84 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సీసీఐ ప్రకటించింది. ఈనెల 10 నుంచి కొనుగోళ్లు చేపడతామని ప్రకటించినా.. సెలవుల పేరుతో 12వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మంగళవారం వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్లో పత్తి కొనుగోళ్లు చేపట్టారు. మార్కెట్‌కు రైతులు 24 వాహనాల్లో లూజుగా(బస్తాల్లో కాకుండా నేరుగా), విడిగా మరో 50 వేల బస్తాల్లో పత్తిని తెచ్చారు. అయితే సీసీఐ అధికారులు కొనుగోలుకు ముందే నిబంధనల సాకులు మొదలుపెట్టారు. వాహనాల్లో లూజుగా తెచ్చిన పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు. అలా తెచ్చిన పత్తికే తేమ పరీక్షలు చేశారు. 15 వాహనాల్లోని పత్తికి మద్దతు ధర చెల్లించారు. మిగతా తొమ్మిది వాహనాల్లోని పత్తిని తేమ సాకు చెప్పి తిరస్కరించారు. ఇక బస్తాల్లో పత్తిని తెచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వ్యాపారుల దోపిడీ ఇలా.. సీసీఐ తిరస్కరించిన, బస్తాల్లో తెచ్చిన పత్తిని వ్యాపారులు కొనుగోలు చేశారు. దాదాపు 80 శాతం పత్తికి రూ.3,000 నుంచి రూ.3,300 మధ్య ఇస్తామన్నారు. మిగతా 20 శాతం పత్తికి రూ.3,920 ధర పెట్టారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలంటూ పత్తి కార్యాలయాన్ని ముట్టడించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు వచ్చి రైతులను నియంత్రించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సాంబయ్య అనే రైతు కొంత పత్తిని కాల్చే ప్రయత్నం చేశారు. కొద్దిగా పొగలు కమ్ముకోవడంతో మార్కెట్లోని ఫైరింజన్ వచ్చింది. కొద్దిగా అంటుకున్న పత్తిపై సిబ్బంది నీళ్లు చల్లి ఆర్పారు. అనంతరం కొందరు రైతులు మార్కెట్ కార్యాలయానికి వచ్చి పత్తికి క్వింటాల్‌కు రూ.6 వేలు చొప్పున ధర ఇవ్వాలని, బస్తాల్లో తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని అక్కడికి వచ్చిన వరంగల్ ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. మార్కెటింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు నిరసన తెలిపిన కొందరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఖమ్మం, కరీంనగర్లోనూ ఇదే తీరు.. ఖమ్మం జిల్లాలో ఇప్పుడిప్పుడే పత్తి మార్కెట్లకు వస్తోంది. సీసీఐ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో రైతులను వ్యాపారులు, దళారులు నిండా ముంచుతున్నారు. తేమ శాతం సాకుతో రూ.3000 నుంచి రూ.3,500 మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి జిల్లాలోని 8 కేంద్రాల్లో సీసీఐ పత్తిని కొనుగోలు చేయనుంది. ఇక మంగళవారం కరీంనగర్ మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించినా... తేమ సాకుతో కొనుగోళ్లు చేపట్టలేదు. 12 శాతం తేమ ఉంటేనే కనీస మద్దతు ధర రూ.4,100 చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేసారు. సీసీఐ కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ విషయాన్ని మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని జమ్మికుంట, కరీంనగర్, గంగాధర, చొప్పదండి, పెద్దపల్లి యార్డుల్లోనూ సీసీఐ కేంద్రాల జాప్యంతో వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 10 వేల క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు సగటున రూ.3 వేల చొప్పున కొనుగోలు చేశారు. మేం తెచ్చింది పత్తి కాదా..? మార్కెట్‌కు 16 బస్తాల పత్తిని తెచ్చిన. బస్తాలల్ల తెచ్చిన్నని సీసీఐ అధికారులు కొనరట. మేము తెచ్చింది పత్తి కాదా. నిమ్ముతో సహా మంచిదో కాదో చూసుకోండి. లూజుగా తేవాలంటే వ్యాను కిరాయి తక్కువ అయితదా. ఏందీ మోసం? - గుండారపు స్వామి, మొగుళ్లపల్లి అంతా మోసపు మాటలు నేను 21 బస్తాల పత్తిని వరంగల్ మార్కెట్‌కు తీసుకువచ్చిన. ఇక్కడ క్వింటాలుకు రూ.3,350 ధర పెట్టారు. మరి ప్రభుత్వం చెబుతున్న మద్దతు ధర ఏది. సీసీఐ అధికారులు ఏరి. అంతా మోసపు మాటలు. అందరు కలసి దోచుకోవడమే లెక్క. - జోడు కనకయ్య, జమ్మికుంట -
ప్రాణహితపై చిత్తశుద్ధి కరువు
- వర్షాభావంపై రైతులకు అవగాహన కల్పించాలి - మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి నవీపేట : ప్రాణహిత ప్రాజెక్ట్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. భూ ఉపరితలం నుంచి 300 అడుగుల లోతులో టన్నెల్ నిర్మాణ పనులు చేపడుతున్నారని, టన్నెల్ లోపల చుట్టూ సీసీతో ప్లాస్టరింగ్ చేయాలనే నిబంధన ఉందని అన్నారు. కానీ సీసీ పనులను చేపట్టకపోవడంతో 200 అడుగుల లోతులో ఉన్న రైతుల బోర్లు వట్టిపోతున్నాయన్నారు. భూగర్భ జల మట్టం తగ్గుతున్నందున రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రూకల్పన చేసిన ఎర్రకుంట రిజర్వాయర్ పనులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రుణమాపీ పథకంతో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. పహణీ నకలు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే రైతులకు ఆలస్యంగా ధృవీకరణ పత్రాలను అందిస్తున్నారని రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు లింబయ్యకు అప్పులు లేవని ఆర్డీవో పేర్కొనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం ధృవీకరించడం లేదన్నారు. రూ. 35 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న వాటర్ గ్రిడ్ పథకంపై విసృ్తత ప్రచారం చేస్తున్న ప్రభుత్వం జిల్లాలోని 30 గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత నీటిని అందించే యంచ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించడం లేదని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ మాట్లాడుతూ.. ప్రాణహిత ప్రాజెక్ట్ పనులలో 20, 21, 22 ప్యాకేజీలలో నిలిచిన పనులను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా నవీపేట జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్‌ను నియమించినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ రాజేందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గోవర్దన్ రెడ్డి, నాయకులు సూరిబాబు,తెడ్డు పోశెట్టి, సాయరెడ్డి, మహిపాల్‌రెడ్డి,సంజీవ్‌రావ్, దేవరాజ్, గంగాదర్, రవీందర్‌రావ్ పాల్గొన్నారు. -
సాగరమే దిక్కు
ఒకవైపు కమ్ముకొస్తున్న కరువు...మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం... వెరసి జిల్లా ప్రజలకు శాపంగా మారుతోంది. ఒక్క వారం రోజుల్లో నాగార్జున సాగర్ నుంచి 1.5 టీఎంసీల తాగునీరు రాకపోతే గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రజలు అల్లాడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని ప్రాజెక్టులు, తాగునీటి చెరువుల్లో ఉన్న నీరు మరో వారం రోజులు మాత్రమే సరిపోతాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. - అడుగంటుతున్న చెరువులు - సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో అరకొర నీరే - ఒంగోలు నగరంతోపాటు ప్రధాన పట్టణాల్లో దాహం కేకలు - వారం రోజుల్లో సాగర్ నీరు రాకుంటే కష్టమే... సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో ఇప్పటికే ఒక పక్క వర్షాభావ పరిస్థితులు, మరోపక్క సాగర్ నుంచి నీరు రాకపోవడంతో ఖరీఫ్‌లో పంటలు సాగు చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగర్ నుంచి తాగునీటిని విడుదల చేయకపోతే గుక్కెడు మంచినీళ్ల కోసం వలసలు పోవాల్సిన దుస్థితి రానుంది. తాగునీటి అవసరాల కోసం 1.5 టీఎంసీల నీరు కావాలని కలెక్టర్ సుజాతా శర్మ ప్రభుత్వాన్ని కోరి 15 రోజులు దాటినా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. తాజాగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తాగునీరు విడుదల చేయడం సాధ్యం కాదు. కార్పొరేషన్లో నాలురోజులకోసారి... ఒంగోలు కార్పొరేషన్లో ఇప్పుడు నాలుగు రోజులకోసారి తాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే స్థితి కొనసాగితే వారానికి ఒక రోజు కూడా నీరు అందించాల్సి రావచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 5800 మిలియన్ లీటర్ల సామర్ధ్యం గల రెండు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఒంగోలుకు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం రెండువేల మిలియన్ లీటర్ల నీరు మాత్రమే ఉంది. రోజుకు ఒంగోలుకు 40 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుంది. దీంతో ప్రస్తుతం ఉన్న నిల్వలు నెల రోజులకు కూడా సరిపోవు. గతంలో గుండ్లకమ్మ నుంచి నీటిని ఒంగోలుకు పైపుల ద్వారా తెచ్చే అవకాశం ఉండేది. జాతీయ రహదారి విస్తరణ సమయంలో కార్పొరేషన్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డు కాంట్రాక్టర్లు ఆ పైపులను తీసి రోడ్డు వేశారు. దీంతో అక్కడి నుంచి నీరు మళ్లించే మార్గం లేకుండాపోయింది. రామతీర్థం జలాశయం వారం రోజుల కన్నా ఎక్కువ రాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణాకు కూడా నీరు విడుదల చేయాల్సి ఉన్నందున రెండు రాష్ట్రాలు చొరవ తీసుకుని ఒక నిర్ణయానికి వస్తేగానీ తాగునీరు జిల్లాకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. మార్కాపురం సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులో కొద్దిమేరకు నీరు నిలువ ఉంది. ఈ నీరు కూడా గట్టిగా పది రోజుల వరకు మాత్రమేసరిపోతాయని అధికారులు భావిస్తున్నారు. మార్కాపురం పట్టణానికి దూపాడు నుంచి సాగర్ మంచినీటి సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం దూపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌లో 400 మిలియన్ లీటర్ల నీరుంది. ప్రస్తుతం పట్టణంలో రోజు మార్చి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గానికి రామతీర్థం జలాశయం నుంచి నీటిని ఇస్తున్నారు. కనిగిరి మున్సిపాలిటీకి దర్శిలో కనిగిరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నుంచి నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం రామతీర్థం జలాయంలో నీటి శాతం డెడ్ స్టోరేజ్‌కు చేరింది. దర్శిలో ఉన్న కనిగిరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో నీటిశాతం 40 శాతానికి చేరింది. వీటి సామర్థ్యాన్ని చూస్తే నెలాఖరు వరకు నీళ్లు వస్తాయని సమాచారం. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో 96 తాగునీటి మోటార్లుండగా ఇందులో కేవలం 25 మోటార్లలో మాత్రమే అంతంత మాత్రంగా నీరు వస్తోంది. దీంతో పట్టణంలోని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. పట్టణానికి తాగునీటి వసతి కల్పించేందుకు మండలంలోని దిగువమెట్ట సమీపంలో గల అడవుల్లో ఉన్న భైరేని గుండాల నుంచి సరఫరాచేసేందుకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించారు. అటవీ అనుమతులు లేకపోవడంతో నిర్మాణం పూర్తయినా నీరు సరఫరా చేయడం లేదు. దీంతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిరుపయోగంగా మారింది. పట్టణానికి తాగునీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లే దిక్కుగా ఉన్నాయి. పది రోజుల్లో ఎన్ఎస్పీ నుంచి నీరు రాకపోతే దర్శి నియోజకవర్గంలోని 158 గ్రామాలు , జిల్లాలో దాదాపు 400 గ్రామాల ప్రజలు తాగు నీటికి ఇబ్బందుల పడే అవకాశం ఉంది. ఒంగోలు కార్పొరేషన్లో ఇప్పుడు నాలుగు రోజులకోసారి తాగునీరొస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వారానికోసారి తాగునీరు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడనుంది. మార్కాపురం, కనిగిరి, దర్శి సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుల్లో నీళ్లు అడుగంటాయి. ఇంకా పట్టుమని పదిరోజులు కూడా ఈ నీళ్లు సరిపోయేట్టు లేవు. -
గాలిలో దీపం
- దీపం పథకం కింద జిల్లాకు 31,159 కనెక్షన్లు మంజూరు - పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక - జూన్ నాటికే కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశం - ఓపెన్ కాని దీపం వెబ్సైట్ - మూడేళ్లలో మంజూరై, గ్రౌండు కాని 69,273 కనెక్షన్లు రద్దు సాక్షి ప్రతినిధి, తిరుపతి: దీపం పథకం కింద పేదలకు ఇచ్చే గ్యాస్ కనెక్షన్ల మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏటా జిల్లాకు వేల సంఖ్య లో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పేదలందరికీ మాత్రం చేరడం లేదు. లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. 2011-14 అంటే మూడేళ్లలో సాధారణ, ప్రత్యేక కేటగిరీలో జిల్లాకు 87,271 కనెక్షన్లు మంజూరు కాగా, ఇందులో కేవలం 17,998 కనెక్షన్లు మాత్రమే లబ్ధిదారుల కు ఇచ్చారు. మిగిలిన 69,273 కనెక్షన్లను పెం డింగ్‌లో ఉంచారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గత మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసింది. తాజాగా జిల్లాకు 31,159 కనెక్షన్లను మంజూరు చేశారు. వీటిని కూడా జూన్ లోపల గ్రౌండ్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇంతవరకు లబ్ధిదారుల ఎంపిక జరిపి వారికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన దాఖలాలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. ఏటా జరిగే తంతు మాదిరి ఈసారీ జరుగుతుందేమోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తులు ఎంపీడీవో కార్యాలయంలో ఇచ్చి దీపం కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక ఇలా.. మండలంలో దరఖాస్తులను ఏంపీడీవోలకు అందజేయాలి. అందులో అర్హులైన వారిని గుర్తించి వారి దరఖాస్తులను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. రూరల్ పరిధిలో డీఆర్డీఏ పీడీకి, నగర, పట్టణ పరిధిలో అయితే కమిషనర్‌కు జాబితాను అందజేస్తారు. వీరు ఇన్చార్జి మంత్రి ఆమోదంతో తుది జాబితాను ఎంపిక చేసి లిస్టును గ్యాస్ ఏజెన్సీలకు పంపుతారు. దీనికి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను తయారు చేసింది. రెండు నెలలుగా ఆ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల దరఖాస్తులను అప్లోడ్ చేయలేదు. చివరకు ఈ వెబ్సైట్ పనిచేయకపోవడంతో తాజాగా ఈనెల 17వ తేదీన ఈపీడీఎస్ వెబ్సైట్లోనే దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని సూచించింది. దీంతో ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. -
పాపం..ప్రభుత్వానిదే
- ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి - వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు తిరుపతి రూరల్: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పవిత్ర పుష్కరాల్లో 27 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, ఆ పాపం ప్రభుత్వనిదేనని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. గోదావరి పుష్కరాల్లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తుమ్మలగుంటలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. తుమ్మలగుంట లోని చాముండేశ్వరీ దేవి ఆలయం సర్కిల్ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో ఎస్సీ సెల్ నాయకులు, విద్యార్థులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల వస్తారని ముందుగానే తెలిసినా అందుకు తగిన ఏర్పాట్లను ఘాట్ల వద్ద ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. భక్తులు కూడా సంయమనం పాటించి పవిత్ర పుష్కర స్నానలను చేయాలని సూచించారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తొక్కిసలాటకు భధ్యత వహించి సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు డిమాండ్ చేశారు. పుష్కరాల ఏర్పాట్లలో వందల కోట్ల అవినీతి జరిగిందని, ఏర్పాట్లు నాసిరకంగా చేయడంతోనే 27 మంది మృతి చెందారని ఆరోపించారు. భారీకేడ్లను పటిష్టంగా ఏర్పాటు చేసి ఉంటే అంత పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగి ఉండేది కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారపు వాసు, చాట్ల భానుప్రకాష్, ఎస్సీ సెల్ రూరల్ అధ్యక్షుడు వెంకటరమణ, పొన్నయ్య, సూరి, లోకనాథం పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే యూనివర్సిటీక్యాంపస్: రాజమండ్రిలో మంగళవారం ప్రారంభమైన పుష్కరాల్లో 27 మంది మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆరోపించింది. రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాట సందర్భంగా మరణించిన 27 మంది ఆత్మ శాంతి కోసం మంగళవారం రాత్రి ఏడుగంటలకు తిరుపతిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ వెస్ట్ చర్చి నుంచి ఎంఆర్‌పల్లి కూడలి వరకు సాగింది. ఎంఆర్‌పల్లి కూడలిలో పుష్కర మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం, సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల తొక్కిసలాట జరిగి భక్తులు మరణించారన్నారు. 144 సంవత్సరాలకోసారి వచ్చే మహాపుష్కరాలపై ప్రభుత్వం విపరీతమైన ప్రచారం చేయడంతో ఎక్కువమంది పుష్కర స్నానాల కోసం రాజమండ్రికి తరలివచ్చారన్నారు. చంద్రబాబు వీఐపీ ఘాట్‌కు వెళ్లకుండా, సాధారణ పుష్కరిణి ఘాట్‌కు వెళ్లారన్నారు. దీంతో సాధారణ భక్తులను ఐదు గంటలపాటు క్యూలోనే ఉంచి, ఒక్కసారిగా వదలడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హేమంత్‌యాదవ్, క్యాంపస్ అధ్యక్షుడు మురళీధర్, నాయకులు హేమంత్‌రెడ్డి, కిషోర్‌కుమార్, సుధీర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మౌళాళి, రామాంజనేయులు, నవీన్, అంజన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు నిర్లక్ష్యం.. గిరిజనులకు శాపం
సాక్షి, హైదరాబాద్ : మన్యం వాసులను ఓ మహమ్మారి బలి తీసుకుంటోంది.. గిరిజన గూడెంలలో తీరని శోకం మిగులుస్తోంది.. జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధి సికిల్ సెల్ అనీమియా ఏజెన్సీని చాపకింద నీరులా చుట్టేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో అంతుచిక్కని రోగంతో అడవి బిడ్డలు ప్రాణాలు వదులుతున్నారు. ఇటీవల తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూరు-టి ప్రాంతాల్లోని గిరిజనులకు రక్త పరీక్షలు నిర్వహించగా వారికి ఈ ప్రాణాంతక వ్యాధి లక్షణాలున్నట్లు బయటపడింది. మంచిర్యాలలోని ఆస్పత్రుల్లో ఈ కేసులను గుర్తించినట్లు ప్రభుత్వానికి నివేదికలు సైతం అందాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ఏజెన్సీలో ఈ వ్యాధి విస్తరిస్తున్నట్లు ఇదివరకే ‘సాక్షి’ రుజువులతో సహా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ముందుజాగ్రత్త తప్ప మందే లేని ఈ వ్యాధి నుంచి గిరిజనులను కాపాడేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. అడుగడుగునా సర్కారు నిర్లక్ష్యం.. గిరిజన విద్యాసంస్థల్లోని విద్యార్థులకు నిర్వహించిన రక్త పరీక్షల్లో సికిల్ సెల్ అనీమియా కేసులు ఎక్కువ బయటపడుతున్నాయి. ఈ వ్యాధిపై కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా స్పందించి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రూ. కోటి మంజూరు చేసింది. కానీ, 10 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గిరిజన విద్యార్థులకు హెల్త్ మ్యాపింగ్ చేసి, మలేరియాతో పాటుగా సికిల్ సెల్ అనీమియాకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ కమిటీ రాష్ట్ర ఉన్నతాధికారులకు సూచించినా మొక్కుబడి చర్యలనే తీసుకున్నారు. గిరిజనులు అధికంగా ఉండే ఖమ్మం జిల్లాలో స్క్రీనింగ్, డయాగ్నిస్టిక్ అవసరాల కోసం రూ.12 లక్షలతో హేపీసీఎల్ మిషన్‌ను కొనేందుకు, స్క్రీనింగ్ టెస్ట్‌కు అవసరమైన వస్తువుల కోసం రూ.4 లక్షలు అవసరమవుతాయని ఆ జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. ఇక మిగిలిన జిల్లాల్లో కనీసం సికిల్ సెల్ అనీమియా పరీక్షలు కూడా చేయలేదు. వ్యాధి లక్షణాలు ఇవీ.. సాధారణంగా మనిషి రక్తంలో గుండ్రటి ఆకారంలో ఉండే ఎర్రరక్తకణాలు రక్తనాళాల ద్వారా శరీరంలో ప్రయాణిస్తూ వివిధ అవయవాలకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. జన్యుపరమైన మార్పులు సంభవించే కొందరిలో రక్తకణాలు కొడవలి ఆకారంలో మారి రక్తనాళాల ద్వారా ప్రయాణించడం కష్టంగా మారుతుంది. దీనివల్ల శరీర భాగాలకు ఆక్సిజన్ అందదు. ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణం ఆయుప్రమాణం 125 రోజులు కాగా, సికిల్‌సెల్ ఆయుప్రమాణం కేవలం 20 రోజులే. త్వరగా నశించిపోయే రక్త కణాలకు ధీటుగా ఎముకల్లోని మూలుగు (బోన్‌మారో) కొత్త రక్తకణాలను ఉత్పత్తి చేయలేదు. దీనితో రోగి రక్తహీనత బారిన పడి చనిపోతాడు. జన్యుమార్పుల కారణంగా వచ్చే ఈ వ్యాధికి మందు లేదు. ఇది వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎర్ర రక్త కణంలో ఒక జన్యువు మామూలుగా, మరొకటి వంపు తిరిగి ఉంటే (సికిల్) వారిని సికిల్ క్యారియర్లుగా పేర్కొంటారు. వీరికి ఎలాంటి అనారోగ్యం ఉండదు. అయితే ఇలాంటి ఇద్దరు క్యారియర్లు వివాహం చేసుకుంటే వారికి పుట్టే పిల్లల రక్త కణాల్లో రెండు జన్యువులు వంపు తిరిగి ఉంటాయి. వీరిని సికిల్ రోగులుగా పిలుస్తారు. వీరు పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో ఉంటారు. అధికశాతం మంది 15-20 ఏళ్లకే చనిపోతారు. -
చక్రబంధం
రెండో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె ఇబ్బందులకు లోనవుతున్న ప్రయాణికులు ప్రభుత్వ వైఖరిపై మండిపాటు ప్రైవేట్ వాహన యజమానుల దోపిడీ ఆర్టీసీకి రూ.80 లక్షల నష్టం కర్నూలు(రాజ్‌విహార్/అర్బన్) : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. బస్సులు డిపోలకు పరిమితం కాగా.. రవాణా వ్యవస్థ స్తంభించింది. ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రజలకు భారంగా పరిణమిస్తోంది. వేసవి సెలవులు కావడం.. పెళ్లిళ్లు, శుభకార్యాలతో పాటు పోటీ పరీక్షల సమయం కావడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. సమ్మె కారణంగా జిల్లాలోని 11 డిపోల్లో 658 బస్సులు నిలిచిపోయాయి. 312 బస్సులు తిప్పగా.. ఇందులో ఆర్టీసీ బస్సులు 145, అద్దెబ బస్సులు 167 ఉన్నాయి. మొత్తంగా సంస్థకు రూ.80 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టి.వి.రామం తెలిపారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ఆర్టీసీ అధికారులు తిప్పుతున్న బస్సుల్లో ప్రైవేట్ ఉద్యోగులు చార్జీలను ఎడాపెడా వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. రాయితీ పాసులు, క్యాట్ కార్డులు, ఇతరత్రాలను అనుమతించకపోవడంతో కండక్టర్ అభ్యర్థులు, ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ప్రైవేట్‌లో రెండింతల డోపిడీ కడుపు మండిన ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే... సందట్లో సడేమియాగా ప్రైవేట్ వాహన యజమానులు దోపిడీకి తెరతీశారు. కండీషన్ లేని వాహనాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇక చార్జీలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. సాధారణంగా కర్నూలు నుంచి కోడుమూరుకు ఆర్టీసీకి సంబంధించి ఆర్డినరీ సర్వీసుకు రూ.21, ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌కు రూ.28 చార్జీ ఉంది. అయితే సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి ప్రైవేట్ వాహనాలు రూ.30 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. ఆర్టీసీ అద్దె బస్సులు కూడా తామేమీతక్కువ కాదంటూ రూ.30 వసూలు చేస్తుండటం పట్ల ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. రెండో రోజూ కొనసాగిన సమ్మె ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ)లతో పాటు వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఇతర కార్మిక సంఘాల నాయకులు బస్‌స్టేషన్‌లో ఆందోళన నిర్వహించారు. ఈయూ రాష్ట్ర కార్యదర్శులు ఎ.వి.రెడ్డి, ఖాజా మిన్నల్ల, ఊరుకుందు, రషీద్, రీజినల్ కార్యదర్శి మద్దిలేటి, ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్, జిల్లా కార్యదర్శి మద్దిలేటి, జిల్లా నాయకులు సింగ్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వి.కుమార్, జిల్లా నాయకులు ఎంబీఎన్ శాస్త్రీ పాల్గొన్నారు. సమ్మెకు ఏపీ ఎన్జీవో సంఘం నేతలు వెంగళ్‌రెడ్డి, శ్రీరాములుతో పాటు ఇతర ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. -
ఉన్నత విద్యా! నీ ఉన్నతి ఎలా?
విద్యా ప్రమాణాలు దిగజారి, డిగ్రీలు అసంబద్ధమై, పట్టాలు ఉపాధికి పనికి రానివై, పట్టా పొందిన విద్యార్థులకు ఉద్యోగార్హతల్లేక... ఉన్నత విద్యకే పెనుసవాలుగా మారుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంస్కరణ దిశలో తక్షణ చర్యలు చేపట్టకుంటే ఉన్నత విద్య ఇప్పట్లో బాగుపడే లక్షణాలు కనిపించడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారులై, విద్య ఫక్తు వ్యాపారమై, ఉపాధ్యాయుల్ని ఉద్యోగులుగా, విద్యార్థుల్ని వినియోగదారులుగా పరిగణిస్తున్నంత కాలం ఉన్నత విద్యకు మోక్షం లేదనే భావన బలపడుతోంది. ఉన్నత విద్యను ఇప్పటికే పీడిస్తున్న అనేకానేక సమస్యలకు తోడు రాజకీయ దివాలాకోరుతనం మరింత దిగజారుస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్య, దాని ప్రమాణాలు అత్యంత వేగంగా పడిపోతున్నాయి. గడచిన ఒకటి, రెండు దశాబ్దాలుగా ముప్పిరిగొంటున్న సమస్యలకు తోడైన తాజా పరిణామాలతో ఉన్నత విద్య, ప్రధానంగా వైద్య, సాంకేతిక ఇతర వృత్తి విద్యారంగం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఇంటర్ పరీక్షలు, ఎమ్సెట్, ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ విషయమై రెండు కొత్త రాష్ట్రాల నడుమ సాగుతున్న జగడం మచ్చుకు ఓ ఉదాహరణ (టిప్ ఆఫ్ ఐస్‌బర్గ్) మాత్రమే! విద్యార్థుల్లో అయోమయాన్ని, తల్లిదండ్రుల్లో ఆందోళ నను రేపుతున్న ఈ వివాదం ఏ రకంగా చూసినా అవాంఛనీయం. కానీ, ఎవరు చెప్పినా వినే పరిస్థితి రెండు ప్రభుత్వాలకూ లేదు. ప్రభుత్వ పెద్దలు పనికిమాలిన ప్రతిష్టకు పోయి విద్యార్థుల్ని, ఒక విద్యా సంవత్సరాన్నే అగమ్య గోచర స్థితిలోకి నెడుతున్నారు. ఇంకో వైపు విద్యా ప్రమాణాలు దిగజారి, డిగ్రీలు అసంబద్ధమై, చేతికొచ్చే పట్టాలు ఉపాధికి పనికిరానివై, పట్టాపొందిన విద్యార్థుల్లో ఉద్యోగార్హతల్లేక... ఉన్నత విద్యకే పెనుసవాలుగా నిలుస్తున్నా యి. ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి సంస్కరణ దిశలో తక్షణ చర్యలు చేపట్టకుంటే అది ఇప్పట్లో బాగుపడే లక్షణాలు ఏ మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారులై, విద్య ఫక్తు వ్యాపారమై, ఉపాధ్యాయుల్ని ఉద్యోగులుగా, విద్యార్థుల్ని వినియోగదారులుగా పరిగణిస్తు న్నంత కాలం ఉన్నత విద్యకు మోక్షం లేదనే భావన బలపడుతోంది. ఇంతకన్నా దయనీయం ఏముంటుంది? తెలంగాణ రాష్ట్రంలో ఈసారి దాదాపు 80 ఇంజనీరింగ్ కళాశాలలు విధి లేని స్థితిలో, స్వచ్ఛందంగా మూసేసుకునే పరిస్థితి. 40 కళాశాలల్లో కనీసం ఒక విద్యార్థి కూడా చేరలేదు. సుమారు అంతే సంఖ్యలో కళాశాలలు, మేం పిల్లల్ని చేర్చుకోవడం లేదు, ఇక తనిఖీలకు మమ్మల్ని పరిగణనలోకి తీసుకోకండి అని స్వయంగా అధికారులకు తెలియజెప్పడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 700 కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలుండి, దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల్ని చేర్చుకొని, ఏటా ఒకటిన్నర లక్షల ఇంజనీర్లను పట్టాలిచ్చి బయటకు పంపినప్పుడు గొప్ప రాష్ట్రంగా మురిశాం. గ్లోబలీ కరణలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఐటీ రంగ అవకాశాలు, మార్కెట్ చోదక ఆర్థిక వ్యవస్థ, బయటి సేవల వినియోగం... వీటి పుణ్యమా అని మన కుర్ర ఇంజనీర్లందరికీ సువర్ణావకాశాలని సంబరపడ్డాం. కానీ, అరకొర మౌలిక సదుపాయాలు, ఉండీలేని బోధనా సిబ్బంది, ఉన్న టీచర్లకూ కనీస విద్యా ర్హతలు లేని దుస్థితిలో పిల్లలేం నేర్చారని గమనించలేకపోయాం. విద్యను వ్యాపారం చేసి, డబ్బు గడించడమే ధ్యేయమనుకున్న నిర్వాహకులు మొండి గోడల్ని కొంచెం అటుఇటుగా మార్చి కోళ్లఫారాలలో కూడా కాలేజీలు నడిపిన దౌర్భాగ్యం. ఇంజనీరింగ్ పిల్లలకు బోధించడానికి ఎమ్‌టెక్ తదితరపీజీ డిగ్రీ కనీసార్హత అయిన చోట, బీటెక్ కాదు కదా పాలిటెక్నిక్ చదివిన వారితోనూ పాఠాలు చెప్పించిన ఉదంతాలున్నాయి. ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో ఉద్యోగా ర్హత ఎంత అనే విషయమై, ప్రభుత్వం పనుపున ‘ఆస్పైరింగ్ మైండ్స్’అన్న ఏజెన్సీ జరిపిన అధ్యయనంలో వెలుగు చూసిన నిజాలు ఎవరికైనా ముచ్చె మటలు పుట్టిస్తాయి. ప్రతి వంద మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో ఉద్యోగార్హత కలిగిన వారి సంఖ్య రాష్ట్రంలో 17 కంటే తక్కువ! ఇది బీహార్, జార్ఖండ్ (100 నుంచి 75 శాతాల మధ్య), మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ (75 -50 శాతాల మధ్య), ఒరిస్సా, రాజస్థాన్ (50-25 శాతాల మధ్య) రాష్ట్రాల కన్నా అధ్వాన్నమైన స్థితి. ఎందుకీ దుస్థితి దాపురించిందంటే, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇంజనీరింగ్ కాలేజీలు నడిపిన వారి అత్యాశ వల్ల. మెజారిటీ కాలేజీలు ఏ నిబందనలు అనుసరించకుండా, ఏ ప్రమాణాలూ పాటించకుండా నడిచినవే! ఇతర కాలేజీ సిబ్బందిని తమ సిబ్బందిగా చూప డం, లేని విద్యార్థుల్ని ఉన్నట్టుగా చూపి ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉపకార వేతనాలు కొల్లగొట్టడం వంటి నేరాలూ-ఘోరాలూ జరిగాయి. అవన్నీ తనిఖీ చేసి, ప్రాథమికంగా నిర్ధారించుకొని, నిన్నటికి నిన్న 11 ఇంజనీరింగ్ కాలేజీలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వృత్తి కళాశాలల్లో ప్రమాణాలపై అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వ టాస్క్ఫోర్సు నివేదికలోనే నివ్వెరపరిచే నిజాలున్నాయి. 2012 ఆగస్టు 11న అప్పటి రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్సు (జివో ఎమ్మెస్ నం: 54) మొత్తం 654 కాలే జీల్లో పరిశీలన జరిపింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం చూస్తే, 319 కాలేజీల్లో అవసరమైన భవన సదుపా యాలు లేవు. 394 కాలేజీల్లో కంప్యూటర్ టర్మినల్స్ ప్రమాణాల ప్రకారం లేవని, 449 కాలేజీల్లో ల్యాబరేటరీ సదుపాయాలు లేవని, 622 కాలేజీల్లో బోధనా సిబ్బంది ప్రమాణాలకనుగుణంగా లేరని తేల్చిచెప్పింది. టీచర్- విద్యార్థి నిష్పత్తి 1:15 ఉండాలన్నది ప్రామాణికమైతే, సదరు నిర్వహణ ఎక్కడా దరిదాపుల్లో కూడా లేదని తేటతెల్లమైంది. అందులోనూ, విద్యార్హతలతో నిమిత్తం లేకుండా చూసినా టీచర్-విద్యార్థి నిష్పత్తి సగటున 1:28 గా ఉండింది. 171 కాలేజీల్లో ఆ నిష్పత్తి 1:51 గా ఉందంటే దుస్థితిని తేలిగ్గానే అంచనా వేయొచ్చు! వేతన సంఘం సిఫారసుల ప్రకారం టీచర్లకు వేతనాలిచ్చారా? అనేది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేని సదుపాయాలు ఉన్నట్టు 58 కాలేజీలు సుప్రీంకోర్టుకు, 11 కాలేజీలు హైకోర్టుకు నిర్లజ్జగా తప్పుడు అఫిడవిట్లు ఇవ్వడం వారి విచ్చలవిడితనాన్ని స్పష్టం చేసింది. మధ్య, అల్పాదాయ బడుగు జీవుల పిల్లలకూ ఉన్నత విద్య లభించాలనే ఉదాత్త ఆశయంతో తలపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొల్లగొట్టడానికే పుబ్బలో పుట్టి మఖలో మూతపడ్డ కాలేజీలూ ఉన్నాయి. అఖిల భారత స్థితేమీ గొప్పగా లేదు! ప్రపంచం నాగరికత కోసం అలమటిస్తున్నపుడు, పదిహేను వందల సంవత్స రాల కిందటే నలంద, తక్షశిల, విక్రమశిల వంటి పేరెన్నిక గన్న విశ్వవిద్యాల యాలు నెలకొల్పి, విశ్వవిద్యకు బీజం వేసిన నేల ఇది. ఇటీవలి కాలం వరకూ భారతదేశానికి చెందిన ఐఐటి వంటి విద్యా సంస్థలు ప్రపంచంలోని పది మేటి విద్యాసంస్థల్లో ఉండేవి. కానీ, ఇటీవల వెలువరించిన ఓ తాజా అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచంలోని తొలి 200 విశ్వవిద్యాలయా ల్లోనూ భారత్‌కు చోటు దక్కలేదు. 2014-15కుగాను ప్రపంచ విశ్వవిద్యాల యాలు, తత్సమాన విద్యా సంస్థలకు ర్యాంకులిస్తూ ‘టైమ్స్’ ఉన్నత విద్య విభాగం ఈ నివేదికను వెల్లడించింది. దేశానికి చెందిన 2 సంస్థలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు, చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలకు మాత్రం 276 నుంచి 300 స్థానాల్లో చోటు దక్కింది. ఐఐటీ-ముంబాయి, ఐఐటీ-రూర్కీలకు 351 నుంచి 400 ర్యాంకుల్లో స్థానం దక్కింది. మొదటి 10 స్థానాల్లో 7 (మొదటి 200లలో 74 స్థానాలు) దక్కించుకొని అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి పదిలో మిగతా 3 స్థానాలు బ్రిటన్ విశ్వవిద్యాలయాలకు దక్కాయి. ఇక ‘బ్రిక్స్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో 2014-15 కోసం విడిగా మరో అధ్యయనం జరిగింది. ఇందులో కూడా భారత్‌కు ఆశించదగ్గ ఫలితాలు కనిపించకపోవడం హెచ్చరిక లాంటిదే! తొలి రెండు స్థానాలు చైనా విశ్వవిద్యాలయాలకు, మూడో స్థానం టర్కీ విద్యాసంస్థకు దక్కింది. వంద ర్యాంకుల్లో 25వ స్థానం మాత్రం మన బెంగళూరు ఐఐటీకి దక్కింది. ఆ పైన మరో పది సంస్థలు, ప్రధానంగా ఐఐటీలూ ఈ వందలో చోటు దక్కించుకున్నాయి. కేవలం ఈ ర్యాంకింగులే అన్నింటికీ ప్రామాణికం కాకపోవచ్చు. కానీ, మన దేశంలో ఉన్నత విద్యా రంగంలో దిగజారుతున్న ప్రమాణాలకు ఖచ్చితంగా ఇది స్పష్టమైన సంకేతమే! ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి! ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న దేశంగా పరిశీలించినపుడు, మన ఉన్నత విద్యారంగం ఆందోళన కలిగించేలా ఉందనడం అతిశయోక్తి ఏం కాదు. 24 సంవత్సరాల లోపు వయస్కుల జనాభా, 2011 నాటికే దేశంలో 50 శాతాన్ని మించింది. ఈ ఒరవడి ఇంకా ఉధృతితో కొనసాగుతోంది. 2020 నాటికి పనిచేసే వయస్కులు (15-64 ఏళ్లు), మొత్తం జనాభాలో మూడింట రెండొంతులుగా ఉంటారని అంచనా. మారుతున్న ప్రపంచ మార్కెట్ స్థితి, ఐ.టి అవకాశాలు, విజ్ఞాన ప్రపంచ ఆవిష్కరణల నేపథ్యంలో పరిస్థితుల్ని భారత్ తనకు అనుకూలంగా మలచుకోవడానికి ఉన్నత విద్యా ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఉన్నత విద్య స్థాయిలో, ముఖ్యంగా వృత్తి విద్య 70 శాతం వరకు ప్రయివేటు, కార్పొరేట్ శక్తుల గుప్పిట్లోనే ఉంది. లాభాపేక్షతో విద్యా సంస్థల్ని వ్యాపార దృక్పథంతో నడపడం వల్ల ప్రమాణాలుండటం లేదు. ఆర్థిక అసమానతల వల్ల అన్ని వర్గాల వారికి సమానావకాశాలుండటం లేదు. అర్హులైన బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్నత విద్యకు ప్రభుత్వం స్థూల వార్షికాదాయం (జీడీపీ)లో 0.37 శాతం నిధుల్ని మాత్రమే వెచ్చిస్తోంది. ఏ అభివృద్ధి చెందిన దేశంతో పోల్చి చూసినా ఇది చాలా నామమాత్రమే! ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అదే స్థాయిలో మూడో అతి పెద్ద ఉన్నత విద్యావ్యవస్థ కలిగిన దేశంగా గ్లోబలీకరణ సవాళ్లకు ఎదురొడ్డి, అవకాశాల్ని సానుకూలంగా మలచుకోవడానికి భారత్ సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా- 1. అవకాశం-విస్తరణ. 2. సమదృష్టి-కలుపుకొనిపోవడం. 3. నాణ్యత-ప్రపంచ ప్రమాణాలు- అన్న మూడంశాలకు ప్రాధాన్యత ఇచ్చి సత్వర సంస్కరణలు చేపడితేనే ఈ దేశంలో ఉన్నత విద్య బాగుపడుతుంది. ఆర్. దిలీప్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
ప్రజా రవాణాపై సర్కారు నిర్లక్ష్యం
⇒కుదిస్తున్న పల్లెవెలుగు బస్సులతో విద్యార్థులకు కష్టం ⇒50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ రేషియో ఉన్న రూట్లలో తగ్గిస్తున్న బస్సులు ⇒ఆర్టీసీ రీజియన్లలో పర్యటించని సేఫ్టీ ఆడిట్ టీంలు ⇒రోడ్ల అధ్వాన్న నిర్వహణపై లోపాలు చూపుతున్నా పట్టని ధోరణే సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణాపై సర్కారు ఎంత అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో ‘అనంత’ దుర్ఘటన అద్దం పడుతోంది. 2013లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రోడ్ల అధ్వాన్న నిర్వహణను ఎత్తి చూపినా గత అనుభవాల నుంచి పాలకులు పాఠాలు నేర్వడం లేదు. అటు రోడ్డు లోపాలతో పాటు ఆర్టీసీ బస్సుల అధ్వాన్న పరిస్థితి ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతోంది. బుధవారం అనంతపురం జిల్లా పెనుగొండ-మడకశిర మార్గంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో పలువురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆర్టీసీ రవాణా లోపాలను బట్టబయలు చేస్తోంది. సంస్థలో రోడ్డు ప్రమాదాల రేటు 2014-15 సంవత్సరానికి 0.09గా ప్రకటించి నా బస్సుల నిర్వహణ, నడిపే విధానంలో అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా పల్లెలకు తిరిగే బస్సుల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. నష్టాల పేరుతో పల్లెవెలుగు బస్సులు కుదిస్తూ ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారు. ప్రయాణికుల నిష్పత్తి 66 శాతానికి పెరుగుతున్నా, బస్సులను మాత్రం అందుకు తగ్గట్టు నడపడం లేదు. అనంతలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి రోడ్డు నిర్వహణతో పాటు విద్యార్థులు, ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులను నడపకపోవడమేనన్నది ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు టాప్‌పైనా పదుల సంఖ్యలో కూర్చొని ప్రయాణిస్తున్నారంటే బస్సుల నిర్వహణా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రీయింబర్స్‌మెంట్‌కే రూ.750 కోట్లు కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం బస్‌పాస్ రాయితీల రూపంలో రెండు రాష్ట్రాల్లో రూ.750 కోట్ల మేర ప్రతి ఏడాది చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే.. అందుకు తగ్గట్టు పలు ప్రధాన రూట్లలో బస్సులను మాత్రం ఆర్టీసీ నడపడం లేదు. ‘అనంత’ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది ఎక్కువ మంది విద్యార్థులే కాావడం గమనార్హం. బస్సులకు ‘పచ్చ’ రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ బస్సుల నిర్వహణలో కనిపించడం లేదు. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులపై ఆర్టీసీకున్న నిర్లక్ష్య ధోరణి ఈ దుర్ఘటనతో తేటతెల్లమవుతోంది. పల్లెవెలుగు బస్సులు నడిపితే 50 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) కంటే తక్కువ ఉందని బస్సుల్ని రద్దు చేస్తున్నారు. ప్రతి రోజూ సగటున 46.26 లక్షల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రతి లక్ష కిలోమీటర్లకు ప్రమాదాల రేటు 0.09గా ఉంది. పల్లెవెలుగు బస్సులకు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సరిగా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. అధికారులు, సూపర్వైజర్లు క్రమబద్ధంగా బస్సులను తనిఖీ చేయకపోవడం కూడా బ్రేక్ డౌన్లకు కారణమవుతోంది. కానరాని సేఫ్టీ ఆడిట్ బృందాల జాడ అత్యధిక ప్రమాదాల రికార్డు కలిగిన రీజియన్లలో ప్రమాదాలు జరగడానికి కారణాలు, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశాల్ని పరిశీలించేందుకు ఆయా రీజియన్లలో రోడ్ సేఫ్టీ ఆడిట్ టీంలను ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణ కోసం సర్క్యులర్ సూచనలు అమలు చేయడంతో పాటు ఈ బృందం సూచనలు, సలహాలు అందించాల్సి ఉంది. అయితే ఆయా రీజియన్లలో ఈ బృందాల జాడ కనిపించడం లేదు. -
గిరిజన విద్యకు గ్రహణం
సీతంపేట:గిరిజనుల విద్యాభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉన్నా నియామకాల జోలికి వెళ్లడం లేదు. జిల్లాలో 42 ఎస్టీ ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు పదివేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి మూడు పూటల భోజనంతోపాటు మంచి విద్య అందించాలనే ది ప్రభుత్వ లక్ష్యం. అయితే విద్యా బోధనకు తగినంత మంది ఉపాధ్యాయులను నియమించడంలో ప్రభుత్వం విఫలమవుతోందనే ఆరోపణలున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఆరంభమై ఏడునెలలు గడిచాయి. మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. గణితం, పిజికల్ సైన్స్, ఆంగ్లం, హిందీ, జీవశాస్త్రం వంటి సబ్జెక్టుల ను బోధించడానికి ఇప్పటికీ సిబ్బంది లేరు. అరకొరగా నియమించిన సీఆర్టీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలను ఏ,బీ గ్రేడ్లుగా విబజించారు. నిబంధనల ప్రకారం ఏ గ్రేడ్‌లో 640 మంది విద్యార్థులు మించి ఉన్న పాఠశాలలను చేర్చారు. వీటిలో 26 మంది ఉపాధ్యాయులుండాలి. బీ గ్రేడ్‌లో 320 మంది విద్యార్థులున్న పాఠశాలలను చేర్చారు. వీటిలో 13 మంది ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఏ గ్రేడ్ పాఠశాలల్లో 20 లోపు, బీ గ్రేడ్‌లో పది మందిలోపే ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ ఎప్పుడు? టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. దీనికి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాల్సి ఉండగా.. అదీ చేయడంలేదు. ఇటీవల ప్రకటించిన డీఎస్సీలో సైతం ఏజెన్సీ పోస్టులు కలపకపోవడంతో వచ్చే విద్యా సంవత్సారానికి కూడా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నా.. పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 27 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పాటికే 90 శాతం సిలబస్ పూరి ్తకావాల్సి ఉంది. అయితే సబ్జెక్టు టీచర్ల కొరతతో సకాలంలో పూర్తికాని పరిస్థితి నెలకొంది. సిలబస్ పూర్తికాకపోతే తామేం పరీక్షలు రాస్తామని విద్యార్థులు వాపోతున్నారు. కాగా రెండేళ్ల క్రితం ఐటీడీఏ పరిధిలో పది వరకు పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశారు. ఈ పాఠశాలల్లో ఇప్పటివరకు బోధకులు లేరు. దీంతో విద్యార్థులను పట్టించుకున్న నాథడు కరువయ్యాడు. మారుమూలన ఉన్న పూతికవలస, సామరిల్లి వంటి పాఠశాలల్లో అరకొర ఉపాధ్యాయులుతో నెట్టుకొస్తున్నారు. ఆశ్రమాలుగా మార్చారు.. సిబ్బందిని మరిచారు రెండేళ్ల కిందట శ్రీకాకుళం, మందస, సీతంపేటల లో ఉన్న గిరిజన బాలుర వసతిగృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మార్చారు. అయితే వీటికి బోధకులను మాత్రం నియమించలేదు. సీతంపేటకు 13 పోస్టులు మంజూరు చేసినా ఆర్థిక శాఖ అనుమతి లేదు. శ్రీకాకుళం, మందస ఆశ్రమ పాఠశాలలకు అసలు పోస్టులనే మంజూరు చేయలేదు. వసతులు కల్పించకుండానే వసతిగృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మార్చడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసంతృప్తి చెందుతున్నారు. ఈ విషయమై ఇటీవల సీతంపేట వచ్చిన గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర అదనపు డెరైక్టర్ చిన్నవీరభద్రుడు వద్ద ప్రస్తావించగా త్వరలోనే ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ రానుందని తెలిపారు. గిరిజన విద్య పట్ల నిర్లక్ష్యం: డొంకాన ఈశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి గిరిజన విద్య పట్ల ప్రభుత్వం నిర్లక్ష్వం వహిస్తోంది. అప్‌గ్రేడ్ చేసి రెండేళ్లయినా పోస్టులను భర్తీ చేయకపోవడం అన్యాయం. చాలా ఆశ్రమ పాఠశాలల్లో ఇంతవరకు ఉపాధ్యాయులను నియమించకపోవడం దారుణం. గిరిజన విద్యకు భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నామంటున్న ప్రభుత్వం పోస్టుల భర్తీపై ఇంత నిర్లక్ష్యం వహించడం తగదు. -
వెచ్చాల్లేకుండా వండిపెట్టేదెలా?
* మధ్యాహ్న భోజన పథకంపై సర్కారు నిర్లక్ష్యం * రెండు నెలలుగా విడుదల కాని నిధులు * అప్పులతో నెట్టుకొస్తున్న ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు అమలాపురం : బియ్యం, నీళ్లు ఇవ్వకుండా వట్టి కుండ, కట్టెలు ఇచ్చి, అన్నం వండమన్నట్టుంది సర్కారు తీరు. మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు రెండు, మూడు నెలులగా నిధులు విడుదల కాక, మూడు నెలలుగా సిబ్బందికి జీతాలందక పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు అక్టోబరు, నవంబరు నెలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రావాల్సిన సొమ్ములు అందలేదు. కొన్ని పాఠశాలలకైతే సెప్టెంబరులో రావాల్సిన సొమ్ములు కూడా చేతికందలేదు. మధ్యాహ్న భోజనానికి పౌరసరపరాల శాఖ ద్వారా బియ్యం అందుతుండగా, వారికి అన్నంతోపాటు అందించే పప్పు, కాయగూరలు, ఇతర నిత్యావసర వస్తువులకుగాను ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు నిధులు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు రూ.3.78 కోట్ల వరకు అందించాల్సి ఉంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిన నేపథ్యంలో తమకు గిట్టుబాటు కావడం లేదని ఏజెన్సీలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. వారానికి రెండుసార్లు అందించాల్సిన కోడిగుడ్డు ధర కూడా మండిపడడం వారికి మరీ భారమవుతోంది. ఈ పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. చాలా ఏజెన్సీలు అప్పులు చేసి విద్యార్థులకు భోజనం అందించాల్సి వస్తోంది. -
ఐఎస్ఎల్.. నిల్!
* నత్తనడకన నిర్మాణాలు * ఇసుక కొరత, అవగాహన లేమి కారణం * ఏడాదిన్నర కాలంలో కేవలం 29 శాతమే పూర్తి మండపేట : నిధుల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యం, స్థల సమస్య, ఇసుక కొరతలకు తోడు ప్రజల్లో అవగాహనలే మి ఇవన్నీ వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో జిల్లాలో ఐఎస్ఎల్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం 29 శాతం మాత్రమే పూర్తయ్యాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. పదివేలు మంజూరు చేస్తోంది. ఈ మొత్తంలో ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.5,400, ఆర్డబ్ల్యూఎస్ నుంచి రూ.4,600 చెల్లిస్తోంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రభుత్వ సాయాన్ని రూ.12 వేలకు పెంచింది. అక్టోబరు రెండో తేదీ నుంచి మంజూరైన వాటికి మాత్రమే ఇది వర్తిస్తుందని సమాచారం. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు 1,53,835 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు కేవలం 44,532 మాత్రమే పూర్తయ్యాయి. 37,226 నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలినవి ఇంకా నిర్మాణ పనులకు నోచుకోలేదు. స్థల సమస్యతో అధిక శాతం నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఐఎస్ఎల్ పథకానికి లబ్ధిదారుడిగా ఎంపికైనా, నిర్మాణానికి సరైన స్థలం లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇసుక ధర పెరగడంతో... ఇసుక రీచ్‌లు మూతపడి ఇసుక ధర రెట్టింపు కావడంతో ఐఎస్ఎల్ నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. ప్రభుత్వసాయం ఇసుక ధర సరిపోక నిర్మాణంలో ఉన్నవి నిలిచిపోగా, కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. మరోపక్క బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యవంతులుగా చేయడంలో యంత్రాంగం విఫలమవుతుందనే విమర్శలూ ఉన్నాయి. మరోవైపు నిర్మాణ పనులు పూర్తయినా సకాలంలో బిల్లులు అందడం లేదని తెలుస్తోంది. ఫలితంగా నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోతున్నాయని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం కోసం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నాం. అయితే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాణం పూర్తయిన వాటికి సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. - భవానీ, డ్వామా పీడీ -
ప్రాథమిక విద్యలో మార్పులకు శ్రీకారం
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం కరువుకు తట్టుకోని కే-6 రకం ధరణి రకంతో ఎకరాకు పది బస్తాలు ఈ రకాన్నే పంపిణీ చేసుంటే ఇంత నష్టం జరిగేది కాదు పలమనేరు: ప్రభుత్వం ఈ దఫా రైతులకు పంపిణీ చేసిన సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలు నట్టేట ముం చేశాయి. కరువుకు తట్టుకోలేని, నాణ్యత లేని కే-6 విత్తనాలను పంపిణీ చేసింది. వర్షాభావ పరిస్థితులను ఈ రకం తట్టుకోలేక పంట పూర్తిగా దెబ్బతింది. ఇదే సీజన్లో ఆత్మ వారి సౌజన్యంతో ధరణి అనే రకాన్ని కొందరు రైతులకు పంపిణీ చేశారు. కే-6 రకం ఎకరా కు ఓ బస్తా దిగుబడిని ఇవ్వగా, ధరణి రకం పది బస్తా ల దిగుబడినిచ్చింది. ఇదే విత్తనాలను రైతులకు పంపిణీ చేసుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశెనగ రైతులు నష్టాలపాలయ్యారు. పలమనేరు వ్యవసాయశాఖ సబ్ డివిజ న్కు సంబంధించి ఖరీఫ్ సీజన్లో 16 వేల హెక్టార్లలో వేరుశెనగ సాగు చేయగా 11,540 హెక్టార్లలో ప్రభుత్వం అందజేసిన విత్తనాలనే వేశారు. మిగిలిన విస్తీర్ణంలో రైతులు వారి సొంత విత్తనాలనే వేసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోలేదు.. ఈ దఫా జిల్లాకు ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి కదిరి-6 అనే రకం విత్తనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాల నుంచి వీటిని తెప్పించింది. మామూలుగా 100 గ్రాముల విత్తన కాయలను వొలిస్తే గింజలు 70 గ్రాముల బరువు వస్తేనే అవి నాణ్యంగా ఉన్నట్టు లెక్క. సీడ్ జర్మినేషన్ 70 శాతంగా ఉండాలని నిబంధనలున్నాయి. చిత్తూరులోని సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో మొలక శాతం, విత్తనాల నాణ్యతను పరీక్షిం చాల్సి ఉంది. ఈ దఫా ఇది జరగలేదు. ఈ ప్రాంతానికి కే-6 పనికిరాదు.. వర్షాభావానికి తట్టుకోని కే-6 ఈ ప్రాంతానికి సరిపోదు. గతంలోనూ ఈ సమస్య కారణంగానే ఈ రకాన్ని పంపిణీ చేయలేదు. తక్కువ ధరకే ఇవి దొరుకుతుండడంతో ప్రభుత్వం రెండేళ్లుగా వీటిని రైతులకు అంటగడుతోంది. గతేడాది సైతం ఈ రకం విత్తనాలు వేసిన రైతులకు సగం పంట కూడా చేతికందలేదు. ఫలితంగా ఈ దఫా ఎకరాకు బస్తా (40 కేజీలు) కూడా దిగుబడి రాలేదు. ధరణి రకంతో ఎకరాకు పది బస్తాలు.. కుప్పం ఆత్మ విభాగం తరఫున అక్కడి అధికారులు కొందరు రైతులకు ధరణి రకం వేరుశెనగ విత్తనాలను ప్రయోగాత్మకంగా పంపిణీ చేశారు. కుప్పం మండలంలోని పీబీ నత్తంలో శ్రీరాములు పొలంలో ప్రయోగాలను చేపట్టారు. కరువు పరిస్థితుల మధ్య ఎకరాకు పది బస్తాల దిగుబడి వచ్చింది. దీన్ని చూసి వ్యవసాయ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇదే రకాన్ని జిల్లాలోని అందరు రైతులకూ పంపిణీ చేసి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదని అధికారులే అభిప్రాయపడుతున్నారు. -
కొంప ముంచిన సర్కార్ విత్తనాలు!
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం కరువుకు తట్టుకోని కే-6 రకం ధరణి రకంతో ఎకరాకు పది బస్తాలు ఈ రకాన్నే పంపిణీ చేసుంటే ఇంత నష్టం జరిగేది కాదు పలమనేరు: ప్రభుత్వం ఈ దఫా రైతులకు పంపిణీ చేసిన సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలు నట్టేట ముం చేశాయి. కరువుకు తట్టుకోలేని, నాణ్యత లేని కే-6 విత్తనాలను పంపిణీ చేసింది. వర్షాభావ పరిస్థితులను ఈ రకం తట్టుకోలేక పంట పూర్తిగా దెబ్బతింది. ఇదే సీజన్లో ఆత్మ వారి సౌజన్యంతో ధరణి అనే రకాన్ని కొందరు రైతులకు పంపిణీ చేశారు. కే-6 రకం ఎకరా కు ఓ బస్తా దిగుబడిని ఇవ్వగా, ధరణి రకం పది బస్తా ల దిగుబడినిచ్చింది. ఇదే విత్తనాలను రైతులకు పంపిణీ చేసుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశెనగ రైతులు నష్టాలపాలయ్యారు. పలమనేరు వ్యవసాయశాఖ సబ్ డివిజ న్కు సంబంధించి ఖరీఫ్ సీజన్లో 16 వేల హెక్టార్లలో వేరుశెనగ సాగు చేయగా 11,540 హెక్టార్లలో ప్రభుత్వం అందజేసిన విత్తనాలనే వేశారు. మిగిలిన విస్తీర్ణంలో రైతులు వారి సొంత విత్తనాలనే వేసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోలేదు.. ఈ దఫా జిల్లాకు ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి కదిరి-6 అనే రకం విత్తనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాల నుంచి వీటిని తెప్పించింది. మామూలుగా 100 గ్రాముల విత్తన కాయలను వొలిస్తే గింజలు 70 గ్రాముల బరువు వస్తేనే అవి నాణ్యంగా ఉన్నట్టు లెక్క. సీడ్ జర్మినేషన్ 70 శాతంగా ఉండాలని నిబంధనలున్నాయి. చిత్తూరులోని సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో మొలక శాతం, విత్తనాల నాణ్యతను పరీక్షిం చాల్సి ఉంది. ఈ దఫా ఇది జరగలేదు. ఈ ప్రాంతానికి కే-6 పనికిరాదు.. వర్షాభావానికి తట్టుకోని కే-6 ఈ ప్రాంతానికి సరిపోదు. గతంలోనూ ఈ సమస్య కారణంగానే ఈ రకాన్ని పంపిణీ చేయలేదు. తక్కువ ధరకే ఇవి దొరుకుతుండడంతో ప్రభుత్వం రెండేళ్లుగా వీటిని రైతులకు అంటగడుతోంది. గతేడాది సైతం ఈ రకం విత్తనాలు వేసిన రైతులకు సగం పంట కూడా చేతికందలేదు. ఫలితంగా ఈ దఫా ఎకరాకు బస్తా (40 కేజీలు) కూడా దిగుబడి రాలేదు. ధరణి రకంతో ఎకరాకు పది బస్తాలు.. కుప్పం ఆత్మ విభాగం తరఫున అక్కడి అధికారులు కొందరు రైతులకు ధరణి రకం వేరుశెనగ విత్తనాలను ప్రయోగాత్మకంగా పంపిణీ చేశారు. కుప్పం మండలంలోని పీబీ నత్తంలో శ్రీరాములు పొలంలో ప్రయోగాలను చేపట్టారు. కరువు పరిస్థితుల మధ్య ఎకరాకు పది బస్తాల దిగుబడి వచ్చింది. దీన్ని చూసి వ్యవసాయ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇదే రకాన్ని జిల్లాలోని అందరు రైతులకూ పంపిణీ చేసి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదని అధికారులే అభిప్రాయపడుతున్నారు. -
పసికందుల ఆక్రందన
ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలు రుయా చిన్న పిల్లల ఆస్పత్రిలో మూడేళ్లలో 149 మంది మృతి ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపమే కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యాధికారుల నిర్వహణా లోపం పసికందుల పాలిట శాపంగా మారింది. నిత్యం చిన్నారుల కేర్‌కేర్‌మనే శబ్దాలు వినపడాల్సిన రుయా చిన్నపిల్లల ఆస్పత్రి వారి ఆక్రందనలు, తల్లిదండ్రుల రోదనలతో మార్మోగుతోంది. తిరుపతి అర్బన్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు కావస్తున్నా జిల్లాలో వైద్యశాఖ పరంగా ఎలాంటి అభివృద్ధీ జరగలేదనడానికి ఈ ఆస్పత్రిలో సంభవిస్తున్న శిశు మరణాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గడచిన మూడేళ్లలో ఇక్కడ 149 మంది శిశువులు మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2012 ఆగస్టు 15 నుంచి రెండు నెలలపాటు ఇక్కడ సంభవించిన శిశు మరణాలపై మీడియాలో వచ్చిన వరుస కథనాలకు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. ఆస్పత్రి సందర్శనకు వచ్చిన సందర్భంలో ఇక్కడ అన్ని వైద్య సదుపాయాలు, వైద్యుల నియామకం చేపట్టాల్సిన అవసరముందని నొక్కి వక్కాణించారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు పూర్తయినా ఇంతవరకు ఎలాంటి సౌకర్యాలూ ఏర్పాటు చేయలేదని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఆస్పత్రికి చిన్నారులతో వచ్చే అమ్మలకు కష్టాలు తప్పడం లేదు. ప్రధాన వైద్య యంత్రాలు లేవు ఎస్వీ మెడికల్ కాలేజీ పరిధిలో నిర్వహిస్తున్న చిన్న పిల్లల ఆస్పత్రికి ప్రతిరోజూ 200 మంది శిశువులను ఓపీకి తీసుకొస్తుంటారు. వారిలో 150 మందికి పైగా నెలలు నిండని వారు, తక్కువ బరువున్న వారు, వివిధ ఇన్ఫెక్షన్లు, జన్యులోపాలుండే వారే ఎక్కువగా ఉంటారు. వారందరికీ అవసరమైన ఇంక్యుబేటర్లు, వెంటిలేటర్లు చాలినన్ని లేకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శిశువులకు అత్యవసర స్కానింగ్ చేయించాలంటే పరుగులు తీయాల్సిన పరిస్థితి. కనీసం ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కూడా లేకపోవడంతో బయటకు రెఫర్ చేస్తున్నారు. ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సులకూ కొరతే చిన్న పిల్లల విభాగంలో వైద్యమంటేనే ఎంతో అనుభవం గడించిన ప్రొఫెసర్లు అవసరం. ఈ ఆస్పత్రిలో ఒక పిడియాట్రిక్ సర్జన్, రెండు ప్రొఫెసర్ ఉద్యోగాలు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. పీఐసీయూ, ఎన్ఐసీయూ, పిడియాట్రిక్ న్యూరో, నెఫ్రాలజీ విభాగాలతోపాటు జనరల్ వార్డులు, ఐసీయూలు ఉన్నా యి. షిఫ్టుకు 20 మంది స్టాఫ్ నర్సులు ఉండాల్సి ఉండగా కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు. ఆ దిశగా రుయా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదు. ఆక్సిజన్ ప్లాంట్‌కు నిర్వహణ లేమి చిన్న పిల్లల ఆస్పత్రికి వెనుకవైపున కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఆర్హెచ్ఎం నిధులతో ఏడాది క్రితం సుమారు 6వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా ఎక్కువ శాతం ఆక్సిజన్ చిన్న పిల్లల ఆస్పత్రికే ఖర్చవుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. వారానికి 1000 లీటర్ల ఆక్సిజన్ కావాల్సి వస్తోంది. నిర్వహణా లేమి కారణంగా కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ సరఫరా చేసే ఏజెన్సీకి సకాలంలో బకాయిలు చెల్లించక వారు ఆలస్యం చేస్తున్నారు. అలాంటి సమయాల్లో శిశువులకు ఆక్సిజన్ అందక మరణాలు సంభవిస్తున్నాయి. సిబ్బంది లేకపోవడంతో బయటి ఆస్పత్రికి వెళ్లాం మా బాబుకు వీపుపై గడ్డ లేచింది. రుయా చిన్న పిల్లల ఆస్పత్రికి వచ్చాం. వైద్యుల సిఫారసు మేరకు పరీక్షలు చేయించడానికి ల్యాబ్ వద్దకు వెళ్లాం. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి ఉన్నా ఎవరూ రాలేదు. సెక్యూరిటీ సిబ్బంది సాయంతో బయట ల్యాబ్‌లకు వెళ్లాం. ల్యాబ్ సిబ్బంది ఆలస్యం వల్ల మేము ఇబ్బంది పడాల్సి వచ్చింది. బిడ్డకు సకాలంలో వైద్య సేవలు అందలేదు. -పెంచలయ్య, రాధా దంపతులు, వైఎస్సార్ జిల్లా అట్లూరు స్కానింగ్ ఎక్కడ చేస్తారో తెలియక ఇబ్బంది పడ్డాం నాలుగు నెలల కొడుకును తీసుకుని సాధారణ పరీక్షల కోసం చిన్న పిల్లల ఆస్పత్రికి వచ్చాను. ప్రసవం కూడా ఇక్కడే జరగడంతో వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయిస్తున్నా. మంగళవారం పరీక్షల కోసం రావడంతో గుండెకు సంబంధించిన స్కానింగ్ కోసం వైద్యులు సిఫారసు చేశారు. కార్డియాలజీ విభాగం ఎక్కడుందో తెలియలేదు. ఎవరిని అడిగినా సమాధానం చెప్పలేదు. దానికోసం గంటల తరబడి తిరగాల్సి వచ్చింది. -లక్ష్మి(పేరు మార్చాం), పాకాల మండలం -
నిర్లక్ష్యం
కాకినాడ క్రైం :ప్రజారోగ్య కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో వేళ్లూనుకున్న నిర్లక్ష్యం కారణంగా వెనక్కి మళ్లిపోతున్నాయి. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎం.రవిచంద్ర రూ.50 లక్షలు విడుదల చేసి వాటితో మందులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. కేవలం రూ.7లక్షలతో మందులు కొనుగోలు చేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మిగిలిన డబ్బు మురగబెట్టారు. దీంతో మిగిలిపోయిన రూ.43 లక్షలు వెనక్కి ఇచ్చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా అధికారులు ఆమేరకు చర్యలు చేపట్టారు. అయితే వ్యాధుల నియంత్రణకు మంజూరైన నిధుల వినియోగంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచారమే ఫలితమిస్తుందా? సీజనల్ వ్యాధుల విషయంలో కేవలం ప్రచారాలు సాగిస్తే సరిపోతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయనేది వాస్తవం. ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు మండలానికి రూ. తొమ్మిది వేలు చొప్పున కలెక్టర్ నీతూ ప్రసాద్ విడుదల చేశారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో విద్యార్థులతో ర్యాలీలు, కరపత్రాల పంపిణీ, ఫ్లెక్సీల ఏర్పాటు వంటివి చేయాలని ఎంపీడీఓలకు ఆదేశాలిచ్చారు. పారిశుధ్యంపై దృష్టి పెట్టకుండా ఇలా ప్రచారాలు సాగిస్తే మాత్రం ఫలితం ఏమిటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పారిశుధ్యంపై అంతులేని అలసత్వం జిల్లావ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలపై అలసత్వం నెలకొంది. సుమారు 90 శాతం గ్రామాలలో డంపింగ్ యార్డులు లేవు. దీంతో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడ చూసినా దోమలు ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వర్షాకాలంలో విజృంభించే డెంగీ, మలేరియా, కలరా, అతిసార, పచ్చకామెర్లు, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధుల విషయంలో వైద్య, ఆరోగ్యశాఖలో ఏ మాత్రం అప్రమత్తత కనిపించడం లేదు. ఆహారం, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థలపై దృష్టి సారించి ప్రజారోగ్యం కాపాడడంలో పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల క్షేత్రస్థాయి సిబ్బంది విఫలమవుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గత ఏడాది జిల్లాలో 35 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే ఐదు డెంగీ కేసులు నమోదైనా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా కనిపించని ఫలితం దోమ లార్వాను నాశనం చేసేందుకు జిల్లాలోని 1006 పంచాయతీలకు 10,750 లీటర్లు, రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలకు 2000 లీటర్ల చొప్పున మస్కిటో లార్వాసిడ్ ఆయిల్‌ను సరఫరా చేసినట్టు శాఖాధికారులు చెబుతున్నారు. అయితే ఈ మందును పిచికారీ చేసిన దాఖలాలు మాత్రం లేవని ప్రజలు చెబుతున్నారు. జూన్ 25 నుంచి ఈ నెల 5వ తేదీ వరకూ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టినప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పారిశుధ్య నిర్వహణకు జిల్లాకు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటికి రూ.14 కోట్లు ఖర్చు చేశారు కూడా. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 109 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 23 క్లస్టర్లు, 20 అర్బన్ హెల్త్ సెంటర్లు, 805 సబ్ సెంటర్లలో వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 4500 మంది ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. అయినప్పటికీ పరిసరాల పరిశుభ్రత ఎక్కడా కానరావడం లేదు. అంటువ్యాధులపై ప్రజలకు అవగాహన కూడా కల్పించడంలో కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
సేవా ముసుగులో అక్రమం
రూ.25 కోట్ల స్థలంపై కన్ను - శ్రీ సత్యసాయి ట్రస్టుకు దక్కాల్సిన స్థలం - సొంత ట్రస్టుకు మార్చుకున్న అక్రమార్కుడు - గతంలోనే ప్రభుత్వం నుంచి షోకాజు నోటీసులు - స్వాధీనం చేసుకోవడంలో సర్కారు నిర్లక్ష్యం ఆదిలాబాద్ : సేవా ముసుగులో ఓ ప్రైవేట్ వైద్యుడు రూ.25 కోట్ల స్థలాన్ని కబ్జా చేసేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలెట్టాడు. శ్రీ సత్యసాయి ట్రస్టుకు దక్కాల్సిన స్థలాన్ని అప్పట్లో దొడ్డిదారిన అధికారులను తప్పుతోవ పట్టించి తన సొంత ట్రస్టుకు మళ్లించాడు. భూమి కేటాయింపులో ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించి అడ్డదారులు తొక్కాడు. దీనిపై శ్రీ సత్యసాయి ట్రస్టు సభ్యులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అధికారులు చర్యలు చేపడుతామని చెప్పి మిన్నకుండి పోయారు. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న వైద్యుడు మళ్లీ ఆ స్థలాన్ని స్వాహా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. తాజాగా ఆ స్థలంలోని భవనంలో ఓ ప్రైవేట్ స్కూల్ నడిపేందుకు ఇతరులకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. దీన్ని బట్టి ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మళ్లీ మొదలు పెట్టాడని తెలుస్తోంది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సేవా ముసుగులో.. పుట్టపర్తి సత్యసాయి సంస్థకు అనుబంధంగా జిల్లాలో శ్రీశ్రీశ్రీ భగవన్ సత్యసాయి సేవా సమితి విద్యాసంస్థను నెలకొల్పాలని నిర్ణయించింది. దీని కోసం సేవా సమితికి 40 నుంచి 50 ఎకరాల భూమి కేటాయించాలని ఆ సంస్థ తరపున డాక్టర్ బి.ప్రకాశ్ 1996 డిసెంబర్ 25న అప్పటి కలెక్టర్‌కు దరఖాస్తు చేశాడు. అప్పట్లో ఈ సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రాచుర్యం పొందడంతో జిల్లాలోనూ భూమి కేటాయించాలని అప్పటి కలెక్టర్ శాంతికుమారి నిర్ణయించారు. ఆ సమయంలో సత్యసాయి సేవా సమితి పేరిట కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించిన వైద్యుడే స్వార్థానికి పాల్పడ్డాడు. అదే పేరు స్పూరించే రీతిలో శ్రీ సత్యసాయి విద్యానికేతన్ పేరుతో అందులో సభ్యునిగా తాను, తన తల్లి, భార్య, తమ్ముళ్లను నియమించుకుని 1997 ఫిబ్రవరి 4న సత్యసాయి విద్యానికేతన్ అనే ట్రస్టును రిజిస్ట్రర్ చేయించాడు. ఆ ట్రస్టుకే ప్రభుత్వం 1999 ఆగస్టు 22న నంబర్ వి3/625/97 ద్వారా భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఆదిలాబాద్ మండలం బట్టిసావర్గాలోని సర్వే నంబర్ 72 న్యూహౌసింగ్‌బోర్డు కాలనీలో 13.31 ఎకరాల భూమిని ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.1,37,750 మార్కెట్ విలువతో ఈ విద్యా సంస్థకు కేటాయించారు. ఈ విద్యాసంస్థలో చదువుకునే 50 శాతం మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు వసూలు చేస్తున్న రుసుంను వసూలు చేయాలని, ఇతర అవసరాలకు వినియోగిస్తే స్వాధీనం చేసుకుంటామన్న షరతులతో అప్పటి కలెక్టర్ శాంతికుమారి ఈ స్థలం ఇవ్వడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘన కలెక్టర్ విధించిన షరతులు ఈ విద్యాసంస్థ నిబంధనలు ఉల్లంఘించినట్లు గత పరిశీలనలో తేటతెల్లమైంది. సగం మంది విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుం వసూలు చేయాల్సి ఉండగా ఈ నిబంధనను పాటించలేదని అప్పట్లో విద్యాశాఖ అధికారుల పరిశీలనలో స్పష్టమైంది. భూమిని కేటాయించిననాలుగేళ్లకు విద్యాసంస్థను ఏర్పాటు చేసినా.. స్వాధీనం చేసుకునే విషయంలో అధికారులు శ్రద్ధ చూపలేదు. వరంగల్ ఆర్జేడీ ద్వారా అనుమతి పొందిన శ్రీ సత్యసాయి విద్యానికేతన్ 2007-08 విద్యా సంవత్సరం వరకు అదే స్థలంలో కొనసాగింది. అనంతరం పునరుద్ధరణ గడువు ముగియడంతో ఆ స్థలంలో విద్యాసంస్థ కార్యకలాపాలు సాగలేదు. ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలంలో సత్యసాయి విద్యానికేతన్ కొనసాగడం లేదని, ప్రస్తుతం ఇందులో మరో పాఠశాలను నిర్వహిస్తున్నారని అప్పటి తహశీల్దార్ 2010 జూన్ 23న ఆర్డీవోకు నివేదిక సమర్పించారు. ఆ నివేదికను ఆర్డీవో అప్పటి కలెక్టర్ ద్వారా భూసేకరణ ముఖ్యకార్యదర్శి (సీసీఎల్ఏ)కు పంపారు. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు చేపట్టదంటూ పైస్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో ఆ తర్వాత అధికారులు మిన్నకున్నారు. ఆ తర్వాత మరోసారి ఈ భూమిపై వివాదం చెలరేగడంతో 2011 డిసెంబర్లో సత్యసాయి విద్యానికేతన్ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. అప్పట్లో కలెక్టర్‌గా ఉన్న డాక్టర్ అశోక్ ఈ సత్యసాయి విద్యానికేతన్ భూమి కేటాయింపు రద్దు చేయాలని సీసీఎల్ఏకు రాయడం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ముందడుగు పడలేదు. అప్పటి నుంచి ఆ స్థలంలో ఎలాంటి నిర్వహణ చేపట్టలేదు. ఈ విషయంలో స్తబ్దత నెలకొంది. తాజాగా ఓ ప్రైవేటు స్కూల్ నిర్వహణకు అనుమతినివ్వడంతో మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. దీనిపై సత్యసాయి ట్రస్టు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సదరు ప్రైవేట్ వైద్యుడు, పట్టణంలోని కొంత మంది భూకబ్జాదారులు కలిసి ఈ భూమిని స్వాహా చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో కొంత మంది ప్రైవేట్ పాఠశాలల యజమానులు కూడా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైన ఈ వ్యవహారంలో ప్రభుత్వం చొరవ తీసుకొని స్థలం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై జేసీ లక్ష్మీకాంతం, ఆర్డీవో సుధాకర్‌రెడ్డిలను ‘సాక్షి’ వివరణ కోరగా ఇది తమ దృష్టికి రాలేదని తెలిపారు. వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా డీఈవో సత్యనారాయణరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా ఇందులో నిర్వహిస్తున్న స్కూల్‌కు అనుమతి లేదని, ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నడుపుతున్నారని పేర్కొన్నారు. దీనిపై పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని వివరించారు. -
నిమ్స్ గతి ఇంతే!
బీబీనగర్ నిమ్స్‌ను అందరూ కలిసి ముంచేశారు. నిధులిచ్చినా సరిగా పనులు చేయలేదని అధికారులు... బకాయిలు ఇవ్వనిదే మిగిలిన పనులు మొదలు పెట్టేది లేదని కాంట్రాక్టరు... వెరసి రోగులకు అందాల్సిన సేవలు మృగ్యం. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం రెండూ కలిసి ఈ ఆస్పత్రిని లోతుల్లోకి నెట్టేశాయి. విస్మయపరిచే అంశాలేమిటంటే పనుల్లో ఎవరు ఎంత తిన్నారు? ఏ అధికారి ఎంత సామగ్రి అమ్ముకున్నారు? అన్నదానిపైనే ఏళ్ల తరబడి విచారణ కొనసాగడం. వ్యవహారం కోర్టు గుమ్మం తొక్కడంతో సేవలు మరింత దూరమయ్యాయి. అధికారుల సస్పెన్షన్ల వరకూ వెళ్లిన ఈ బీబీనగర్ నిమ్స్ కథా కమామిషు నిత్య వివాదాల మయం. - సాక్షి, సిటీబ్యూరో 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.93 కోట్ల వ్యయంతో బీబీనగర్‌లో నిర్మించతలపెట్టిన నాలుగు అంతస్తుల రంగాపూర్ నిమ్స్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసింది. చిన్నపాటి వర్షానికే స్లాబుల నుంచి నీరు కారుతుండడంతో పాటు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. తలుపులు, కిటికీలు, అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్ అప్పుడే పాడవ్వడంతో నిర్మాణ పనులు, నిధుల మంజూరీలో అనేక అక్రమాలు జరిగినట్లు, విలువైన టైల్స్, ఫర్నిచర్ కూడా మాయం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిర్మాణ పనులు చాలా వరకు లోపభూయిష్ఠంగా ఉన్నట్లు నిర్ధారించిన విజిలెన్స్ కమిషన్ ఆ మేరకు నివేదిక కూడా అందజేసింది. కాంట్రాక్టర్ కొత్త పేచీ.. ఇదే సమయంలో బకాయి చెల్లిస్తే కానీ, మిగిలిన పనులు పూర్తి చేయబోమని కాంట్రాక్టర్ పేచీపెట్టారు. పనులను మధ్యలోనే నిలిపేశారు. నిమ్స్ డెరైక్టర్‌గా డాక్టర్ నరేంద్రనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీబీనగర్ నిమ్స్ నిర్మాణ పనులను సమీక్షించారు. తొలి దశలో భాగంగా 200 పడకలతో ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని భావించి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, వైద్య పరికరాల కోసం ప్రభుత్వం ఇటీవల మరో రూ.60 కోట్లు మంజూరు చేసింది. చేసిన పనికంటే ఎక్కువ చెల్లింపు... మధ్యలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని సదరు కాంట్రాక్టర్‌ను డెరైక్టర్ నరేంద్రనాథ్ కోరగా, పెండింగ్ బకాయితో పాటు ముందస్తుగా మరో రూ.6 కోట్లు చెల్లిస్తేనే మిగిలిన పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేయడంతో ఇదే అంశంపై ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తై పనులు, చేసిన చెల్లింపులపై అధ్యయనం చేయించాలని భావించింది. ఆ మేరకు పంచాయతీరాజ్ రిటైర్డ్ ఇంజినీర్ ఇన్‌చీఫ్ కొండలరావు నేతృత్వంలోని ముగ్గురు రిైటె ర్డ్ ఇంజినీర్లతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు మాసాలు శ్రమించి నిర్మాణానికి సంబంధించిన పనులను కాంట్రాక్టర్ సమక్షంలోనే పరిశీలించింది. చేసిన పనికంటే కాంట్రాక్టర్‌కు అధికంగా చెల్లించినట్లు స్పష్టంచేసింది. ఈ విషయంపై సదరు కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడం కొసమెరుపు. ఆస్పత్రి అందుబాటులోకి వస్తే... స్థానికుల తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తొలివిడతగా 200 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని భావిం చారు. ఆస్పత్రిలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనర ల్ మెడిసిన్, జనరల్ సర్జరీలాంటి వివిధ విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ సేవలతో పాటు అన్ని రకాల వైద్యపరీక్షలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. 6 నెలలు పడుతుంది... నిర్మాణ పనుల్లో చాలా లోపాలు ఉన్నట్లు ఇప్పటికే నిపుణుల కమిటీ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా అందజేసింది. గతంలో పని చేసిన కొంత మంది అధికారులు చేసిన పనికంటే అదనంగా కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరితే చేయని పనులకు ముందే డబ్బు చెల్లించాల్సిందిగా సదరు కాంట్రాక్టర్ పేచీ పెడుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే కాంట్రాక్టర్‌తో చర్చించాం. ఎంత చెప్పినా వినకుండా వారు కోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్టర్‌తో మళ్లీ చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం పనులు ప్రారంభిస్తే కానీ మరో ఆరు మాసాల తర్వాత సేవలు అందుబాటులోకి రాని దుస్థితి. - డాక్టర్ నరేంద్రనాథ్, డెరైక్టర్ నిమ్స్ -
సర్పంచులకు అందని గౌరవం
బాన్సువాడ, న్యూస్‌లైన్ : గ్రామానికి ప్రథమ పౌరుడుగా వ్యవహరించే సర్పంచుకు వేతనం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. గత ఏడాది ఆగస్టు రెండున పదవీ బాధ్యతలు స్వీకరించిన వీరికి ఇప్పటి వర కు వేతనాల నిధులు విడుదల కాలేదు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు సర్పంచులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేజర్ పంచాయతీల సర్పంచుకు రూ. 1500, మైనర్ పంచాయతీ సర్పంచుకు రూ. 1000 చొప్పన నె లవారీ గౌరవ వేతనాలు అందాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సగం నిధులు పం చాయతీరాజ్ కమిషనర్ నుంచి విడుదల కావాలి. మిగతా సగం పంచాయ తీ భరిస్తుంది. జిల్లాలో మొత్తం సర్పంచులకు సుమా రు రూ. కోటి వరకు గౌరవ వేతనం అందాల్సి ఉంది. వేతనాల విషయమై ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులను సర్పంచులు ప్రశ్నిస్తున్నప్పటికీ, నిధులు మంజూరు కానిది తామేమీ చేయ లే మంటూ వారు చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు నెల లో ఒకరోజు శిక్షణ తరగతులకు హాజరు కావాల్సి ఉం డడంపై సర్పంచులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.