
బాన్సువాడను జిల్లా చేయాలి
బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న బాన్సువాడకు ఎల్లారెడ్డి, జుక్కల్, మెదక్ జిల్లాలోని నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాలు ఎంతో దగ్గరగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలను కలిపి జిల్లా కేంద్రంగా మార్చాలంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నాయకులు కోరుతున్నాయి. రాష్ట్రంలోనే జుక్కల్, ఎల్లారెడ్డి, నారాయణ్‌ఖేడ్ లు వెనుక బడిన నియోజ కవర్గాలు. బాన్సువాడ జిల్లా అయితే ఈ నియోజక వర్గాలు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు.
ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కేంద్రం ఏర్పాటు విషయమై పరిశీలిస్తే తాము మద్దతు ఇస్తామంటున్నారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రానికి 28 కిలో మీటర్ల దూరంలో ఎల్లారెడ్డి, 25 కిలో మీటర్ల దూరంలో బిచ్కుంద (జుక్కల్ నియోజకవర్గానికి ముఖ్య పట్టణం), 55 కిలో మీటర్ల దూరంలో నారాయణఖేడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. జుక్కల్ నియోజకవ ర్గంలో ఐదు మండలాలు, ఎల్లారెడ్డిలో 6 మండలా లు ఉన్నందున ఈ రెండు సెగ్మెంట్లలోని రెండేసి మండలాలను కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు. దీం తో ఐదు నియోజకవర్గాలను కలిపి బాన్సువాడను జిల్లా కేంద్రంగా మార్చడం బౌగోళికంగాను కలిసివస్తుంది.
మెరుగైన రవాణా సౌకర్యాలు
బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డి-మెదక్-మీదుగా హైదరాబాద్‌కు ఇప్పటికే రాష్ట్ర రహదారి అయిన (హెచ్‌ఎంబీ) రోడ్డు ఉంది. దీన్ని జాతీయ రహదారిగా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి తోడు బోధన్ నుంచి బీదర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు సర్వేను పూర్తి చేశారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, బిచ్కుంద, దెగ్లూర్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాలకు బాన్సువాడ నుంచే వెళ్లాల్సి వస్తుంది. బాన్సువాడలో ఏరియా ఆసుపత్రి ఉన్నందున మూడు నియోజకవర్గాల ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ శాఖ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ డివిజనల్ కార్యాల యాలు ఉన్నా యి. ఇక్కడ ఉన్న బస్సు డిపో ద్వారా ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు బస్సులను నడుపుతున్నారు. ఇలా బాన్సువాడ ప్రాంతం అన్ని నియోజకవర్గాలకు అందుబాటులో ఉంది.బాన్సువాడలో సుమారు 50వేల జనాభా ఉంది. పట్టణాని కి ఆనుకొని ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, టీడీపీ,బీజేపీలు బాన్సువాడను జిల్లా కేం ద్రం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసి ఆం దోళనలకు సిద్ధమవుతోంది. వీరికి అండగా న్యాయవాదులు నిలిచారు. వారు విధులను బహిష్కరించి డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రం చేయాల్సిందే
బీర్కూర్ : బాన్సువాడను కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేయాల్సిందేనని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దివిటి శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. బీర్కూర్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు పంట రుణాలను మాఫీ చేయకపోతే టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పోగునారాయణ, రాచప్ప, రాములు యాదవ్, నర్ర సాయిలు తదితరులు పాల్గొన్నారు.