నిజామాబాద్ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్‌రెడ్డిపై పోలీసుల దాడిని నిరసిస్తూ అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం బాన్స్‌వాడలో బంద్ కొనసాగుతోంది. బాన్స్‌వాడ గ్రామ పంచాయతీ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం రాత్రి రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేశాడు. అంతేకాకుంగా ఆయనను కొట్టడంతో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అక్రమ నిర్మాణానికి సంబంధించిన వివరాలు కావాలంటూ బాన్స్ వాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో రవీందర్‌రెడ్డి గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై పంచాయతీ అధికారికి, రవీందర్‌రెడ్డి మధ్య శుక్రవారం వాదన జరిగింది. దీంతో గ్రామ పంచాయతీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల దురుసు వైఖరిని ఖండిస్తూ అఖిలపక్షం నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు.
(బాన్స్‌వాడ)