
బాన్సువాడ జిల్లా కోసం నిరాహార దీక్షలు
బాన్సువాడ: తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల రగడ కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ అఖిల పక్ష నాయకులు ఆదివారం రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జిల్లా ఏర్పాటుచేయాలంటూ నినాదాలు చేశారు. అలాగే వర్ని మండలంలోని మోస్రా గ్రామాన్ని మండలంగా చేయాలంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.