బాన్సువాడ : ఆర్టీసీ బస్సు డివైడర్ ను ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి డిపో బస్సు బాన్సువాడ నుంచి కామారెడ్డి వైపు వెళుతున్న క్రమంలో టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.