బాన్సువాడ, న్యూస్‌లైన్ : ఇసుక మాఫియాతో మంజీరా నది ప్రమాదకరంగా మారుతోంది. కాంట్రాక్టర్లు పొందిన అనుమతి కంటే అధికంగా ఇసుకను తోడేస్తున్నారు. నిబంధనల కు విరుద్ధంగా 30 అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వుతున్నారు. దీంతో నదిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
ప్రభుత్వం పట్టాభూముల్లో ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చింది. బీర్కూర్ మండలంలోని బీర్కూ ర్, బరంగేడ్గి, బిచ్కుంద మండలంలోని పుల్కల్, వాజీద్‌నగర్, గుండెనెమ్లిల్లో పట్టాభూములనుంచి ఇసుక తరలించడానికి అనుమతి పొందిన కాంట్రాక్టర్లు.. దీనిని ఆసరా చేసుకుంటూ నది లోకి కూడా చొచ్చుకెళుతున్నారు. కూలీల ద్వా రానే ఇసుకను తవ్వాల్సి ఉంది. కాంట్రాక్టర్లు మాత్రం పొక్లెయిన్‌లతో 25నుంచి 30 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వుతున్నారు. దీంతో నది లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయని, వర్షపు నీటితో ఈ గుంతలు నిండిపోయి ప్రమాదకరంగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. బిచ్కుంద మండలంలోని బండరెం జల్, గుండెనెమ్లి, వాజీద్‌నగర్, పుల్కల్, హస్గు ల్, ఖద్‌గాం, శెట్లూర్, బిచ్కుంద, పిట్లం మండలంలోని మద్దెల్ చెరువు, బాన్సువాడ మండ లం లోని చింతల్‌నాగారం, బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, దామరంచ, బీర్కూర్, బరంగే డ్గి, కోటగిరి మండలంలోని హంగర్గ, పొతంగ ల్ గ్రామాల్లోన్ని మంజీర తీర ప్రాంతవాసులు ఈ గుంతల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.
మంజీర నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక త వ్వకాలు జరుపుతుండడంతో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈసారి వర్షాలు స మృద్ధిగా కురిసినా బాన్సువాడ ప్రాంతంలో 200 మీటర్ల లోతులో కూడా నీరు లభించడం లేదు. తొమ్మిది గ్రామాలకు తాగునీటిని సరఫ రా చేయడానికి పుల్కల్ గ్రామ సమీపంలోని న దీ తీరంలో బావిని తవ్వారు. బాన్సువాడ పట్టణానికి సైతం మంజీరా నది నుంచే నీరు సరఫరా అవుతోంది. ఇసుక తవ్వకాలు ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు పడిపోయి తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
రెండేళ్ల క్రితం ఇద్దరి మృత్యువాత
రెండేళ్ల క్రితం మంజీర నదిలోని గుంతల్లో చి క్కుకుని ఇద్దరు యువకులు మృత్యువాత ప డ్డారు. వాజిద్‌నగర్ గ్రామానికి చెందిన లింగురాం, అశోక్ హోలీ జరుపుకున్న అనంతరం స్నా నానికి నదిలోకి వెళ్లి ఈ గుంతల్లో చిక్కుకొని మ రణించారు. పలువురు ప్రమాదాల నుంచి తృ టిలో తప్పించుకున్నారు. సుమారు రూ. 30 వేల విలువ చేసే ఎద్దు గుంతలో పడి మృతి చెందిం ది. నిబంధనలకు విరద్ధంగా ఇసుక తవ్వుతున్నందునే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నదీతీర ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్ర మ తవ్వకాలకు చెక్ పెట్టాలని, మంజీరను రక్షిం చాలని కోరుతున్నారు.
‘మంజీర’ గర్భంలో గుంతలు
Published Tue, Oct 8 2013 5:02 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement