manjeera river
-
మంజీర నదిపై భారీ వంతెన నిర్మాణం.. కానీ..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్యన దూరభారాన్ని తగ్గించేందుకు రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టిన మంజీర నదిపై భారీ వంతెన, కామారెడ్డి జిల్లాలో రెండు వరుసల రహదారి నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. కానీ మెదక్ జిల్లా పరిధిలో (వంతెన అవతల) రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఈ రోడ్డు అందుబాటులోకి కానీ 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. ఇరు జిల్లాల మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. 2015లో వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు, కామారెడ్డి జిల్లాలోని తాండూర్ గేట్ నుంచి తాండూరు, వెంకంపల్లి మీదుగా వంతెన వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.21 కోట్లు మంజూరు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు కోర్టుకు వెళ్లడంతో కొంత కాలం పనులు జరగలేదు. పరిహారం ఇచ్చిన తరువాత పనులు చేపట్టారు. అటవీ వివాదంతో కొద్దిమేర పనులు ఆగిపోయినా మిగతా పనులు దాదాపు పూర్తయ్యాయి. మంజీర మీద భారీ వంతెన అందుబాటులోకి వచ్చింది. కానీ వంతెన అవతల రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి కామారెడ్డి జిల్లా నుంచి ప్రతి నిత్యం ఎంతో మంది వెళుతుంటారు. రోడ్డు అందుబాటులోకి వస్తే రాకపోకలు సులువవుతాయి. తగ్గే దూరం 40 కిలోమీటర్లు.. కామారెడ్డి జిల్లా వాసులు ముఖ్యంగా ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట తదితర మండలాల ప్రజలు మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలానికి వెళ్లాలంటే మెదక్ మీదుగా దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. అయితే తాండూర్ గేట్ నుంచి తాండూర్, వెంకంపల్లి మీదుగా మంజీరపై నిర్మించిన వంతెన ద్వారా మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మగ్దుంపూర్ మీదుగా పాపన్నపేటకు వెళ్లడానికి కేవలం 10 కిలోమీటర్లే ఉంటుంది. అంటే దాదాపు 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. మంజీర మీద వంతెన లేక ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులుపడ్డారు. ఇప్పుడు వంతెన పూర్తయ్యింది. కానీ మెదక్ జిల్లాలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. (క్లిక్: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే!) నిధులు మంజూరైతేనే... మంజీర వంతెన నుంచి మగ్దుంపూర్ మీదుగా పాపన్నపేట వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఫార్మేషన్ రోడ్డు కూడా లేదు. పొలాల మధ్య నుంచి బండ్లబాట ఉంది. రోడ్డు నిర్మాణానికి ముందుగా రైతుల నుంచి భూసేకరణ జరపాలి. ఆ తర్వాత రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంటుంది. రోడ్డు నిర్మాణం కోసం మెదక్ జిల్లా రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దానికి నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. (క్లిక్: ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు.. ఏదైతే బాగుంటుంది?) రూ.33 కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం.... కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్య దూరం మధ్య దూరం తగ్గించే రహదారిని పూర్తి చేయాలని జెడ్పీ మీటింగుల్లో ప్రతిసారీ అడుగుతున్నాం. ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించాం. అయినా ప్రయోజనం లేదు. రూ.33 కోట్లతో వంతెన, రోడ్డు నిర్మాణం పూర్తయినా, మెదక్ జిల్లాలో పనులు చేపట్టకపోవడంతో ప్రయోజనం లేకుండాపోయింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే ఏడుపాయల, మెదక్ చర్చి, పోచారం ప్రాజెక్టు, పోచారం అభయారణ్యానికి పర్యాటకులు పెరుగుతారు. – యు.మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు, నాగిరెడ్డిపేట -
ఉప్పొంగిన గోదారి.. ఉధృతంగా మంజీర
బోధన్: భారీ వర్షాలతో గోదావరి, మంజీర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వానలతో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బుధవారం కందకుర్తి వద్ద వంతెన పైనుం చి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతాల మధ్య రాకపోకలు, నిలిచిపోయాయి. గోదావరి నది ఒడ్డున ఉన్న సీతారామ ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరింది. కందకుర్తి గోదావరి నదికి దిగువ ప్రాంతంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల రెంజల్ మండలంలోని కందకుర్తి, నీలా, బోర్గాం, తాడ్‌బిలోలి గ్రామాల శివారులోని సుమారు 4 వేల ఎకరాలకుపైగా సోయా, ఇతర పంటలు నీటి మునిగాయని స్థానిక రైతులు అంటున్నారు. పోటెత్తిన మంజీర..: మంజీర నదిలో వరదనీరు పోటెత్తి ప్రవహిస్తోంది. కౌలాస్‌నాలా, నిజాంసాగర్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద నీరు, వాగుల నుంచి చేరిన నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. సాలూర, తగ్గెల్లి, కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్గావ్ గ్రామాల శివారులోని వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. హంగర్గ చుట్టూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చేరింది. సుమారు వెయ్యి ఎకరాల పంట వరద నీటిలో మునిగి ఉందని రైతులు తెలిపారు. ఆర్డీవో రాజేశ్వర్ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. వరద ప్రమాద హెచ్చరిక జారీ ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద బుధవారం గోదావరి నీటి మట్టం 8.54 మీటర్లకు చేరడంతో కేంద్ర జలవనరుల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదిలో నీరు గంటకు పది పాయింట్లు పెరుగుతూ వస్తోంది. రెండో ప్రమాద హెచ్చరిక 9.54 మీటర్ల వద్ద జారీ చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక డేంజర్ లెవల్ 11.04కు చేరితే లోతట్టు గ్రామాలను ఖాళీ చేయిస్తారు. -
కామారెడ్డి జిల్లా: మంజీరాలో ముగ్గురు గల్లంతు
-
కామారెడ్డిలో విషాదం: మంజీరాలో ముగ్గురు గల్లంతు
కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దర్గా దర్శనానికి వెళ్లిన నలుగురు మంజీరా నదిలో గల్లంతయ్యారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్గా దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో వారిలో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి నదిలో గల్లందయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా.. అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: ఈ ఐదక్షరాల శాసనం వయసు 2,200 ఏళ్లు -
అరుణ మృతదేహం లభ్యం; రైతుల ఆవేదన
సాక్షి, మనూరు(నారాయణఖేడ్): నాలుగు రోజుల క్రితం తాను మంజీరా నదిలో దూకి చనిపోతున్నాని సంగారెడ్డి రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా పనిచేస్తున్న అరుణ(34) తన కుటుంబీకులకు తెలిపిన సంగతి తెలిసిందే. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసు యంత్రాంగం నదిలో ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని శనివారం సాయంత్రం రప్పించి నదిలో వెతకడం ప్రారంభించగా ఆదివారం ఉదయం రెండు బృందాలతో నదిలో దిగువ, ఎగువ ప్రాంతంలో ప్రత్యేక బోటుల ద్వారా గాలించారు. దీంతో రాయిపల్లి వంతెన వద్ద ఎగువన సిరూర్, పాంపడ్ శివారులో తేలిన మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకురావడంతో నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి శవాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అంత్యక్రియలు వారి స్వస్థలమైన నాగల్గిద్ద మండలం మోర్గి గ్రామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. మృతురాలి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు, ఖేడ్ సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్ఐ నరేందర్‌లు పేర్కొన్నారు. గాలింపు చర్యల్లో రాయికోడ్, నాగల్గిద్ద ఎస్ఐలు ఏడుకొండలు, శేఖర్లు మూడురోజులగా పాల్గొని పర్యవేక్షించారు. చదవండి: మంజీరలో ఏఓ గల్లంతు? కుటుంబ సభ్యుల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులే కారణం మృతికి గల కారణం ఆమె కుటుంసభ్యుల వేధింపులేనని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చే శారు. గత కొన్నాళ్లుగా అరుణ భర్త హోటల్ బిజినెస్‌లు నిర్వహించి నష్టపోవడంతో అరుణ బ్యాంకు నుంచి హౌసింగ్ లోన్ సైతం తీసుకోవడం జరిగిందన్నారు. అయినా కూడా భర్త శివశంకర్‌తోపాటు కుటుంబీకుల వేధింపులు భరించకపోవడంతో ఇలాంటి సంఘటనకు ఒడికట్టిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఆవేదన వ్యక్తం చేసిన ఖేడ్ ప్రాంత రైతులు.. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో అరుణ గతంలో వ్యవసాయ అధికారిగా పనిచెయ్యడంతో ఇక్కడి రైతులతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎళ్లవేళలా రైతలుకు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం ఖేడ్‌లోని ప్రగతి విద్యానిలయం పాఠశాలల్లో జరిగింది. ఎంసెట్ రాసి అగ్రికల్చర్ బీఎస్సీ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో చేసిన అనంతరం 2009లో జోగిపేట్‌లో ఏఈఓగా 2010లో ఏఓగా కల్హేర్ పోస్టింగ్ రాగా కంగ్టి, మనూరు మండలాల ఇన్చార్జిలుగా వ్యవహరించడం జరిగింది. 2018లో సంగారెడ్డికి వెళ్లి అక్కడ రైతు శిక్షణ కేంద్రంలో విధులను నిర్వహించారు. ఏఓ కుటుంబ సభ్యులకు పరామర్శ నారాయణఖేడ్: మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న రైతు శిక్షణా కేంద్రం ఏఓ అరుణ కుటుంబ సభ్యులను జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ నర్సింహారావు, వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు వైద్యనాథ్, వ్యవసాయ సిబ్బంది, ఆమ్ఆద్మీ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బోర్గి సంజీవులు పరామర్శించి ఓదార్చారు. అభినందించిన డీఎస్పీ రాయికోడ్(అందోల్): మండల శివారులోని మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఏఓ అరుణ మృతదేహాన్ని ఆదివారం మండలంలోని పాంపాడ్ శివారులో గుర్తించి ఒడ్డుకు తెచ్చారు. మృతదేహం కోసం గత నాలుగు రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో సాహసంగా కృషి చేసిన స్థానిక మత్స్యకారులు, ఎన్డీఆర్ఎఫ్, తెలంగాణ టూరిజం శాఖ, అగ్నిమాపక తదితర శాఖల సిబ్బందిని జహీరాబాద్ డీఎస్పీ శంకర్‌రాజ్ శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రయ్య, బాసిత్ పటేల్, ఆయా శాఖల సిబ్బంది, మత్స్యకారులు ఉన్నారు. -
మంజీరలో ఏఓ గల్లంతు?
మనూరు(నారాయణఖేడ్): సంగారెడ్డిలోని రైతు శిక్షణకేంద్రంలో అరుణ(34) ఏఓగా పనిచేస్తోంది. గురువారం సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్‌కు వస్తున్న క్రమంలో మనూరు మండలం రాయిపల్లి వద్ద మంజీరలోకి దూకి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు నారాయణఖేడ్ మండలం పైడిపల్లిలోని వరుసకు తమ్ముడైన పవన్‌కు ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు వంతెన వద్దకు చేరుకున్నారు. వంతెనవద్ద ఉన్న టీఎస్15 ఈడీ0403 కారులో యువతి హ్యండ్‌బ్యాగు, చెప్పులు ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున ఎస్ఐ నరేందర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీంతో చుట్టుపక్కలవారితో విచారించారు. ఆమె కోసం నదిలో గాలింపు చేపట్టారు. యువతి ఆచూకీ లభించకపోవడంతో తమ్ముడు శేరి శివకుమార్ ఫిర్యాదుమేరకు గల్లంతు కేసుగా నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు. కాగా సంఘటన స్థలానికి ఖేడ్ సీఐ రవీందర్‌రెడ్డి, రాయికోడ్ ఎస్ఐ ఏడుకొండలు చేరుకుని వివరాలు అడిగితెలుసుకున్నారు. అలుముకున్న విషాదఛాయలు అరుణ గల్లంతుతో ఖేడ్‌లో విశాద ఛాయలు అలుముకున్నాయి. ఈమె గతంలో మనూరు, నారాయణఖేడ్, కల్హేర్ ఏఓగా పనిచేసింది. 2016లో మోర్గికి చెందిన శివశంకర్‌తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు రుద్రవీర్, 11 నెలల విరాట్ ఉన్నారు. -
మంజీరలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు
సాక్షి, మెదక్: జిల్లాలోని కొల్చారం మండలం పోతాంశెట్టిపల్లి శివారులో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం మంజీరా ప్రవాహంలో నలుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. చేపలు పట్టడానికి మంజీరా నదిలోకి వెళ్లిన వారంతా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఎగువ నుంచి నీళ్లు వదలడంతో ఈ నలుగురు ఉన్న గడ్డ ప్రాంతం చుట్టు పక్కల ఒక్కసారిగా భారీ స్థాయిలో నీరు చేరింది. భారీగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్నవారు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందిచారు. దీంతో మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వారిని ఒడ్డుకు చేర్చేందుకు మెదక్, కిష్టాపూర్ నుంచి గజ ఈతగాళ్లను పిలిపించారు. సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మంజీర నదిలో చిక్కుకున్న వారిని కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుంపలు ఎల్లం, సాదుల యాదగిరి, మెదక్ పట్టణానికి చెందిన ఆర్నె కైలాఫ్, రాజబోయిన నాగయ్యగా పోలీసులు గుర్తించారు. -
ఈ ఐదక్షరాల శాసనం వయసు 2,200 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్ : ఇదో శాసనం.. శాసనమంటే వాక్యాల సమాహారం కాదు, కేవలం ఐదక్షరాల పదం. ఆ పదానికి స్పష్టమైన అర్థం వెతకాల్సి ఉంది. అది చెక్కింది నిన్న మొన్న కాదు, దాదాపు 2,200 ఏళ్ల క్రితం. అంటే.. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దమన్నమాట. ఇది ఇంతకాలం ఓ గుండుపై అనామకంగా ఎదురుచూస్తూ ఉంది. మరి ఆ మాటకు స్పష్టమైన అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. అసలు అది మన తెలుగు భాష, లిపి కాదు. అచ్చమైన ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపిలో లిఖించి ఉంది. అది కూడా అప్పుడప్పుడే శాతవాహన యుగం మొదలవుతున్న తరంనాటిది. అంటే.. అశోకుడి హయాంలో వాడిన లిపిలో ఉండటమే దీనికి తార్కాణం. వెరసి తెలంగాణ లో ఇప్పటివరకు వెలుగు చూసిన శాసనాల్లో ఇదే అతిపురాతనమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకాలం కృష్ణా, గోదావరి నదుల తీరాల్లో శాసనాలు ఎన్నో వెలుగుచూడగా, ఇది మంజీరా పరీవాహక ప్రాంతంలో బయటపడటం గమనార్హం. మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో... కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపల్లి మండలంలోని మాల్తుమ్మెద గ్రామ శివారులో ఈ అపురూప లఘు శాసనం తాజాగా వెలుగుచూసింది. ఆదిమానవుల జాడ మొదలు ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా ఉన్న ఈ గ్రామంలో ఇంత పురాతన చెక్కడం బయటపడటం విశేషం. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలతోపాటు బౌద్ధ ఆధారాలున్న ధూళికట్ట, కొండాపూర్, బోధన్ తదితర ప్రాంతాల్లో క్రీ.శ. ఒకటో శతాబ్దానికి చెం దిన శాసనాలు గతంలో వెలుగు చూసిన విష యం తెలిసిందే. కానీ, అంతకు కనీసం 200 ఏళ్ల పూర్వం నాటి శాసనం ఇప్పుడు ఇక్కడ బయటపడింది. మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో పెద్ద బండరాయిపై ఈ అక్షరాలు చెక్కి ఉన్నాయి. ‘మాధవచంద’ అంటే.. ‘‘తెలుగులో ఈ శాసనం అర్థం ‘మాధవచంద’. ఇది వ్యక్తి పేరో, ప్రాంతం పేరో, వీటికి సంబం ధంలేని మరే అర్థమో అయి ఉండవచ్చు. దాని పై ఇంకా స్పష్టత లేదు. ఆ ఒక్క పదమే ఇక్కడ ఎందుకు చెక్కి ఉందో కనుగొనాల్సి ఉంది. ఎన్నో చారిత్రక ఆధారాలకు నెలవుగా ఉన్న ఆ గ్రామంలో దీనిపై మరింత పరిశోధన జరిపితే మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కానీ, తొలి శాతవాహన కాలం నాటి గుర్తులు ఇక్కడ ఉన్నాయనేది ఈ శాసనంతో స్పష్టమైంది’’అని ఆ శాసనాన్ని పరిశీలించిన చరిత్ర పరిశోధకులు ఎం.ఎ.శ్రీనివాసన్ పేర్కొ న్నారు. సర్వేయర్‌గా ఉంటూ చరిత్ర పరిశోధనలో ఆసక్తి చూపుతున్న శంకర్‌రెడ్డి దీన్ని తొలుత గుర్తించారు. హెరిటేజ్ తెలంగాణ విశ్రాంత అధికారి వై.భానుమూర్తితో కలసి తాను పరిశీలించినట్టు వెల్లడించారు. ఆ అక్ష రాల నిగ్గు తేల్చేందుకు తాను సంప్రదించగా, అవి తొలి శాతవాహన కాలం నాటి లిపితో ఉన్నాయని ఏఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం సంచాలకులు పేర్కొన్నట్టు శ్రీనివాసన్ వెల్లడించారు. -
మంజీరకు జలకళ
సాక్షి, బోధన్ (నిజామాబాద్): బోధన్ మండలంలోని సాలూర శివారులో గల మంజీర నదిలో జలకళ సంతరించుకుంది. రెండు, మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదిలోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో మంగళవారం సాలూర శివారులోని పాత బ్రిడ్జ్ ఎత్తు వరకు నదిలో నీరు ప్రవహించింది. వరద నీటితో మంజీరకు జలకళ సంతరించుకోవడంతో మంజీర బ్రిడ్జ్ పై నుంచి బోధన్, మహారాష్ట్ర కు ప్రయాణాలు సాగించే ప్రయాణికులు, వాహనదారులు కొద్దిసేపు ఆగి జల ప్రవాహాన్ని వీక్షిస్తున్నారు. యువత సెల్ఫీలు తీసుకుంటు సందడి చేస్తున్నారు. ఈ జల ప్రవాహంతో దిగువ ప్రాంతం రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తేలిన శివాలయం, గోదావరికి తగ్గుతున్న వరద ఉధృతి రెంజల్ : రెండు రోజులు నిలకడగా సాగిన గోదావరి నదిలో వరద ఉధృతి మంగళవారం తగ్గింది. రెండు రోజుల కిందట కందకుర్తి పుష్కరక్షేత్రంలోని నదిలో గల పురాతన శివాలయం ముందు గల నంది విగ్రహం పూర్తిగా వరద నీటితో మునగగా మంగళవారం పూర్తిగా వరద నీరు తగ్గింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది వరద నీటితో పరవళ్లు తొక్కింది. వర్షాలు కాస్త తగ్గు ముఖం పట్టడంతో నదిలో నీటి ప్రవాహం తగ్గింది. ఎగువన గల మహారాష్ట్రతో పాటు మంజీర, హరిద్ర నదుల నుంచి నీరు కిందికి చేరుతుంది. -
ధార లేని మంజీర
సాక్షి, నారాయణఖేడ్: జిల్లా జీవ నది మంజీర ఇంకా వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా నదిలో నీటి జాడలే లేవు. ఇప్పటికే నీటితో కళకళలాడాల్సిన నదిలోకి నీరు రాకపోవడంతో జిల్లావాసులు కలవర పడుతున్నారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నా మంజీరా నదిలో ఆ జాడలు మాత్రం కానరావడం లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నా దానికి ఉప నదిగా ఉన్న మంజీరలో మాత్రం నీరే లేదు. గత ఏడాది ఈ సమయం వరకే మంజీరా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఎండిపోయే కన్పిస్తోంది. కర్ణాటకలో నెల క్రితం కురిసిన భారీ వర్షంతో మంజీరా నదిలోకి వరద వచ్చింది. అప్పటికే వేసవి కాలంలో నది పూర్తిగా ఎండిపోయి ఉండడంతో వచ్చిన వరద నీరు కాస్త భూమిలోకి ఇంకిపోయింది. నది తిరిగి యథా పరిస్థితికి వచ్చి చేరింది. కర్ణాటక రాష్ట్రంలో పుట్టి ప్రవహించే మంజీరా నది జిల్లాలోని నాగల్గిద్ద మండలం గౌడ్‌గాంజన్‌వాడ వద్ద ప్రవేశిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నది ప్రవేశ ప్రాంతం నుండి ఎక్కడా నీరు రాలేదు. కర్ణాటక రాష్ట్రంలో కురిసే భారీ వర్షాలు, వరదలతో నదిలోకి నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతంలో కూడా వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కర్ణాటకలో కురిసిన వర్షం వల్ల మంజీరాకు ఎగువన బీదర్ జిల్లా హుమ్నాబాద్ ప్రాంతంలో ఉన్న కరంజా ప్రాజెక్టులోకి కొంత నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నుండి నీటిని కిందకు వదలడం లేదు. కరంజా ప్రాజెక్టులోకి భారీగా వరదలు వచ్చి చేరినప్పుడే ఈ ప్రాజెక్టు నుండి దిగువకు వరద నీరు వదిలే అవకాశం ఉంది. అప్పుడే నదిలోకి నీరు వస్తుంది. మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.91టీఎంసీలు కాగా ఇప్పటివరకు ప్రాజెక్టులో ఉన్న నీరు 0.44 టీఎంసీలు మాత్రమే. తాగునీటికి కష్టకాలమే.. మంజీరాపై ఆధారపడి నారాయణఖేడ్‌తోపాటు జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల నీటి పథకాలు పని చేస్తున్నాయి. నదిలో నీరు లేని కారణంగా మూడు నెలలుగా నీటి పథకాలు వట్టిపోయాయి. రెండు నెలల క్రితం వరకు సింగూరు సమీపంలోని పెద్దారెడ్డిపేట్ నుండి నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, మెదక్ నియోజకవర్గాలకు కలిపి మిషన్ భగీరథ అధికారులు 953 గ్రామాలకు తాగునీటిని అందించారు. రెండు నెలలుగా ప్రాజెక్టులో చుక్కనీరు లేని కారణంగా నీటి పథకాలన్నీ వృథాగానే మారాయి. ఫలితంగా వందల గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తింది. చాలా గ్రామాల్లో బోర్లను కిరాయికి తీసుకోవడం, ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు. ఈ నీరు కూడా గ్రామీణులకు అవసరమైన మేర సరిపోవడం లేదు. వృథాగా నీటి పథకాలు.. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాలకు మంజీర నది నుండే తాగునీరు వెళ్తుంది. బోరంచ ఎన్ఏపీ పథకం ఫేజ్ 1 కింద 18 గ్రామాలకు గాను 12 గ్రామాలకు తాగునీరు వెళ్తుంది. ఫేజ్ 2 కింద 75 గ్రామాలకు గాను 66 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 40 గ్రామాలకు గాను 20గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గూడూరు నాబార్డు పథకం ద్వారా నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లోని 66 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ నీటి పథకాల ఇన్‌టెక్ వెల్లు అన్నీ మంజీర నదిపైనే ఉన్నాయి. నది ఎండిపోవడంతో సమీప గ్రామాలతోపాటు నారాయణఖేడ్ పట్టణంలోని పలు బోర్లు కూడా గ్యాప్ ఇస్తున్నాయి. జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా జరిగే ఇన్‌టెక్ వెల్లు కూడా మంజీర నదిపైనే ఉన్నాయి. వీటివద్ద కూడా నీరు ఎండిపోయింది. నది ఎండడంతో బోర్లు కూడా ఎండిపోయి గ్యాప్ ఇస్తున్నాయి. -
‘హరీశ్ పాపం.. కేసీఆర్‌కు శాపం’
సాక్షి, సంగారెడ్డి : టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కేటాయింపులు లేకున్నా మంజీర నీటిని శ్రీరాంసాగర్‌కు అక్రమంగా తరలించారని ఆరోపించారు. హరీశ్ చేసిన పాపానికి ప్రస్తుతం మంజీర నది ఎండిపోయిందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావు అర్థరాత్రి మంజీరా నీళ్లను దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులు ఎండబెట్టారని విమర్శించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్.. సీఎం కేసీఆర్‌కు తెలియకుండానే నీళ్లను తరలించారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడనే కారణంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేదన్నారు. నీటి తరలింపు విషయం కేసీఆర్‌కు తెలిస్తే ఆయన ఒప్పుకునే వారు కాదన్నారు. మంజీరను ఎండబెట్టి.. మిషన్ భగీరథ ద్వారా నీళ్లివ్వాలన్న కేసీఆర్ కోరికకు హరీశ్‌రావు తూట్లు పొడిచారని విమర్శించారు. హరీశ్‌రావు చేసిన పాపం మెదక్ జిల్లా ప్రజలకు, సీఎం కేసీఆర్‌కు శాపంగా మారిందన్నారు. గెలిస్తే ప్రశ్నిస్తాననే భయంతో నాడు తనను హరీశ్ జైల్లో పెట్టించారని ఆరోపించారు. హరీశ్‌రావు చేసిన తప్పుకు సంగారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి అవసరం కోసం సంగారెడ్డికి రూ.10 కోట్లు తక్షణమే కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
సింగూరుకు ఇక సెలవు..!
సాక్షి, హైదరాబాద్: గోదావరి రింగ్‌మెయిన్–3 పనుల పూర్తితో గ్రేటర్ హైదరాబాద్‌కు సింగూరు, మంజీరా జలాశయాల నీటితరలింపునకు శాశ్వతంగా సెలవు ప్రకటించాల్సిందేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నగర శివార్లలోని ఘన్పూర్ నుంచి పటాన్చెరు వరకు 43 కి.మీ. మార్గంలో రింగ్‌మెయిన్ పనులు పూర్తికావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే మెదక్, నర్సాపూర్ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి కావడంతో అక్కడి తాగునీటి అవసరాలకు నిత్యం 40 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరమవుతుందని, గ్రేటర్ తాగునీటి అవసరాలకు సింగూరు, మంజీరా జలాలు మినహా ఇతర ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందేనని ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి అధికారులు, రాజకీయ నేతల నుంచి ఒత్తిడులు తీవ్రం కావడంతో జలమండలి అప్రమత్తమైంది. ఇప్పటికే రూ.398 కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన గోదావరి రింగ్‌మెయిన్–3 పనుల్లో గౌడవెల్లి ప్రాంతంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ పైప్‌లైన్‌పై వాల్వ్‌ల ఏర్పాటు వంటి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ఈ వారంలో ట్రయల్‌రన్ నిర్వహించేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది. గ్రేటర్ దాహార్తిని తీర్చిన సింగూరు, మంజీరా జలాలు భాగ్యనగరానికి జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల తరవాత 70వ దశకం నుంచి సింగూరు, మంజీరా జలాల తరలింపు ప్రక్రియ మొదలైంది. నాటి నుంచి నేటి వరకు పటాన్చెరు, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాలకు ఈ జలాలే దాహార్తిని తీర్చేవి. అయితే, గోదావరి మొదటిదశ పథకం పూర్తితో సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నిత్యం 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని నగరానికి తరలించినప్పటికీ ఇందులో సింహభాగం పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతాలతోపాటు ఇక్కడున్న పలు ప్రతిష్టాత్మక సంస్థలు, కంపెనీలకు తాగునీటిని సరఫరా చేసేవారు. ఏడాదిగా నగర తాగునీటి అవసరాలకు నిత్యం సుమారు 10 మిలియన్ గ్యాలన్ల సింగూరు, మంజీరా జలాలను మాత్రమే సరఫరా చేసినట్లు జలమండలి వర్గాలు పేర్కొంటున్నాయి. రింగ్‌మెయిన్ పైప్‌లైన్–3 పూర్తితో ఇక నుంచి సింగూరు జలాలు నిలిచిపోయినప్పటికీ కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరు తదితర ప్రాంతాలకు గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని జలమండలి స్పష్టం చేసింది. ఈ వారంలో ట్రయల్‌రన్ పూర్తి చేసి ఫిబ్రవరి మొదటివారం నుంచి గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని తెలిపింది. కృష్ణా, గోదావరి జలాలే ఆధారం... జంట జలాశయాల నీటిని నగర తాగునీటి అవసరాలకు సేకరించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించడం, త్వరలో సింగూ రు, మంజీరా జలాల సరఫరా నిలిచిపోనుండటంతో భాగ్యనగరానికి కృష్ణా, గోదావరి జలాలే ఆధారం కానున్నా యి. ప్రస్తుతానికి కృష్ణా మూడు దశల ద్వారా నిత్యం 270 మిలియన్ గ్యాల న్లు, గోదావరి మొదటిదశ ద్వారా మరో 130 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. రింగ్‌మెయిన్–3 పనుల పూర్తితో అదనంగా మరో 60 ఎంజీడీల గోదావరి జలాలను సిటీకి తరలించనున్నారు. దీంతో నిత్యం నగరానికి 460 మిలియ న్ గ్యాలన్ల జలాలను సరఫరా చేయనున్నారు. ఈ నీటిని నగరంలోని 9.60 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫ రా చేయనున్నట్లు జలమండలి అధికా రులు చెబుతున్నారు. -
‘ఉత్తి’పోతల పథకాలు
టేక్మాల్(మెదక్): ప్రభుత్వం సాగునీటి కోసం కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఎత్తిపోతల పథకాలు, కాలువల మరమ్మత్తులు చేపడుతోంది. అయితే, క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో సాగునీటి పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయి. ఫలితంగా వందలాది ఎకరాలు బీడు భూములుగా మారుతుడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రూ.50 లక్షలతో అచ్చన్నపల్లిలో.. టేక్మాల్ మండలం అచ్చన్నపల్లిలో మంజీర నదిపై 1995లో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. రూ.50 లక్షలతో నిర్మించిన ఈ పథకం ద్వారా అచ్చన్నపల్లి, లక్ష్మణ్, చంద్రుతండాల్లో నాలుగు చెరువులను నింపాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 180 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. రెండేళ్ల పాటు సక్రమంగా పని చేసినా.. నిర్వహణ లోపంతో ప్రస్తుతం వృథాగా మారింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.77 లక్షలతో గతేడాది పాత ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా వదిలేసి నూతనంగా నిర్మించారు. ఎత్తిపోతల పథకాన్ని ఓ కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు ఎంత ఆయకట్టు వేయాలో ముందు నిర్ణయించి.. సాగు చేస్తున్నారు. 2017 ఖరీఫ్, 2018 రబీలో సుమారు 100 ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా సాగు చేశారు. అదే అదునుతో ఖరీఫ్‌లో రెట్టింపు సాగు చేయాలని రైతులు గంపెడు ఆశతో భూములన్నీ చదును చేసుకొని.. వరినారు మడులను సిద్ధం చేసుకున్నారు. మరికొందరు రైతులు ముందస్తుగా వరినాట్లు వేశారు. ఎత్తిపోతల ద్వారా రెండు పంటలు నీరు అందకముందే మంజీర ఖాళీ కావడంతో ఆ పథకం కాస్తా నిర్వీర్యం అయ్యింది. ఫలితంగా భూములు బీడులు మారాయి. మరమ్మతులకు నోచుకోని కోరంపల్లి పథకం మండలంలోని కోరంపల్లి ఎత్తిపోతల పథకం కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఫలితంగా 600 ఎకరాలకు పైగా బీడుగా మారింది. 1992లో రూ.1.50 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మంజీర తీరంలో అంతర్గత బావి నిర్మించారు. వేసవిలో ఇసుక తరలించడంతో నీరు ఎక్కువగా నిల్వ ఉండని స్థితి ఏర్పడింది. క్రమేపి నీటిమట్టం పడిపోవడంతో సాగు విస్తీర్ణం 150 ఎకరాలకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం ద్వారా అసలు వ్యవసాయం చేయడం లేదని రైతులు చెబుతున్నారు. సింగూరు నీటిని మంజీర నదిలోకి వదలకపోవడంతో ఈ పథకం వెలవెలబోతుంది. ఫలితంగా బీడు భూములన్నీ సాగులోనికి వస్తాయనుకున్న రైతుల ఆశలు ఆవిరి అవుతున్నాయి. -
ఎండుతున్న మంజీరా
నారాయణఖేడ్ (మెదక్): మంజీరా నది ఎండుతోంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే నదిపై ఆధారపడి ఉన్న మంచినీటి పథకాల ద్వారా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే సకాలంలో వర్షాలు కురవని పక్షంలో మంజీరా నదిపై ఆధారపడి ఉన్న గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు. గత ఏడాది వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో మంజీరా నది పూర్తిగా నిండి కళకళలాడింది. నది నుంచి భారీగా నీటిని వదలడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడింది. మంజీరా నదిపై నారాయణఖేడ్ నియోజకవర్గంతోపాటు జహీరాబాద్, ఆందోలు నియోజకవర్గాలకు చెందిన తాగునీటి పథకాలు ఉన్నాయి. వర్షాలు ఏమాత్రం ముఖం చాటేసినా నీటి పథకాలు వట్టిపోనున్నాయి. ఇప్పటికే నీటిపథకాల నిర్వహణ కష్టతరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నాగల్గిద్ద మండలం గౌడ్గాం జనవ్వాడ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న మంజీరా నది నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అత్యధిక ప్రాంతంలో పారే నది ఖేడ్ నియోజకవర్గంలోనే. మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు. గత వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. నదిలో సమృద్ధిగా వరద నీరు వచ్చి చేరింది. కాగా ఏడాది ప్రారంభంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు ఘన్పూర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు విడతల వారీగా సింగూరు నుంచి నీటిని వదిలారు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 10 టీసీఎంసీలు కాగా ప్రస్తుతం 9 టీఎంసీల వరకు నీరు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ అంతకంటే తక్కువ టీఎంసీల నీరు మాత్రమే ఉందని ప్రతిపక్షాలు, నది సమీప గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో 4 టీఎంసీల నీటి నిల్వ తగ్గే స్థాయిలో పూడిక మట్టి ఉంది. నది నుంచి భారీగా నీరు వదలడంతో ఘన్పూర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు వేసవి చివరిలోనూ నిండుకుండలా నీటితో కళకళలాడుతున్నాయి. మంజీరా నది మాత్రం ఎండిపోతోంది. నీటి పథకాలకు గడ్డుకాలం.. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాలకు మంజీరా నది నుంచే తాగునీరు వెళ్తుంది. బోరంచ ఎన్ఏపీ పథకం ఫేజ్ 1కింద 18 గ్రామాలకు గాను 12 గ్రామాలకు తాగునీరు వెళ్తుంది. ఫేజ్ 2 కింద 75 గ్రామాలకు గాను 66 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 40గ్రామాలకు గాను 20గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గూడూరు నాబార్డు పథకం ద్వారా నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లోని 66గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ నీటి పథకాల ఇన్‌టెక్‌వెల్‌లు అన్నీ మంజీరా నదిపైనే ఉన్నాయి. ఇప్పటికే గూడూరు పథకం ద్వారా రోజు విడిచి రోజు, రెండు రోజులకు ఓ మారు నీటి సరఫరా జరుగుతోంది. శాపూర్, బోరంచ ఇన్‌టెక్ వెల్ వద్ద కూడా నీరు తగ్గింది. ముందు ముందు ఎండల పరిస్థితి ఇలాగే ఉంటే తాగునీటి పథకాలు వట్టిపోతాయి. నదిలో నీరు తగ్గడంతో సమీప గ్రామాలతోపాటు నారాయణఖేడ్ పట్టణంలోని పలు బోర్లు కూడా గ్యాప్ ఇస్తున్నాయి. జహీరాబాద్, ఆందోలు నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా జరిగే ఇన్‌టెక్ వెల్లు కూడా మంజీరా నదిపైనే ఉన్నాయి. వీటివద్ద కూడా నీళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మంజీరా నది ప్రారంభం మొదలుకొని గోదావరిలో కలిసే వరకు పూర్తి ప్రవాహంలో రాయిపల్లి వంతెన వద్ద ఉన్నంత ఉద్ధృతి ఎక్కడా కన్పించదు. ఈ వంతెన సమీపంలో కనుచూపు మేర పూర్తిగా నీటితోనే నది కన్పిస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిలా తయారైంది. నదిలోంచి పశువులు, జనాలు ఇవతలి వైపు నుంచి అవతలి వైపు నడిచి వెళుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నదిలో అక్కడక్కడా గోతుల్లో ఉన్న నీటిలో పశువులు ఈదుతున్నాయి. నది ఎండడంతో రబీ సీజన్‌కు సంబంధించి జొన్న, శనగ తదితర పంటలను నది ముంపు భూముల్లో రైతులు సాగుచేసి పంటలను సైతం తీసుకున్నారు. నది పరిస్థితి చూసి జనాలు తల్లడిల్లుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే వరుణుడు కరుణిస్తేనే మూడు నియోజకవర్గాల్లోని ప్రజలునీటి ఎద్దడి నుండి బయట పడగలరు. -
రెవెన్యూ అధికారులపై రాళ్ల దాడి
నిజామాబాద్ : కోటగిరి మండలం సుంకిని వద్ద మంజీరా నదిలో రెవెన్యూ అధికారులపై మహారాష్ట్రకు చెందిన 50 మంది రాళ్ల దాడి చేశారు. మంజీర నదిలో తెలంగాణ భూభాగంలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవన్యూ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మహారాష్ట్ర కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీలను బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి సీజ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ అనుచరులు తహసీల్దార్ విఠల్‌తో పాటు రెవెన్యూ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు రెవెన్యూ అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాళ్ల దాడితో భయపడిపోయి వెనక్కి తగ్గటంతో డోజర్ జేసీబీలను మహారాష్ట్ర కాంట్రాక్టర్ అనుచరులు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వైభవంగా కుంభమేళా
న్యాల్కల్(జహీరాబాద్): కుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో మంజీర నది కోలాహలంగా మారింది. రాఘవాపూర్–హుమ్నాపూర్ గ్రామాల శివారులో కొనసాగుతున్న కుంభమేళా ఆరో రోజు కూడా భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వేకువజామున వచ్చిన భక్తులు మంజీరలో పుణ్యస్నానాలచరించారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు నదిలో స్నానాలు చేసి గంగామాతకు పూజలు నిర్వహించారు. అనంతరం గంగాదేవి ఆలయంలో పూజలు చేసి దైవదర్శనం చేసుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞా, హోమాలు కొనసాగుతున్నాయి. కుంభమేళాలో భక్తుల కోలాహలంతో పాటు సాధువుల సంతుల సందడి నెలకొంది. భక్తులు దిగంబర సాధువులను దర్శించుకున్నారు. సాయంత్రం సాధువుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అలాగే భక్తులు పంచవటిలో వెలసిన శారదాదేవి, సాయిబాబ, శనీశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసిన వెంకటస్వామి ఉదయం కుంభమేళాకు వచ్చిన రుస్తుపేట పీఠాధిపతి వెంకటస్వామికి పంవచటి క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో కలసి మంజీర నది వద్ద గంగామాతకు పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటస్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం శుభదినాలు ఉన్నందున భక్తులు మంజీరలో పుణ్యస్నానాలచరించాలన్నారు. లోక కల్యాణార్థమై ఈ ప్రాంతంలో కాశీనాథ్‌బాబా కుంభమేళా నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యమన్నారు. ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. -
నీటి గలగల.. పంట కళకళ
పాపన్నపేట(మెదక్): మెతుకు సీమకు వరప్రసాదిని మంజీరా నది. కొల్చారం.. పాపన్నపేట మండలాల మధ్య 1905 లో నిర్మించిన ఘనపురం ఆనకట్ట 30వేల ఎకరాల పంటలకు ప్రాణం పోస్తోంది. సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు లెక్క ప్రకారం యేటా 4 టీఎంసీల నీరు రావాలి. అయితే గతంలో హైదరాబాద్ వాసుల దాహార్తి కోసం సింగూరు నుంచే నీరు తీసుకెళ్లేవారు. కానీ కొంత కాలంగా సింగూరు నీటిని ప్రథమంగా స్థానిక అవసరాల కోసం వాడుతున్నారు. అయినప్పటకీ నాలుగేళ్ల క్రితం వరకు రైతులు ఆందోళన చేస్తేనే సాగు నీరు వచ్చేది. ఆ నీటి విడుదల కోసం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం గొంతు విప్పేవారు. దీంతో సాగు నీటి విడుదల కోసం ప్రతి విడతకు ఒక జీఓ విడుదల చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితులు మారాయి. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి.. మంత్రి హరీశ్‌రావు చిత్తశుద్ధి మేరకు ప్రతి యేటా అడకుండానే అవసరాలకు ఘనపురం ప్రాజెక్టు వాటా కనుగుణంగా సింగూరు నుంచి నీరు విడుదల అవుతోంది. ప్రభుత్వ జీఓల కోసం మీన మేషాలు లెక్కించకుండానే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రబీ సీజన్లో ఘనపురం ప్రాజెక్టుకు 11 విడతలుగా ఇప్పటి వరకు 3.35 టీఎంసీల నీరు విడుదల చేశారు. దీంతో ఘనపురం ఆయకట్టు కింద ఒక్క గుంట ఎండకుండానే రబీ గట్టెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల సింగూరు ప్రాజెక్టు 29 టీఎంసీల గరిష్ట నిల్వ నీటి సామర్థ్యాన్ని చేరుకుంది. అనంతరం కురిసిన వర్షాల వల్ల వరద పోటెత్తడంతో మునుపెన్నడు లేని విధంగా 11 టీఎంసీల నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేశారు. అనంతరం నవంబర్ నెలలో ఈయేడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 14 టీఎంసీల నీటిని వదిలారు. దీంతో నిజాంసాగర్ ఆనకట్ట కింద సైతం రబీ పంటలు డోకా లేదు. అలాగే శ్రీరాంసాగర్‌కు ప్రయోజనం కలిగింది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 8.731 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ ఈఈ యేసురత్నం తెలిపారు. -
హోలీలో అపశ్రుతి
పుల్కల్(అందోల్): రెండు కుటుంబాల్లో హోలీ పండగ విషాదాన్ని నింపింది. ఇద్దరు విద్యార్థులు నదిలో నీట మునిగి దుర్మరణం పాలైన సంఘటన పుల్కల్ మండలం కొర్పోల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కొర్పోల్ గ్రామానికి చెందిన కిషన్, మంజుల దంపతుల కొడుకు సాయికిరణ్, యాదయ్య, వీరమణి దంపతుల కొడుకు సాయికుమార్లు మధ్యాహ్నం వరకు హోలీ ఆడారు. అనంతరం వారిద్దరూ మరో ఐదుగురితో కలిసి స్నానానికని మంజీర నదికి వెళ్లారు. ఇందులో ఈత రాని ఐదుగురు నది ఒడ్డున స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో సాయికిరణ్, సాయికుమార్‌లతోపాటు మరో ఇద్దరు నీట మునగడాన్ని ఇంటర్ విద్యార్థి మల్లేశం గమనించాడు. వెంటనే నీట మనుగుతున్న ఇద్దరిని కాపాడి బయటకు తీశాడు. కానీ సాయికిరణ్, సాయికుమార్‌లను కాపాడేంత శక్తి లేకపోవడంతో గ్రామానికి చెందిన పలువురికి సమాచారం ఇచ్చాడు. కానీ అంతలోపే సాయికుమార్, సాయికిరణ్‌లు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిద్దరూ 10వ తరగతి విద్యార్థులే. వీరి మృతి విషయం తెలుసుకున్న స్థానికులు మంజీర నదికి వెళ్లి వారి మృతదేహాలను బయటకు తీశారు. వెంటనే పుల్కల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏఎస్ఐ ప్రభాకర్ సంఘటన స్థలానికి చెరేకున్నారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులే.. మంజీర నదిలో స్నానం చేయడం కోసం వెళ్లి మృతి చెందిన సాయికుమార్, సాయికిరణ్‌లు ఇద్దరూ ప్రాణస్నేహితులని తోటి విద్యార్థులు తెలిపారు. ఐదవ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకుంటున్నారని, ఎప్పుడూ వారు కలిసే ఉండే వారన్నారు. ఇద్దరూ తల్లిదండ్రులకు ఒక్కగానొక్కరే.. సాయికుమార్, సాయికిరన్లు ఇద్దరు కూడా వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరే కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సాయికుమార్ తండ్రి యాదయ్య ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి వీరమణి కూలీ పని చేస్తూ తన కొడుకును చదివిస్తోంది. మరో విద్యార్థి సాయికిరణ్ సైతం వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. గ్రామంలో విషాదం.. అందరూ ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు జరుపుకుంటుంటే ఆ గ్రామంలోని రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. ఇదిలా ఉంటే ఇద్దరు విద్యార్థులు మంజీర నదిలోనే పడి మృతి చెందారని, వారికి పోస్టుమార్టం నిర్వహించవద్దని స్థానికులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. కానీ స్థానికంగా నెలకొన్న పరిస్థితి దృష్ట్యా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం కోసం మృతదేహాలను జోగిపేట ఆస్పత్రికి తరలించామని ఏఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. -
మంజీరా గుల్ల
కొల్చారం(నర్సాపూర్): కొల్చారం మండలంలో ప్రవహిస్తున్న మంజీర నది ఇక్కడి రైతులకు వరప్రదాయిని. మండలంలోని ఎనగండ్ల, వైమాందాపూర్, కోణాపూర్, పైతర, రంగంపేట, తుక్కాపూర్, చిన్నఘనాపూర్ గ్రామాల గుండా నది ప్రవాహం ఘనాపురం ఆనకట్ట వరకు కొనసాగుతుంది. రైతులు ఈ మంజీర నీటిని మోటార్ పైప్లైన్ల ద్వారా ఎక్కువగా వినియోగిస్తూ వస్తున్నారు. మేటవేసిన ఇసుక వల్ల భూగర్భ జలాల మట్టం పెరిగి బోర్లు వట్టిపోకుండా ఇక్కడి రైతులకు మంజీర జీవనాధారంగా మారింది. రైతుల బాధలు పట్టని కొందరు అక్రమ ఇసుక దందాకు తెర లేపుతున్నారు. ప్రభుత్వ పథకాలకు ఇసుక అవసరం అంటూ ఆయా గ్రామాల రైతులను మోసం చేస్తూ ‘పెద్ద’ ప్రజాప్రతినిధుల పేర్లను వాడుతూ ఇసుక దందాకు తెరలేపారు. మంజీర ఇసుక ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు వాడవచ్చా? ప్రభుత్వం చేపట్టే భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజీర ఇసుక ఏమాత్రం ఉపయోగపడదని స్వయాన సంబంధిత శాఖలకు చెందిన అధికారులే అంగీకరిస్తున్నారు. ఇక్కడి ఇసుకలో మట్టి పాళ్లు ఎక్కువగా ఉండడంతోపాటు నల్లని గుండురాయి కూడా మిళితమై ఉందని, దీన్ని నిర్మాణాలకు వాడితే తక్కువ కాలంలోనే బీటలువారే పరిస్థితి వస్తుందన్నది అధికారుల సమాధానం. గతంలో మండలంలో నిర్మించిన భవనాలు, సీసీ రోడ్లు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఈ పరిస్థితుల్లో బోధన్ నుంచి ఇసుక తెచ్చేందుకు అవసరమైన రవాణా చార్జీలను సైతం కాంట్రాక్టర్లకు అందిస్తూ వస్తున్నారు. కొల్చారం మండలానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇసుకను తీసుకువచ్చేందుకు రవాణా చార్జీని అందిస్తున్నారు. అయినా కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై ఇక్కడి ఇసుకను వాడుతున్నారు. లంచాలకు అలవాటుపడిన అధికారులు నోరు మెదపడం లేదు. ఈ క్రమంలో మంజీర ఇసుక కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్న మంజీర ఇసుక ప్రభుత్వ పనులే కదా ఉంటేనేం.. కూలితేనేం.. అన్న రీతిలో ఏ మాత్రం నిర్మాణాలకు ఉపయోగపడని ఇక్కడి ఇసుకను వాడుతున్నారు. ట్రాక్ట ర్ ఇసుక రూ.2500కే దొరుకుతుండడం, అధికారులు ఎవరూ అడ్డు చెప్పకపోవడం కాంట్రా క్టర్లకు కాసులు కురిపిస్తోంది. స్థానికంగా ఉన్న నాయకులు సైతం ఊరుకుంటుండడంతోపాటు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇక్కడి ఇసుకను అక్రమంగా రవాణా చేసేందుకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. రైతుల గోసపట్టని రెవెన్యూ అధికారులు మండలంలో 80శాతానికిపైగా బోర్లపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న పరిస్థితుల్లో నదిలో ఉన్న కొద్దిపాటి ఇసుకను తోడేస్తున్నా రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పని ఏదైనా విచారించకుండానే విచ్చల విడిగా అనుమతులు ఇస్తుండడంతో ఇసుకను భారీగా తరలిస్తున్నారు. ఇసుక తీస్తే బోర్లలో నీటిమట్టం తగ్గి పంటలు పండక తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలుమార్లు ఇక్కడి రైతులు అధికారులకు మొరపెట్టుకున్నా వారు అవేమీ పట్టించుకోవడం లేదు. కొందరు నాయకులు స్థానిక ఎమ్మెల్యే పేరుతో సమీప మంజీర పరివాహక ప్రాంతాల రైతులను బెదిరించి ఇక్కడి నుంచి ఇసుకను ఇతర మండలాలకు తరలించుకుపోవడం దినచర్యలా మారిపోయింది. ఇసుక అక్రమ రవాణాను ఆపాలి మా గ్రామం నుంచే గవర్నమెంట్ పనులకని ఇసుకను తరలిస్తున్నారు. దీంతో బోర్లలో నీరు చేరకుండా ఎండిపోతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇలా ఎంతకాలం ఇసుక అక్రమ రవాణాను కొనసాగిస్తారు. వెంటనే ఆపివేయాలి. – సంగప్ప, తుక్కాపూర్ పైనుంచి ఒత్తిడితోనే అనుమతులు పైనుంచి ఒత్తిడిలు ఎక్కువగా ఉన్నందునే మంజీర నది నుంచి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాల్సి వస్తోంది. ప్రభుత్వ పథకాలకు ఇసుక ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వాల్సి వస్తోంది. రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయమై చాలా సార్లు ఫిర్యాదులు అందాయి. అయినా ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వక తప్పడం లేదు. – రమేష్, తహసీల్దార్ -
వనభోజనంలో విషాదం
మల్కాజిగిరి: వనభోజనాలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. కార్తీకమాసంలో సరదాగా వనభోజనాలకు వెళ్లిన ఇద్దరు యువతులు మంజీరానదిలోపడి గల్లంతయ్యారు. స్థానికుల కథనం మేరకు.. మల్కాజిగిరి వెంకటేశ్వరనగర్‌లోని రాఘవేంద్ర అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న వసంత, భ్రమరాంభిక నగర్ సాయి సుబ్రహ్మణ్యం రెసిడెన్సీలో ఉంటున్న శ్రీవిద్య(21) ఇద్దరూ ఒకేచోట పనిచేస్తుంటారు. ఆదివారం వారు పనిచేసే మహిళా ఉద్యోగులంతా కలిసి మెదక్ జిల్లా జోగిపేట సమీపంలో ఉన్న చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్దకు వనభోజనాలకు వెళ్లారు. సమీపంలోని మంజీరా నది ఒడ్డున ఫొటోలు తీసుకుంటుండగా వసంత కూతురు రోహిత(17), శ్రీ విద్య(21) ప్రమాదవశాత్తు నదిలో జారిపడ్డారు. అక్కడున్న వారు రక్షించడానికి ప్రయత్నించినా నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొట్టుకొని పోయారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలించినా ఫలితం లేకపోయింది. శ్రీ విద్య తండ్రి సతీష్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా తండ్రికి చేదోడుగా తను ప్రైవేట్‌గా చదువుతూ ఉద్యోగం చేస్తున్నది.రోహిత స్ధానిక ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి సత్యనారాయణ ఫార్మా కంపె నీలో పనిచేస్తున్నారు. -
‘మంజీరా’లో ఇద్దరమ్మాయిల గల్లంతు
చిలప్‌చెడ్: మంజీరా నదిలో ఆదివారం ఇద్దరు అమ్మాయిలు గల్లంతయ్యారు. అందరూ చూస్తుండగానే నది ఉధృత ప్రవాహంలో వారు కొట్టుకుపోయారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చి ఇలా గల్లంతవడం విషాదం మిగిల్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిట్కుల్ శివారులో చోటుచేసుకుంది. హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన సతీశ్, రంజనల కుమార్తె శ్రీవిద్య (20) ఓపెన్ డిగ్రీ చదువుతూ ప్రైవేట్ కంపెనీలో సూపర్ వైజర్‌గా పని చేస్తోంది. అలాగే.. సత్యనారాయణ, వసంతల కుమార్తె రోహిత (16) ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. మల్కాజ్‌గిరికి చెందిన 30 మంది మహిళలతో కలసి వీరు చిట్కుల్ శివారులోని చాముండేశ్వరీ అమ్మవారి దర్శనానికి వచ్చారు. పక్కనే ప్రవహిస్తున్న మంజీరా నదిలో అందరూ స్నానాలు చేశారు. కొంత మంది అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లగా.. శ్రీవిద్య, రోహిత మళ్లీ నదిలోకి దిగారు. ఆ సమయంలో నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇద్దరు అమ్మాయిలు అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయా రు. అమ్మాయిలు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం లో గల్లంతైనా సాయంత్రం ఆరు గంటల వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గాలింపు చర్యలకు అవ కాశం లేదని చెబుతున్నారు. కాగా, సింగూరు జలా లు వదలడం.. పర్యాటక క్షేత్రమైన చాముండశ్వరీ ఆలయ పరిధిలోని మంజీరా నది వద్ద ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోవడంతో అమ్మాయిల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కుటుంబం కళ్లెదుటే.. యువతుల గల్లంతు
సాక్షి, చిలప్చేడ్ : మెదక్ జిల్లా చిలప్‌చేడ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. వనభోజనాల కోసం స్థానికంగా ఉన్న శ్రీ చాముండేశ్వరి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలసి రోహిణి (18), శ్రీవిద్య(17) వెళ్లారు. అనంతరం స్నానం చేయడానికి మంజీరా నదిలోకి దిగారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు ఒక్కసారిగా విడుదలవ్వడంతో నదిలో నీటి ప్రవాహం ఉధృతమైంది. దీంతో కుటుంబసభ్యులు చూస్తుండగానే శ్రీవిద్య, రోహిణిలు నదిలో కొట్టుకుపోయారు. విహారయాత్రకు వస్తే విషాదం మిగిలిందని యువతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
మంజీరనదిలో ఇద్దరు యువతుల గల్లంతు
-
మంజీరా వరదల్లో చిక్కుకున్న ఇద్దరు యువకులు
పాపన్నపేట: మంజీరా వరదల్లో శుక్రవారం ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని పురానాపూల్‌కు చెందిన ఆకుల మహేశ్, వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన భీంపల్లి బాల్‌రాజు సరదాగా గడిపేందుకు ఏడుపాయలకు వచ్చారు. స్నానం చేసేందుకు మంజీరా చెక్‌డ్యాం వద్ద నదిలోకి దిగారు. ఇంతలోనే వరదలు పోటెత్తడంతో ప్రవాహంలో పడి పోయారు. ఒకరు చెక్‌డ్యాంపై ఉన్న ఊచను పట్టుకోగా, మరొకరు బండరాయి ఎక్కి కూర్చున్నారు. క్షణక్షణం ప్రవాహం పెరుగుతుండటం చూసి వారు ప్రాణభయంతో కేకలు వేయడం మొదలు పెట్టారు. ఏడుపాయల సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్ఐ సందీప్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ఏం చేయాలో వారికి అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో నదిపై వంతెన పనులు చేస్తున్న బిహార్ కూలీలు సురేష్, చరణ్‌సింగ్ తాము రక్షిస్తామని ముందుకు వచ్చారు. దీంతో మిగిలిన కూలీలు వారిద్దరికి తాడు కట్టి నదిలోకి పంపారు. పోటెత్తిన ప్రవాహాన్ని అధిగమిస్తూ ధైర్యసాహసాలతో గంటపాటు కష్టపడి మహేష్, బాల్రాజును ఒడ్డుకు చేర్చారు. కాగా, సురేష్, చరణ్‌సింగ్ సాహసానికి మెచ్చుకున్న పోలీసులు నగదు ప్రోత్సాహం అందించారు. -
మంజీర నదిలో ఇసుక దోపిడీ
► మహారాష్ట్ర అనుమతులతో జిల్లా భూభాగంలో తవ్వకాలు ► ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లోతరచూ ఉద్రిక్త పరిస్థితులు నిజామాబాద్ : మంజీర నదిలో మహారాష్ట్ర మాయగాళ్లు దోపిడీ చేస్తున్నారు. మహారాష్ట్ర క్వారీల అనుమతుల పేరిట నదిలో సరిహద్దులు దాటి జిల్లా భూభాగంలోకి చొచ్చుకు రావడం ఏటా పరిపాటిగా తయారైంది. రాత్రికి రాత్రి జిల్లా భూభాగంలో ఇసుక తవ్వకాలకు పాల్పడుతూ మన వనరులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీంతో భూగర్భజలాలు పడిపోయి.. జరగాల్సిన నష్టం జిల్లాకు జరిగిపోతుండగా.. ఇసుకపై ఆదాయం మాత్రం మహారాష్ట్ర సర్కారుకు వెళ్తోంది. నదిలో సరిహద్దుల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య చాలా ఏళ్లుగా వివాదం కొనసాగుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏటా మహారాష్ట్ర కాంట్రాక్టర్లు జిల్లా భూభూగంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఇటీవల శాఖాపూర్ (మహారాష్ట్ర) క్వారీ పేరిట కోటగిరి మండలం సుంకిని గ్రామ భూభాగంలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరిగాయి. దీంతో గ్రామస్తులు వెళ్లి ఈ తవ్వకాలను నిలిపేయించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయా శాఖల అధికారులు వెళ్లి ఇసుక తవ్విన జేసీబీని సీజ్ చేశారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలోని శాఖాపూర్ క్వారీ అనుమతి పేరిట సుంకిని గ్రామశివారులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరిగినట్లు జిల్లా రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు గుర్తించారు. ఇలా మహారాష్ట్ర క్వారీల పేరిట తవ్వుతున్న ఇసుకను తెలంగాణలోని వివిధ పట్టణాలకే తరలించి కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. వట్టి పోతున్న పథకాలు తెలంగాణ–మహారాష్ట్ర మధ్య ప్రవహించే మంజీరకు కోటగిరి, బోధన్ మండలాల గ్రామాలు సుంకిని, మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గెల్లి, కల్దుర్కి, సిద్ధాపూర్, ఖండ్గాం, బిక్నెల్లి గ్రామాలున్నాయి. ఈ గ్రామాల పరిధిలో పలు ఎత్తిపోతల పథకాలున్నాయి. మహారాష్ట్ర అనుమతుల పేరిట నదిలో ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడంతో నది జలాధారంగా ఉన్న ఈ ఎత్తిపోతల పథకాలు గతంలో వట్టిపోయాయి. దీంతో ఈ గ్రామాల వాసులకు ఎండా కాలంలో కనీసం తాగునీరు కూడా దొరక్క పడరాని పాట్లు పడ్డారు. నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలతో సరిహద్దు గ్రామాల్లో బోర్లు వట్టిపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. మహా మాయగాళ్ల ఆగడాల కారణంగా ఎన్నో దుష్ఫలితాలను అనుభవించామని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు వాపోతున్నారు. క్వారీలకు అనుమతులు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదాయమే ధ్యేయంగా మంజీర నదిలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తోంది. సుమారు 12 ఇసుక క్వారీలకు ఈ సారి నాందేడ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం టెండరు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. ఈ క్వారీలను దక్కించుకున్న కాంట్రాక్టర్లు మంజీరను సరిహద్దులు దాటి కొల్లగొడుతున్నారు.