ఆంధోల్(మెదక్ జిల్లా): ఆంధోల్ మండలం రోళ్లపహాడ్ వద్ద మంజీరా నది వరద నీటిలో ప్రభాకర్(30) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రభాకర్‌కు నది పక్కనే రెండెకరాల పొలం ఉంది. పొలానికి కావాల్సిన నీటిని నదిలో మోటారు పెట్టి పారిస్తుంటారు. నేటి (ఆదివారం) ఉదయం నదిలో ఉన్న మోటారును ఇద్దరు కూలీల సహాయంతో బయటికి తీసేందుకు వెళ్లాడు.
తాడు సహాయంతో నదిలోకి ప్రభాకర్ దిగాడు. అదే సమయంలో వరద ప్రవాహం ఎక్కువ అవడంతో ప్రవాహానికి ప్రభాకర్ కొట్టుకుపోయాడు. స్థానికులు నదిలో ఎంత వెతికినా ప్రయోజన లేకపోయింది. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతయిన ప్రభాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.