‘ఎత్తి’ పోసేది ఎప్పుడో? | lifted irrigation scheme | Sakshi
Sakshi News home page

‘ఎత్తి’ పోసేది ఎప్పుడో?

Published Tue, Dec 10 2013 6:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

lifted irrigation  scheme

కోటగిరి, న్యూస్‌లైన్: తలాపున మంజీరా నది పారుతున్నా పంట పొలాలకు మాత్రం చుక్క నీరందడం లేదు. నై బారిన భూములకు నీరు పారించి సాగులోకి తెచ్చేందుకుగాను చేపట్టిన ఎత్తిపోతల పథకాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఫలితంగా కోటగిరి మండలంలోని సుంకిని, హెగ్డోలి, కొల్లూరు గ్రామాల రైతులు ఏటా సుమారు రూ.30 కోట్ల విలువైన పంట సాగును కోల్పోతున్నారు.
 
 సుంకిని ఎత్తిపోతలు
 సుంకిని ఎత్తిపోతల పథకం పూర్తయితే  బీడుగా ఉన్న సుమారు 1350 ఎకరాలు సాగులోకి వస్తాయి. దీని నిర్మాణానికి మొదటి విడతలో రూ. 1.23 కోట్లు మంజూరయ్యాయి. అధికారులు పనులు ప్రారంభించగానే కొంద రు రైతులు తమ పంటపొలాల్లో నుంచి కాలువ లు తీయవద్దని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించి పైపులైన్‌లు వేసేందుకు రెండో విడతగా రూ.85 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో సుంకిని నుంచి కొల్లూరు వరకు 3 కి.మీటర్ల మేర రైతుల పంట పొలాల నుంచిపైపులైను వేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
 
 అదేవిధంగా ఈ పథకం నిర్మాణం కోసం గ్రామాని కి చెందిన ఓరైతు నుంచి ఎకరం భూమిని కొనుగోలు చేసిన అధికారులు అందుకు సంబంధిం చిన డబ్బులు పూర్తిగా చెల్లించలేదు.దీంతో రైతు తన భూమిపరిధిలోనికి రానివ్వడం లేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతంతో ఈ భూమి ఖరీదు వేలల్లో వుండగా ప్రస్తుతం లక్షల రూపాయలు పలుకుతోంది. ఇప్పటి మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లిస్తేగానీ స్థలం అప్పగిం చేది లేదని రైతు భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో పనులు నిలిచిపోయి ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ ముళ్లపొదలు పెరిగిపోయాయి. ట్రాన్స్ ఫార్మర్ చెడిపోవడంతో దానికి మరమ్మతులు చేయిద్దామన్నా రైతు అధికారుల ను లోనికి రానివ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
 
 అసంపూర్తిగా హెగ్డోలి
 హెగ్డోలి ఎత్తిపోతల పథకం పూర్తయితే సుమా రు 850 ఎకరాలు సాగులోనికి వస్తాయి. పథక నిర్మాణానికి మొదటి విడతలో రూ. 90 లక్షలు, రెండవ విడతలో రూ. కోటి 60 లక్షలు మం జూరయ్యాయి.
  ఈ నిధులతో ఇన్‌టెక్‌వాల్, పం ప్‌హౌజ్ ని ర్మించగా పైపులైనులు సగం వరకే పూర్తయ్యా యి.
 
 కొల్లూరు ఎత్తిపోతల పథకం
 కొల్లూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే సుమా రు 850 ఎకరాలు సాగులోకి వస్తాయి. దీని నిర్మాణానికి మొదటి విడతలో రూ. 90 లక్షలు, రెండవ విడతలో రూ. 60 లక్షలు మంజూరుకాగా పనులు ప్రారంభించారు. సుమారు 300 మీటర్ల మేర పైపులైనులు పూర్తిచేయాల్సివుంది. పంప్‌హౌజ్ నిర్మించాల్సివుంది.
 
 రైతులతో ధర్నా చేస్తా : పోచారం
 ఇంకెన్నాళ్లకు ఎత్తిపోతలు పథకాలను పూర్తిచేస్తారు, మీ నిర్లక్ష్యం ఫలితంగా కొంత కాలంగా రైతులు ఏటా రూ. 30 కోట్ల మేర పంటపై వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నారని హెగ్డోలిలో అధికారులు, రైతులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి  మండిపడ్డా రు. మీరేం చేస్తారో నాకు తెలీయదు, నెలలోగా మిగిలిన పనులను పూర్తిచేసి రబీసీజన్‌లో వేసే పంటలకు నీరందించాలని అన్నారు. లేకపోతే కార్యాలయం వద్ద రైతులతో ధర్నా చేస్తానని పోచారం హెచ్చరించారు.
 
 75 శాతం పనులు పూర్తి
 -మాధవరావు, ఎత్తిపోతల పథకం కార్యదర్శి
 అనివార్య కారణాల వల్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలాయి. అధికారులు వర్షాకాలం మొదలయ్యే సమయంలో నిర్మాణ పనులు ప్రారంభించడంతో జాప్యం జరుగుతోంది. 75 శాతం మేర పనులు పూర్తయ్యాయి. సుంకిని-కొల్లూరు వరకు వేయాల్సిన 1300 మీటర్ల పైపులైనుకు 1250 మీటర్లు పూర్తిఅయింది. కేవలం 50 మీటర్లు వేయాల్సివుంది. హెగ్డోలి ఎత్తిపోతల పథకం దాదాపు పూర్తిగావచ్చింది. కొంత మేర పైపులైను పను లు ఆగాయి. కొల్లూరు ఎత్తిపోతల పథకం పూర్తికాగా పంప్‌హౌజ్ కట్టాల్సివుంది. నిధుల కొరతతో కొంత మేర పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు పూర్తిచేస్తాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement