మంజీరా నది పై లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బ్రిడ్జ్ అంచున ఆగిపోయింది. ఈ సంఘటన మనురు మండలం రాయిపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. బీదర్ వైపు పళ్లలోడుతో మంజీరా నది బ్రిడ్జ్ పై వెళుతుండగా లారీ టైర్ పంక్చర్ అయింది. దీంతో అదుపు తప్పి బ్రిడ్జ్ సైడ్ వాల్ను ఢీకొట్టి వాగువైపు దూసుకెళ్లింది.