నిజాంసాగర్, న్యూస్‌లైన్: మెదక్ జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి విడుదల చేసిన జలాలు మంజీరా నదిలో నిల్వలున్నాయి. నిజాంసాగ ర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలను గట్టెక్కించడానికి సిం గూరు ప్రాజెక్టు నుంచి నాలుగు టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వం అనుమతిని చ్చింది. దీంతో సింగూరు జలాశయం నుంచి గత నెల 26న టర్బయిన్ల ద్వారా 28న వరదగేట్ ద్వారా 9,000 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువనకు వదిలారు. ఐదు రోజుల పాటు సింగూరు జలాశయం ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టు కోసం నాలుగు టీఎంసీల నీటిని వదిలారు. ఈ నెల ఒకటి వరకు నీటివిడుదల పూర్తవడంతో వరదగేటు, టర్బయిన్ల ద్వారా నీటిని నిలిపివేశారు. ప్రస్తుతం సింగూరు జలాశయంలో 520.780 మీటర్లతో 17.492 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మట్టి దిబ్బలతో ప్రవాహానికి బ్రేకులు
సింగూరు జలాశయం నుంచి వదిలిన జలాలు మంజీరా నదిలో నిల్వలున్నాయి. సింగూరు ప్రాజెక్టు- నిజాంసాగర్ ప్రాజెకు మధ్య సుమా రు 95 కిలోమీటర్ల దూరం ఉంది. సింగూరు జలాశయం నుంచి వదిలిన జలాలు మంజీరా నదిలో ప్రవహిస్తుంటాయి. మంజీరా నదిలో మట్టిదిబ్బ లు, తుమ్మపొదలు, గుంతలు ఎక్కువగా ఉండటంతో నీటిప్రవాహానికి బ్రే కులు పడుతున్నాయి.దీంతో మంజీరా నదిలో నీటినిల్వలు అధికంగా పేరుకుపోతున్నాయి. దానికి తోడు మంజీర నది పై భాగంలో రైతులు వ్యవసాయ పంపుసెట్లను ఏర్పాటు చేసుకొని నదినీటి ద్వారా పంటలు పండించుకుంటున్నారు. ఇందుకు కోసం మంజీరా నదిలో నీరు నిల్వ ఉండేలా వారు గుంతలను తీసుకున్నారు. దీంతో మంజీరా నది నీటి ద్వారా వందల పంపుసెట్లు వేల ఎకరాల పంటలకు నీరందిస్తున్నాయి.
‘సాగర్’లో చేరింది 2.77 టీఎంసీల నీరు
సింగూరు జలాశయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయగా ఇప్పటివరకు 2.77 టీఎంసీలు వచ్చి చేరింది. రెండు ప్రాజెక్టుల మధ్య ఉన్న మంజీరా నదిలో సుమారు 1.2 టీఎంసీల నీ రు నిల్వ ఉంది. సింగూరు జలాశయం నుంచి నాలుగు టీంసీలకు వదిలినా పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడంతో ఆయకట్టు ప్రాంత రైతులు ఆం దోళన చెందుతున్నారు. మంజీరా నది ప్రాం తంలో ఉన్న దిబ్బలు, ముళ్లపొదలను తొలగించాలని జిల్లా యంత్రాంగాన్ని స్థానిక రైతాంగం కోరినా పట్టించుకున్న దాఖలాలు లేవు. వర్షాకాలంలో వరదలు వచ్చిన సమ యంలో మంజీరా నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న పంటపొలాల్లోకి నీరు వచ్చిచేరడంతో పంటలను రైతులు నష్టపోతున్నారు. అంతేకాకుండా సింగూరు జలాశయం నుంచి నీటిని వదిలిన ప్రతిసారి పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడంతో ఆయకట్టు ప్రాంత రైతులు సాగు జలాలను నష్టపోతున్నారు.
‘మంజీరా’లో సింగూరు నీటి నిల్వలు
Published Sat, Apr 5 2014 2:38 AM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM
Advertisement
Advertisement