బోధన్: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తున్న మంజీర నది పరీవాహక ప్రాంత గ్రామాలు సరుకులు, ఇసుక అక్రమ రవాణ దందాకు అడ్డాలుగా మారాయి. యథేచ్ఛగా సాగుతున్న సరుకుల అక్రమ రవాణతో సర్కారు ఖజానాకు భారీగా గండిపడుతోంది. అధికారులకు సరుకుల అక్రమ రవాణాపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
సరిహద్దు గ్రామాల మీదుగా..
మహారాష్ట్రకు సరిహద్దులో గల నియోజకవర్గం లోని బోధన్ మండలం ఖండ్‌గాం వద్ద రెండు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న మంజీర నదిపై వంతెన, రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గల గోదావరి నదిపై వంతెనల మీదుగా సరుకుల అక్రమ రవాణా సాగుతోంది. ఈ రెండు వంతెనలు మహారాష్ట్ర ప్రాంతంలోని ముఖ్య పట్టణాలైన కొండల్‌వాడి, బిలోలి, ధర్మాబాద్ సమీపంలో ఉన్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రం, అటు మహారాష్ట్ర ప్రాంతంలోని సుదూర ప్రాం తాల నుంచి వివిధ సరుకుల లోడ్‌లతో లారీలు ఈ రెండు వంతెనల మీదుగా రవాణా సాగుతోంది. రెండు రాష్ట్రాల ప్రాంతంలోని ముఖ్య నగరాలకు లారీలు సరుకులను చేరవేస్తున్నా యి.
నిబంధనలకు విరుద్ధంగా..
సరుకుల రవాణా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. నియోజక వర్గంలోని బోధన్ మండలం సాలూర వద్ద అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు ఉంది. ఈ చెక్‌పోస్టు మీదుగానే తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సరుకుల లారీల రవాణా ఉంటుంది. ఇక్కడ ఆర్‌టీవో, వాణిజ్య పన్నుల శాఖ, సివిల్ సప్లయ్, వ్యవసాయ మార్కెట్ శాఖ, ఎక్సైజ్ శాఖల చెక్‌పోస్టులున్నాయి.
నిబంధనల ప్రకారం పర్మిట్, వే బిల్లులు, పన్నులు చెల్లించిన రశీదులు ,డ్రైవింగ్ లెసైన్స్‌లుంటేనే లారీల రవాణకు అనుమతి ఇస్తారు. ఒవర్ లోడ్ సరుకులుంటే జరిమానా విధిస్తారు. అనుమతి పత్రాలు లేని సరుకుల రవాణాకు అనుమతించరు. ఇదంతా నిబంధనల ప్రకారం జరుగుతోంది. కాని ఎలాంటి ధ్రువీకరణ లేకుండా, విలువైన సరుకుల లోడ్‌తో వచ్చే లారీలు దొడ్డిదారుల్లో రవాణ సాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాత్రివేళ్లల్లో..
మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల ముఖ్య నగరాల నుంచి విలువైన మార్బుల్ రాయి, ఎరువులు. సిమెంట్, ఇనుము, ప్లాస్టిక్ సామగ్రి, మద్యం, ఇతర సరుకులు తెలంగాణ ప్రాంతంలోకి రవ ణా అవుతుంటాయి.సరుకుల డిమాండ్, ధర ప్రభావంతో ఇక్కడి నుంచి మహారాష్ట్రకు, అక్కడి నుంచి తెలంగాణ ప్రాంతానికి రవాణా అవుతుంటాయి.
తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యంగా వ్యవసాయోత్పత్తులు పత్తి, సో యా, వరి ధాన్యం ఎగుమతి అవుతాయి. సాలూర అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా సరుకుల రాకపోకలు సాగాల్సి ఉండగా, కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన రవాణాకు పాల్పడుతున్నారు. ఖండ్‌గాం, కందకుర్తి గ్రామాల మీ దుగా మంజీర,గోదావరి నదుల వంతెనపై నుంచి రవాణకు పాల్పడుతున్నారు.
సరిహద్దు గ్రామాల్లో రహదారులు అక్రమార్కులకు అడ్డా లు మారుతున్నాయి. అక్రమ రవాణా దందా ఎక్కువగా రాత్రి వేళల్లో కొనసాగిస్తున్నారు. పలు మార్లు రెంజల్ పోలీసులు కలప అక్రమ రవాణ లారీలను పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. విలువైన కలప తెలంగాణ ప్రాంతంలోకి దిగుమతి అవుతోంది.
నిద్రపోతున్న నిఘా...
సరిహద్దు గ్రామాల వద్ద ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణ, నిఘా కరువైంది. కేవలం బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్వర్యం లో బోధన్ మండల ఖండ్‌గాం, రెంజల్ మండలం సాటాపూర్ గ్రామల వద్ద మాత్రమే పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల నుంచి ఖండ్‌గాం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన పరిశీలన కేంద్రం మూ తపడింది. సిబ్బంది కొరత వల్ల ఇక్కడి నుంచి కొంతమందిని సాటాపూర్‌కు మార్చారని సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు. రోజుకు పదుల సంఖ్యలో లారీల రాకపోకలు సాగుతున్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తప్ప ఇతర శాఖల పర్యవేక్షణ లేదు.
జిల్లా యంత్రాంగం మేలుకోవాలి..
జిల్లా అధికార యంత్రాంగం మేలుకొని సరి హద్దు గ్రామాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేక పోతే సరుకుల అక్రమ రవాణాల వల్ల ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోవడం ఖాయం.ఆయా శాఖలు చెక్‌పోస్టుల ఏర్పాటుతో పాటు మొబైల్ స్వ్కాడ్‌లను నియమించాలి.
సరిహద్దులో అక్రమ రవాణా
Published Sun, Nov 9 2014 3:21 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement