
కందుకూరు: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి పెద్ద సోదరుడు యాదగిరిరెడ్డి (85) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మం డలం తిమ్మాపూర్‌లోని తన నివాసంలో బుధవారం రాత్రి కన్నుమూశారు. అంత్యక్రియలు గురువారం స్వగ్రామంలో జరగనున్నాయి. సోదరుడి మృతి వార్త తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని పలువురు బీజేపీ నాయకులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment