brother died
-
ఎల్బీనగర్ ప్రేమోన్మాది శివకుమార్‌కి నేరచరిత్ర!
సాక్షి, రంగారెడ్డి: ఎల్బీనగర్ ప్రేమోన్మాది ఘాతుకం వ్యవహారంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితుడు శివకుమార్‌ను అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివకుమార్ స్వస్థలం రంగారెడ్డిలోని నేరెళ్ల చెరువు. కొంతకాలంగా సైకోలా ప్రవర్తిస్తూ.. ఆఖరికి సంఘవి, ఆమె సోదరుడిపై ఘాతుకానికి దిగాడు. అయితే.. అతనిలో ఉన్మాద ప్రవర్తన ఈనాటిదే కాదు. గతంలో.. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు గతంలో తల్లి, తండ్రిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని సుత్తెతో తలపై మోదీ హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ప్రియురాలిపై దాడి, ఆమె తమ్ముడి హత్యతో ఘటనలతో శివకుమార్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. దీంతో తండ్రి హత్యకు సంబంధించిన వివరాలతోపాటు నిందితుడి నేర చరిత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో ఆదివారం ప్రేమించిన యువతి దూరంపెట్టిందని ఓ యువకుడి ఘాతుకానికి పాల్పడిన ఉదంతం విదతమే. ప్రియురాలిపై హత్యాయత్నానికి పాల్పడటమే కాకుండా ఆమె తమ్ముడిని దారుణంగా హతమార్చాడు. నిందితుడిని సీరియల్స్‌లో నటుడిగా పనిచేస్తున్న ఫరూఖ్‌నగర్ మండలం, నేరేళ్లచెరువుకు చెందిన శివకుమార్‌గా గుర్తించారు. అతడికి స్థానికులు దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్‌గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్‌నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్‌మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్‌లోనే నివాసం ఉంటూ ఆరి్టస్ట్‌గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్‌ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్‌రెడ్డి, ఇతర నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్వగ్రామంలో విషాదఛాయలు మూడు రోజుల క్రితమే రాఖీ పండుగ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చిన సంఘవి, పృథ్వీ శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆదివారం దాడి ఘటన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెళ్లి చేసుకోవాలని సంఘవిపై ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శివకుమార్ ఆదివారం సాయంత్రం ఎల్బీ నగర్లో ఉంటున్న సంఘవి ఇంటికి వెళ్లి ఆమైపె కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తమ్ముడు పృథ్వీపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
హిజాబ్ ఆందోళనల్లో సోదరుడు మృతి.. జుట్టుకత్తిరించుకున్న యువతి
టెహ్రాన్: హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. 10వ రోజుకు చేరుకున్న ఈ నిరసనలు యావత్ ప్రపంచాన్ని తమవైపు చూసేలా చేశాయి. పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారి పోలీసులు కాల్పులు జరపడంతో ఇప్పటివరకు 41 మంది చనిపోయారు. 2019 చమురు ధరల ఆందోళనల తర్వాత ఇరాన్లో ఇవే అతిపెద్ద నిరసనలు కావడం గమనార్హం. అయితే నిరసనల్లో భాగంగా ఇటీవల జరిగిన ఓ హింసాత్మక ఘటనలో జవాద్ హెయ్దరి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కాల్పుల్లో ఇతను చనిపోయాడు. కాగా.. అంత్యక్రియల్లో అతని సోదరి శోకసంద్రంలో మునిగిపోయింది. హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న అతని మృతికి సంతాపంగా భౌతికకాయం పక్కనే ఏడుస్తూ జుట్టు కత్తిరించుకుంది. ఇందుకు సంబంధించిన హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Javad Heydari's sister, who is one of the victims of protests against the murder of #Mahsa_Amini, cuts her hair at her brother's funeral.#IranRevolution #مهسا_امینیpic.twitter.com/6PJ21FECWg — 1500tasvir_en (@1500tasvir_en) September 25, 2022 22 ఏళ్ల మహ్సా అమీని మృతితో ఇరాన్లో హిజాబ్ నిరసనలు ఉద్ధృత రూపం దాల్చాయి. ఆమె హిజాబ్ ధరించలేదనే కారణంతో పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో దారుణంగా కొట్టడం వల్లే అమీని చనిపోయిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు మాత్రం గుండెపోటు వల్లే ఆమె చనిపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత హిజాబ్ ఆందోళనలు ఇరాన్‌తో పాటు ప్రపంచ దేశాలకు విస్తరించాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లండన్‌లోని ఇరాన్ ఎంబసీ ముందు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. చదవండి: మరింత మందిని కనండి.. ఇటాలియన్లకు పోప్ పిలుపు -
టాలీవుడ్లో మరో విషాదం.. హీరో సోదరుడు మృతి
Actor Kiran Abbavaram Brother Died In Road Accident: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రోజుల వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణాలు విడిచారు. ఈ విషాదాల నుంచి తేరుకోకముందే టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి మృతిచెందాడు. బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై రామాంజులు కన్నుమూశాడు. దీంతో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ‘రాజావారు రాణిగారు’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ చిత్రంతో గుర్తింపు పొందాడు. రామాంజులు రెడ్డి మృతితో ఆయన ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. -
Tamil Nadu: పన్నీర్‌సెల్వం సోదరుడు కన్నుమూత
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం తమ్ముడు ఓ బాలమురుగన్ (55) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాలమురుగన్ మూడేళ్లకు పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు, మూడు శస్త్రచికిత్సలు కూడా చేసుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. కొన్నిరోజుల క్రితం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం నుంచి కోలుకుని గురువారం రాత్రి తేని జిల్లా పెరియకుళత్తిలోని ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏమి జరిగిందో కాని శుక్రవారం తెల్లవారుజాము 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. బాలమురుగన్‌కు భార్య లతా మహేశ్వరి, కుమార్తె ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఫోన్ ద్వారా పన్నీర్‌సెల్వంతో మాట్లాడారు. సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: మహారాష్ట్రలో 52 మందిని బలిగొన్న బ్లాక్ ఫంగస్ -
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కుటుంబంలో విషాదం
కందుకూరు: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి పెద్ద సోదరుడు యాదగిరిరెడ్డి (85) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మం డలం తిమ్మాపూర్‌లోని తన నివాసంలో బుధవారం రాత్రి కన్నుమూశారు. అంత్యక్రియలు గురువారం స్వగ్రామంలో జరగనున్నాయి. సోదరుడి మృతి వార్త తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని పలువురు బీజేపీ నాయకులు పరామర్శించారు. -
నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం
సాక్షి, పశ్చిమ గోదావరి : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. బన్నీ వాసు సోదరుడు గవర సురేష్ అకాల మరణం చెందారు. కిడ్నీలు ఫెయిలవ్వడంతో బెంగుళూరులోని ప్రైవేటు ఆసుప్రతిలో చేరగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి అస్పత్రిలోనే మృతి చెందారు. సురేష్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. కాగా పాలకొల్లుకు చెందిన గవర సూర్యనారాయణకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారులలో ఒకరు నిర్మాతగా(బన్నీ వాసు) వెలుగొందుచుండగా, పెద్దకుమారుడు సురేష్ ఇంజనీరింగ్ చదివి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబందించిన ఇంజనీర్లలో టాప్ 4లో ఒకరుగా ఉన్నారు. డీజిల్, పెట్రోలు 4 వీలర్ వెహికల్ లను సీఎన్జీ(కంప్రెసర్,నేచురల్ గ్యాస్)లోకి కన్వెర్షన్ చేసే కిట్స్ తయారీ కంపెనీ స్థాపించి అగ్రగణ్యునిగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయన అకాల మరణం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. చదవండి : ప్రముఖ కొరియోగ్రాఫర్‌కు గుండెపోటు -
అశ్రునయనాల మధ్య ప్రభాకర్ అంత్యక్రియలు
కరీంనగర్ : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ అంత్యక్రియలు గురువారం అశ్రునయనాల మధ్య సప్తగిరికాలనీ శివారులో ఉన్న మానేరుతీరం స్వర్గధామంలో ముగిశాయి. అంతిమయాత్ర మొదలవుతుండగానే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన సోదరుడు ప్రభాకర్ మృతదేహం వద్ద బోరున విలపించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు దంపతులు, మేయర్ రవీందర్‌సింగ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, సుడా చైర్మన్ జీవి రామక్రిష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ వాసాల రమేశ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్నాయకులు ఆది శ్రీనివాస్, సీపీఐ, సీపీఎం జిల్లా నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, టీజేఎస్ నాయకులు నరహరి జగ్గారెడ్డితో టీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, గంగుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన ఆయా పార్టీల కార్యకర్తలు, అధికారులు, గ్రానైట్ క్వారీలల్లో పనిచేసే కార్మికులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. పెద్ద కుమారుడు రోహిత్ ప్రభాకర్ చితికి నిప్పంటించారు. మంత్రి హరీష్, ఎంపీల పరామర్శ ‘గంగుల’ కుటుంబాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సిద్దిపేట ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌బాబు పరామర్శించారు. -
పెళ్లింట విషాదం
తాండూర్(బెల్లంపల్లి) మంచిర్యాల : మరో రెండు రోజుల్లో పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంటిపై విధి కన్నెర్ర జేసింది. బంధుమిత్రులు, సన్నిహితులతో సందడిగా ఉండాల్సిన ఆ ఇల్లు ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయింది. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు యువకుడి ప్రాణాన్ని కబలించడంతో ఆ ఇంట్లో కన్నీళ్లే మిగిలాయి. తాండూర్ మండలంలోని రేచిని రైల్వేస్టేషన్ కోల్‌యార్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శివరాత్రి రాహుల్ (19) అనే యువకుడు మృతి చెందడంతో తాండూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశ్వరి–రామస్వామి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి రాహుల్ ఉన్నారు. రామస్వామి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ నెల 9న వారి పెద్ద కుమార్తె మౌనిక వివాహం జరగాల్సి ఉంది. ఈ పెళ్లి శుభలేఖలను పంచేందుకు రాహుల్ సోమవారం బెల్లంపల్లిలోని బంధువుల ఇంటికి తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి బైక్‌పై వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా రేచిని కోల్‌యార్డు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఓ ఐచర్ వ్యాన్ వేగంగా వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాహుల్ తలకు తీవ్ర గాయాలు కాగా ప్రశాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన రాహుల్‌ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందాడు. రాహుల్ బెల్లంపల్లి ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ మేరకు తాండూర్ ఎస్సై రవి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మిన్నంటిన రోదనలు రాహుల్ అకాల మరణంతో పెళ్లి ఇంట్లో బంధువుల రోదనలు మిన్నంటాయి. భర్త రామస్వామి కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా ఉన్న ఒక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. -
పెళ్లి చూపులకు పిలవలేదని ఆత్మహత్య
రాయదుర్గం(అనంతపురం): తమ్ముడి పెళ్లి చూపులకు తనను పిలవలేదని మనస్తాపం చెంది రవి(28) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కె.పి.దొడ్డి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.