సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం తమ్ముడు ఓ బాలమురుగన్ (55) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాలమురుగన్ మూడేళ్లకు పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు, మూడు శస్త్రచికిత్సలు కూడా చేసుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. కొన్నిరోజుల క్రితం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
అనారోగ్యం నుంచి కోలుకుని గురువారం రాత్రి తేని జిల్లా పెరియకుళత్తిలోని ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏమి జరిగిందో కాని శుక్రవారం తెల్లవారుజాము 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. బాలమురుగన్‌కు భార్య లతా మహేశ్వరి, కుమార్తె ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఫోన్ ద్వారా పన్నీర్‌సెల్వంతో మాట్లాడారు. సంతాపం వ్యక్తం చేశారు.
చదవండి: మహారాష్ట్రలో 52 మందిని బలిగొన్న బ్లాక్ ఫంగస్
Comments
Please login to add a commentAdd a comment