
సాక్షి, పశ్చిమ గోదావరి : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. బన్నీ వాసు సోదరుడు గవర సురేష్ అకాల మరణం చెందారు. కిడ్నీలు ఫెయిలవ్వడంతో బెంగుళూరులోని ప్రైవేటు ఆసుప్రతిలో చేరగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి అస్పత్రిలోనే మృతి చెందారు. సురేష్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. కాగా పాలకొల్లుకు చెందిన గవర సూర్యనారాయణకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారులలో ఒకరు నిర్మాతగా(బన్నీ వాసు) వెలుగొందుచుండగా, పెద్దకుమారుడు సురేష్ ఇంజనీరింగ్ చదివి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబందించిన ఇంజనీర్లలో టాప్ 4లో ఒకరుగా ఉన్నారు. డీజిల్, పెట్రోలు 4 వీలర్ వెహికల్ లను సీఎన్‌జీ(కంప్రెసర్,నేచురల్ గ్యాస్)లోకి కన్వెర్షన్ చేసే కిట్స్ తయారీ కంపెనీ స్థాపించి అగ్రగణ్యునిగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయన అకాల మరణం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. చదవండి : ప్రముఖ కొరియోగ్రాఫర్‌కు గుండెపోటు
Comments
Please login to add a commentAdd a comment