జలంధర్: భారత్ శాంతికాముక దేశమని, అయితే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో మాత్రం వెనకడుగు వేయబోదని, సత్తా చూపిస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. వైమానిక దళాలు పరిస్థితులకు అనుగుణంగా జాగరూకతతో వ్యవహరిస్తున్నా యని కొనియాడారు. పంజాబ్‌లోని అదమ్‌పూర్‌లో భారత వైమానిక దళానికి చెందిన 223 స్వాడ్రన్, 117 హెలికాప్టర్ యూనిట్‌కు ప్రెసిడెంట్స్ స్టాండర్డ్స్ ప్రదానం చేసే కార్యక్ర మంలో రాష్ట్రపతి మాట్లాడారు. అంతర్జాతీయంగా అనేక రంగాల్లో దూసుకెళ్తున్న భారత్.. సాయుధ దళాల శక్తి, సామర్థ్యాల విషయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. సాయుధ దళాలు దేశ రక్షణలో నిమగ్నమై ఉన్నాయన్న ధైర్యంతోనే ప్రజలు నిశ్చింతగా నిదురిస్తున్నారని పేర్కొన్నారు. తర్వాత అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని రాష్ట్రపతి సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment