అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రదేశాల పేర్లు మార్చడానికి చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే చైనా తన తీరు మార్చుకోకపోగా ఆ ప్రాంతం మా సార్వభౌమాధికారం అని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగో మాట్లాడుతూ..జాంగ్నాన్(అరుణాచల్‌ప్రదేశ్) చైనా భూభాగంలో భాగం. ఆ భౌగోళిక పేర్లనను తమ స్టేట్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగానే చైనా అధికారులు ప్రమాణీకరించారని కరాఖండీగా చెప్పింది.
ఇది చైనా సార్వభౌమ హక్కుల పరిధిలో ఉందని వాదిస్తోంది. కాగా. చైనా పౌరవ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేర్లను పెట్టి..జాగ్నాన్ పేరుతో టిబెట్‌లో భాగమని ప్రకటించింది. దీనికి భారత్ ఘాటుగా బుదలివ్వడమే గాక ఆ పేర్లన్నింటిని తిరస్కరించింది. ఈ మేరకు భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి కూడా అరుణాచల్‌ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని నొక్కి చెప్పారు. చైనా ఇలా చేయడం తొలిసారి కాదు, ఇలాంటి దుశ్చర్యలు ఎన్ని చేసినా వాస్తవాన్ని మార్చలేదని బాగ్చి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment